విద్యుదాఘాతంతో యువరైతు మృతి
కంబదూరు : మండలంలోని నూతిమడుగు గ్రామానికి చెందిన ఈడిగ రాజు (24) ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు... తనకున్న ఐదెకరాల పొలంలో మూడు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ స్టార్టర్లో ఫీజ్ పోవడంతో ఫీజ్ వేయడానికి పొలానికి వెళ్లాడు. ఫీజ్ వేస్తుడంగా ప్రమాదశావత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
సాయంత్రమైనా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రామాంజినేయులు, మాహదేవి చుట్టు పక్కల వెదికారు. ఎక్కడా కనపడక పోవడంతో పొలంలోకి వెళ్లి చూడగా స్టార్టర్ పెట్టె వద్ద శవమై కనిపించాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇలా అయిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.