edapadi palaniswamy
-
తమిళనాడు అసెంబ్లీలో వైఎస్ జగన్‌కు జేజేలు
తమిళనాడు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ప్రతిధ్వనించింది. తీవ్రకరువు పరిస్థితుల్లో తెలుగుగంగ నీరిచ్చి ఆదుకున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యుల సాక్షిగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ప్రజల దాహార్తిని చెంబరబాక్కం, పూండి, పుళల్, చోళవరం జలాశయాలు తీరుస్తున్నాయి. 2018లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2019లో చెన్నై నగరం, శివారు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొన్నాయి. జోలార్‌పేట నుంచి రైలుద్వారా చెన్నైకి నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రుతుపవనాల ప్రవేశం, ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణానీటి రాకతో నాలుగు జలాశయాల్లో నీటి మట్టం పెరిగింది. నగర శివారు ప్రాంతాల్లోని చివరి ఇంటి వరకూ మెట్రోవాటర్ సరఫరా చేయాలని అధికారులు తీర్మానించారు. ఇంతవరకు కృష్ణానది నుంచి తెలుగుగంగ పథకం కింద నాలుగు టీఎంసీల నీరువచ్చింది. ఈ నీటితో ఐదు నెలలపాటు నీటిని సరఫరా చేయవచ్చు. ఈ ఏడాది నీటి కొరత ఉండకపోవచ్చు. కృష్ణా నీరు ఆదుకోవడం వల్లనే చెన్నై నలుమూలలా మెట్రో వాటర్‌ను సరఫరా చేయగలిగామని సీఎం ఎడపాడి అన్నారు. ఫిబ్రవరి ఆఖరు వరకు పూండికి కృష్ణా నీటిని సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు మెట్రోవాటర్ అధికారి ఒకరు చెప్పారు. ధన్యవాద తీర్మానం ఈనెల 6వ తేదీన ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రసంగానికి సీఎం ఎడపాడి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత ఏడాది వేసవిలో తీవ్రమైనకరువు పరిస్థితులు నెలకొనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర మంత్రులు స్వయంగా కలుసుకుని తెలుగుగంగ పథకం కింద తమిళనాడుకు కేటాయించిన నీటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగుగంగ నీటితో గ్రేటర్ చెన్నై ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. తమ కోర్కెను మన్నించి సకాలంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తమిళనాడు నీటి అవసరాలను మరింత మెరుగుపరిచేలా గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి వీలైనంత త్వరగా వారి అంగీకారాన్ని పొందాలని కోరుతూ ఉత్తరాల ద్వారా, స్వయంగా కలిసినపుడు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశానని ఎడపాడి పేర్కొన్నారు. ఒకే ఏడాది 9 వైద్యకళాశాలను మంజూరు చేయించుకున్న ఘనతను సాధించామని సీఎం అన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి సీఎం ప్రసంగిస్తూ తిరువళ్లూరు జిల్లాలో ఓ యువతిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల చెల్లించనున్నట్లు చెప్పారు. కొత్త పథకాలకు రూ.6,580 కోట్లను కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెలిపారు. కొత్తగా ఏర్పడిన తొమ్మిది జిల్లాల్లో ప్రత్యేకాధికారుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు మంత్రి ఎస్పీ వేలు ప్రకటించారు. పౌరచట్ట సవరణపై వాకౌట్ పౌరహక్కు చట్టం సవరణను ఖండిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ అంగీకరించక పోవడంతో డీఎంకే సహా ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత జీరో అవర్‌లో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత దురైమురుగన్ మాట్లాడుతూ పౌరహక్కు చట్టం సవరణ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖండన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని స్పీకర్‌కు ప్రతిపక్ష నేత స్టాలిన్ ఒక్క ఉత్తరాన్ని ఇచ్చారు. ఈ ఉత్తరం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు గురువారంతో ముగుస్తున్నందున ఈరోజైనా తీర్మానం ప్రవేశపెడతారా అని స్పీకర్‌ను ప్రశ్నించారు. స్టాలిన్ ఉత్తరం ఇంకా పరిశీలనలో ఉందని స్పీకర్ బదులిచ్చారు. మరలా దురైమురుగన్ మాట్లాడుతూ పౌరచట్టం సవరణకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇక మాతీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారని నిలదీస్తూ సభ నుంచి సహ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వానికి ధైర్యం లేదని వాకౌట్ అనంతరం మీడియా వద్ద దురైమురుగన్ ఎద్దేవా చేశారు. -
