Electric Regulatory Commission
-
ఎన్నాళ్ళీ.. నిరీక్షణ..! ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో షావోమీకి భంగపాటు!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఆటోమొబైల్ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2024కల్లా మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కానీ ఈ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. కార్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీ పర్మీషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని సమాచారం. బిజింగ్ కేంద్రంగా షావోమీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కోసం స్థలం చూసుకుంది. కానీ ఆ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన అనుమతుల్ని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిప్మార్ కమిషన్ అధికారులు ఇచ్చేందుకు సుముఖంగా లేరని, నెలల తరబడి సంబంధిత శాఖ అధికారుల్ని సంప్రదించినా పట్టించుకోవడం లేదని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. షావోమీకి కష్టమే వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. షావోమీ తన ప్రత్యర్ధులతో పోటీ పడుతూ ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారులకు కావాల్సిన ఈవీ వెహికల్స్‌ను అదించాలని, అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా అవతరిస్తుందని ఆశించాం. కానీ లైసెన్స్ పొందడంలో ఆలస్యం అవుతుందని.. ఇలాగే కొనసాగితే షావోమీ ప్రత్యర్ధులు మార్కెట్లో రాణిస్తారని ఆ సంస్థ సీఈవో లీ జున్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి
న్యూఢిల్లీ: స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రూపంలో పరిశ్రమ ముందు చక్కని అవకాశం ఉందని, దీనికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్ఏడీఏ) నిర్వహించిన 3వ ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వావలంబన లక్ష్యాల విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి భారీగా పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు ఎగుమతవ్వాలన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వృద్ధి చెందడంలో డీలర్లు, విడిభాగాల తయారీ సంస్థలు, వాహనాల తయారీ సంస్థల పాత్ర కీలకంగా ఉంటుందని పాండే పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రిటైల్ రంగం 45 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వానికి రూ. 95,000 కోట్లు కడుతోందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనికి పరిశ్రమ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పెట్టుబడులు అవసరమైన ఈ రంగంలోని సంస్థలు నిధులు సమీకరించుకునేందుకు దీనితో మరిన్ని అవకాశాలు లభించగలవని ఆయన పేర్కొన్నారు. అటు, విదేశీ ఆటోమొబైల్ సంస్థలు అర్ధాంతరంగా నిష్క్రమించడం వల్ల డీలర్లు నష్టపోకుండా తగు రక్షణాత్మక చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని గులాటీ విజ్ఞప్తి చేశారు. తుక్కు సర్టిఫికేషన్ కేంద్రాలుగా డీలర్ వర్క్‌షాప్‌లు.. వాహనాల తుక్కు (స్క్రాపేజీ) విధానానికి సంబంధించి డీలర్ల వర్క్‌షాపులే తనిఖీ, సర్టిఫికేషన్ కేంద్రాలుగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అనుమతించాలని ప్రభుత్వానికి ’సియామ్’ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా తనిఖీ కేంద్రాలను ప్రారంభించాలంటే చాలా సమయం పట్టేయవచ్చని, ఇవి అంత లాభసాటిగా కూడా ఉండకపోవచ్చని పేర్కొంది. ఎఫ్ఏడీఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు డీలర్ల దగ్గర ఎలాగూ ఉంటాయి కాబట్టి ప్రతిపాదిత విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఈ డీలర్‌షిప్‌లు చాలా మటుకు కస్టమర్లకు దగ్గర్లోనే ఉండటమనేది మరో సానుకూలాంశం‘ అని ఆయన వివరించారు. అటు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు నిర్దేశించిన 15–20 ఏళ్ల వ్యవధి చాలా సుదీర్ఘమైనదని, అంతకన్నా ముందుగానే టెస్ట్ నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. చదవండి: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
ముందుంది ముంచేకాలం
సాక్షి, గుంటూరు :ముందుంది మరింత మంచికాలం అంటూ ప్రచార హోరెత్తిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు విద్యుత్ చార్జీల రూపంలో జనాన్ని ముంచేలా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. నాలుగేళ్ల నుంచి ఇంధన వ్యయ సర్దుబాటు చార్జీల(ఎఫ్ఏసీ) కింద కరెంటు చార్జీలు పెంచి వినియోగదారుడి నడ్డి విరిచిన ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఏకంగా విద్యుత్తు చార్జీలను భారీగా పెంచి కోలుకోలేని విధంగా దెబ్బతీయనుంది. ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ)కు డిస్కంలు సమర్పించిన పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిపి ఆమోదం తెలిపితే ఏప్రిల్ నుంచి పెరిగిన కరెంటు చార్జీలు అమల్లోకి రానున్నాయి. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్తు చార్జీలను చూస్తే వినియోగదారుడి గుండె గు‘బిల్లు’ మనాల్సిందే. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో సర్దుబాటు భారాన్ని సైతం జనంపై పడకుండా చూశారు. కానీ ప్రస్తుతం పాలకులు ప్రజా సంక్షేమాన్ని మరిచి చార్జీల బాదుడికే మొగ్గు చూపిస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలే టార్గెట్‌గా పెంచుతున్న విద్యుత్తు చార్జీలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో అన్ని కేటగిరీల కింద కరెంటు వినియోగిస్తున్నవారు 15 లక్షల మంది ఉన్నారు. వీరికి కరెంటు చార్జీల పెంపు పిడుగు లాంటి వార్తే. జిల్లాలో గృహ సర్వీసులు 13,09,239 ఉన్నాయి. కమర్షియల్ సర్వీసులు 92,920, ఎల్టీ ఇండస్ట్రియల్ సర్వీసులు 11,324, కాటేజీ ఇండస్ట్రీస్ అండ్ ధోభీ ఘాట్ సర్వీసులు 701 ఉన్నాయి. హెచ్‌టీ సర్వీసులు 723 వరకు ఉన్నాయి. వీటన్నిటిపై 50 పైసల నుంచి రూ.4.87 వరకు భారం పడనుంది. యూనిట్‌కి సగటున రూపాయి పెంపు.. వచ్చే ఏడాది నుంచి కరెంటు చార్జీలు పెంచితే జిల్లాపై నెలకు రూ.30 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. 50 యూనిట్ల లోపు వినియోగించే వారిని వదిలి పెట్టకుండా డిస్కంలు ప్రతిపాదనలు అందించాయి. సగటున యూని ట్‌కు రూపాయికి పైగా పెరగనుంది. జిల్లాకు రోజుకు 10 మిలియన్ల యూనిట్లు సరఫరా జరుగుతోంది. అంటే నెలకు 300 మిలియన్ యూనిట్లకు పైగా జిల్లాలో కరెంటు విని యోగిస్తున్నట్లు లెక్క. అన్ని కేటగిరీల్లో సగటున యూనిట్‌కు రూపాయికి పైగా పెరిగితే జిల్లాపై నెలకు రూ.30 కోట్లకు పైగా భారం పడుతుందన్న మాట. ప్రస్తుతం జిల్లాలో నెలకు విద్యుత్తు డిమాండ్ రూ.165 కోట్ల వరకు ఉంది. చార్జీలు పెరిగితే వచ్చే ఏడాది నుంచి అదనంగా రూ.30 కోట్లు ముక్కు పిండి వసూలు చేయనున్నారు. అంటే మొ త్తం డిమాండ్ రూ.195 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కరెంటు చార్జీలు ఈ రకంగా పెరిగితే బుడ్డి దీపాల విని యోగం తప్పేలా లేదని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.