విలీనం.. అనుమానం
► స్వరం మార్చిన పన్నీరు వర్గం ► అభిప్రాయ సేకరణ తరువాతే చర్చలన్న ఎడపాడి వర్గం ► నేటి నుంచి పార్టీ కార్యదర్శుల సమావేశం అన్నాడీఎంకేలోని వైరివర్గాల విలీన చర్చలపై ఇరువర్గాల్లోనూ మరోసారి అభిప్రాయ భేదాలు తలెత్తాయి. విలీనంపై అందరి అభిప్రాయాలను సేకరించాల్సి ఉందని సీఎం ఎడపాడి వర్గం, ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు ఆమోదం తెలుపుతామని పన్నీర్ వర్గం భీష్మించుకోవడంతో పాటూ పరస్పర విమర్శలు చేసుకోవడంతో మరోసారి బ్రేక్ పడింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీని, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం చర్చలు ప్రారంభించాలని రెండు రోజుల క్రితం ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం ఇరువర్గాలు చర్చల కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలను వేసుకున్నాయి. ఈ నిర్ణయం మేరకు ఇరువర్గాల కమిటీలు సోమవారం సాయంత్రం 4 గంటలకు కూర్చుని చర్చలు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి చర్చల్లో ఏమేమి మాట్లాడాలనే అవగాహన కోసం సీఎం ఎడపాడి తన ఇంటిలో సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. కొందరు నేతలు పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఎడపాడి సీఎం అయిన తరువాత ప్రజలకు ఆయనపై అభిమానం పెరిగింది, దీనికి తోడు 122 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి సీఎం పదవిని వదులుకునేది లేదని మంత్రులు, సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికల కమిషన్ వద్ద విచారణలో ఉన్నందున చర్చల అజెండాలో చేర్చవద్దని వారించారు. అయితే తన ఆధీనంలో ఉన్న ఆర్థిక మంత్రి పదవిని పన్నీర్‌కు అప్పగించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జయకుమార్ చేసిన ప్రకటన ఇరువర్గాల మధ్య మళ్లీ నిప్పు రాజేసింది. డిమాండ్లపై రాజీలేదు పన్నీర్ సెల్వం సైతం గ్రీన్‌వేస్ రోడ్డులోని తన ఇంటిలో తన వర్గ నేతలతో చర్చలు జరిపారు. సీఎం, ప్రధాన కార్యదర్శుల పదవులు కాదు, పార్టీ, రెండాకుల చిహ్నంను నిలబెట్టుకోవడం ముఖ్యమని పన్నీర్‌వర్గం నేతలు అభిప్రాయపడ్డారు. పన్నీరుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవ్వడం ఆయన అంతస్తును తగ్గించాలని ఎడపాడి వర్గం భావిస్తున్నదని వ్యాఖ్యానించారు. శశికళ, దినకరన్ నుంచి రాజీనామాలు తీసుకోవాలని, జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న తమ రెండు ప్రధాన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని పన్నీర్ వర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి పేర్కొన్నారు. ఈ రెండు డిమాండ్లను ఎడపాడి వర్గం ఆమోదించిన తరువాతనే చర్చలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో విలీన చర్చలకు విఘాతం ఏర్పడింది. ఇదిలా ఉండగా పన్నీర్‌సెల్వంను వై కేటగిరికి భద్రతలోకి తీసుకుంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో పన్నీర్‌సెల్వం ప్రాధాన్యతను పెంచుతున్నట్లు తద్వారా కేంద్రం సంకేతాలు ఇచ్చింది. శశికళ, దినకరన్‌ల నుంచి రాజీనామాలు తీసుకోవడం అంత సులువు కాదు కాబట్టి చర్చలకు శాశ్వతంగా తెరపడినట్లు అనుమానించక తప్పదు. నేటి నుంచి జిల్లా కార్యదర్శుల సమావేశం మంగళవారం నుంచి మూడురోజులపాటూ అన్నాడీఎంకే అమ్మ జిల్లా కార్యదర్శుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా సీఎం ఎడపాడి పళనిస్వామి తరఫున రాష్ట్రంలోని కార్యదర్శులందరికి పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శులను మూడుగా విభజించి ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడురోజులపాటూ సమావేశాలు జరుపుతారు. రెండాకుల చిహ్నం, ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి, ప్రిసీడియం చైర్మన్, కోశాధికారి పదవులపై జిల్లా సర్వసభ్య సమావేశాల ద్వారా స్వీకరించిన అభిప్రాయాల్లో సవరణలు చేసేందుకే ఈ సమావేశాలు జరుపుతున్నట్లు సమావేశం. పనిలో పనిగా విలీనంపై కూడా జిల్లా కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. -
ఓపీఎస్ ఆట ముగిసింది..కానీ!
-
ఎల్లుండే బలనిరూపణ.. రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు!
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ నెల 18న (శనివారం) అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకోబోతున్నారు. ఈమేరకు బలనిరూపణ తేదీ ఖరారైంది. శనివారం ప్రత్యేకంగా రాష్ట్ర శాసనసభ ఇందుకోసం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు పళనిస్వామి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి కువత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. బలనిరూపణ జరిగేవరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇక్కడ బస చేయనున్నట్టు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా రిసార్ట్‌కు వచ్చేశారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిననాటి నుంచి శశికళ వర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఇక్కడ ఉంచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా బలపరీక్షకు గవర్నర్ 15రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈ తంతును సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి.. మెజారిటీ చాటుకోవాలని పళనివర్గం భావిస్తున్నది. తమకు ప్రస్తుతం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం చెబుతున్నది. బలపరీక్ష నాటికి పన్నీర్ గూటికి చేరిన మిగత ఎమ్మెల్యేలు కూడా తమవైపు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు చివరివరకు ముఖ్యమంత్రి పదవి కోసం చివరివరకు ప్రయత్నిస్తానని ప్రకటించిన పన్నీర్ సెల్వం.. పళని బలపరీక్షలో నెగ్గకుండా ఏమైనా ఎత్తులు వేస్తారా? మరింత మంది ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోగలుగుతారా? అన్నది వేచి చూడాలి. -
సీఎం వెంట చిన్నమ్మ తనయుడు..
-
సీఎం వెంట చిన్నమ్మ తనయుడు..
పళని, మంత్రుల వెంట వెళ్లి.. జయలలిత సమాధి వద్ద నివాళులు.. తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించిన అనంతరం ఎడపాడి కె.పళనిస్వామి తన మంత్రులతో కలిసి నేరుగా మేరినా బీచ్‌లోని దివంగత సీఎం జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రుల వెంట వచ్చిన వీకే శశికళ అక్క కొడుకు టీవీవీ దినకరన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం వెంట ముందువరుసలో నిలుచొని దినకరన్ నివాళులర్పించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో తనకు జైలు శిక్ష పడటంతో శశికళ తన అక్క కొడుకు దినకరన్‌ను డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. శశికళ జైలులో ఉన్న నేపథ్యంలో పార్టీని తన కనుసన్నలలో ఉంచుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్టు భావిస్తున్న నేపథ్యంలో దినకరన్‌ను కొత్త కేబినెట్లో మంత్రిగా తీసుకోవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా.. పార్టీలో ఆయన ఆధిపత్యం, శశికళ పట్టు తగ్గలేదని అంటున్నారు. -
బలనిరూపణకు 15రోజులా?
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామికి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15రోజుల గడువు ఇవ్వడాన్ని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. బలనిరూపణకు 15రోజులు ఇవ్వడం చాలా ఎక్కువ గడువు అని, దీనివల్ల ఎమ్మెల్యేలకు తాయిలాలు ఎరవేసి.. కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా గవర్నర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. డీఎంకే ఎంపీ ఎలంగోవన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బలనిరూపణ కోసం 15 రోజులు ఇవ్వడాన్ని చూస్తే.. ఆయన మెజారిటీ నిరూపించుకుంటారని గవర్నర్‌కి కూడా నమ్మకం లేనట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడులో పదిరోజులుగా నెలకొన్న హైటెన్షన్ రాజకీయ డ్రామాకు తెరదించుతూ.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలు అందించిన పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
పన్నీర్‌ను దెబ్బతీసింది వాళ్లే!
ముచ్చటగా మూడోసారి కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మూడోసారి ఆయన ముఖ్యమంత్రి పదవీకాలం నేటితో ముగిసిపోయింది. శశికళ నమ్మినబంటు పళనిస్వామి 31మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నిన్నటివరకు తానే ముఖ్యమంత్రి అంటూ ధీమాగా ఉన్న పన్నీర్ సెల్వానికి ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? ఆయన అంచనా ఎక్కడ తప్పింది? సెల్వం ఆశించినట్టుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అన్నదానిపై ఆసక్తికర విశ్లేషణలు తమిళ మీడియాలో వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేలో 20 మందిదాక రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం ఉంది. వారు పరోక్షంగా స్టాలిన్‌కు మద్దతు ఇస్తున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలుశిక్ష పడటంతో ఆ రెబల్ ఎమ్మెల్యేలు తన గూటికి చేరుతారని ఓపీఎస్ కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన ఆశలు తల్లకిందులయ్యాయి. రెబల్ ఎమ్మెల్యేలలో చాలామంది కొత్తవాళ్లే. వాళ్లు తెగించి పన్నీర్ గూటికి రాలేకపోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒకవేళ తమపై వేటు పడితే.. తిరిగి ఎన్నికలకు వెళ్లి గెలుపొందుతామా? అన్న నమ్మకం కూడా వారిలో చాలామందికి లేదని అంటున్నారు. అందుకే వారు భద్రంగా ఉండే మెజారిటీ వైపే మొగ్గుచూపారని చెప్తున్నారు. ఇది అన్నాడీఎంకేను ఐక్యంగా ఉంచడంలో సాయపడింది. ఈ ఐక్యత వల్లే పళనిస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రి పదవి కోసం చివరివరకు పోరాడుతానని పన్నీర్ సెల్వం అంటున్నారు. పళనిస్వామి బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయమిచ్చారు. ఆలోపు ఏదైనా అద్భుతం జరిగి మూడింట రెండొంతుల మంది ఓపీఎస్‌కు జై కొడితే తప్ప ఆయన ఆశ నెరవేరే అవకాశం లేదు. ఇక పళనిస్వామి సీఎం కావడంతో ఓపీఎస్ రాజకీయ భవిష్యత్తు దాదాపు అంధకారమేనని భావిస్తున్నారు. -
ఓపీఎస్ ఆట ముగిసింది..కానీ!
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నమ్మినబంటు ఎడపాడి పళనిస్వామి ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం కోసం ఆయనను గవర్నర్ ఆహ్వానించడంతో.. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం ఆడుతున్న రాజకీయ చదరంగానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయింది. జయలలితకు నమ్మినబంటు అయిన పన్నీర్ సెల్వం.. చిన్నమ్మ కోసం సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే తిరుగుబాటుతో రాజకీయ డ్రామాకు తెరలేపిన సంగతి తెలిసిందే. సెల్వానికి మొదట అనూహ్య మద్దతు లభించింది. అమ్మ సమాధి వద్ద మౌనదీక్షతో ఆయన ప్రారంభించిన ఈ రాజకీయ చదరంగం తమిళనాట తీవ్ర ఉత్కంఠ రేపింది. తన వ్యూహాలతో, ఎత్తులు-పైఎత్తులతో కొంతవరకు అన్నాడీఎంకే నేతలను చీల్చగలిగిన సెల్వం.. శశికళపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆయన ఎంత ఒత్తిడి చేసినా మన్నార్గుడి కుటుంబం గుప్పిటను దాటి ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఇప్పటికే అన్నాడీఎంకేలో శశికళ కుటుంబానిదే ఆధిపత్యం. ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉండొచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోలేకపోయిన సెల్వం.. భవిష్యత్తులో ఆ పార్టీకి వ్యతిరేక గళంగా కొనసాగుతూ పుంజుకునే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతుదారులు తమ వర్గాన్ని ఐక్యంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు పన్నీర్ గూటికి చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిపి ఉంచేందుకు త్వరలోనే నాయకుడిని ఎన్నుకుని ముందుకుసాగుతామని పన్నీర్ మద్దతుదారులు అంటున్నారు. తమదే నిజమైన అన్నాడీఎంకే అని వారు వాదిస్తున్నారు. జయలలిత పాలన కోసం ప్రజలు ఓటేశారని, చిన్నమ్మ కుటుంబసభ్యుల కనుసన్నలలో ఉండే ప్రభుత్వం కోసం కాదని వారు అంటున్నారు. -
తమిళనాడు సీఎంగా పళనిస్వామి
-
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి నియమితులయ్యారు. ఆయనను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆహ్వానించారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు పళనిస్వామి తదితరులు లేఖ అందించడంతో గవర్నర్ ఆయనకు ముందుగా అవకాశం కల్పించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో శశికళ వర్గం అధికారాన్ని చేజిక్కించుకున్నట్లయింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు ట్రయల్ కోర్టు విధించిన జైలుశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయడంతో ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలకు గండి పడింది. దాంతో వెంటనే ఆమె రాష్ట్ర రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న పళనిస్వామిని తమ వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే కాక, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నుకున్నట్లు వెంటనే ప్రకటించారు. దాంతో.. ఆయనకు తొలుత అవకాశం కల్పించాలని గవర్నర్ విద్యాసాగర్‌రావు నిర్ణయించారు. 15 రోజుల్లోగా ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 1954 మార్చి 2న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి.. బీఎస్సీని మధ్యలోనే ఆపేశారు. 80లలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందునుంచి ఆయన అన్నాడీఎంకేలోనే ఉన్నారు. తొలుత జయలలితకు, ఆమె మరణం తర్వాత శశికళకు ఆయన విధేయుడిగా వ్యవహరించారు. సేలం డెయిరీ చైర్మన్ నుంచి మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అవుతున్నారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి.. పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! ఎవరీ పళనిస్వామి..? ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ ముఖ్యమంత్రిగా పళనిస్వామికి అవకాశం! గవర్నర్‌తో పళనిస్వామి భేటీ పళనిస్వామికే మెజార్టీ ఉంది... పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?