eloped
-
పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం
సాక్షి, అనంతపురం: వివాహమైన మూడు రోజులకే ప్రేమించిన వ్యక్తితో నవ వధువు పరారయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన బండ్లపల్లి తిమ్మరాజు, ప్రశాంత్‌కుమార్ సోదరులు. వీరికి తండ్రి లేడు. బతుకు తెరువు కోసం తల్లి అంజనమ్మ కువైట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో సోదరులిద్దరూ అనంతపురానికి వలసవచ్చి నగర శివారులోని కురుగుంట వైఎస్సార్ కాలనీ నివాసముంటున్నారు. తిమ్మరాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, ప్రశాంత్‌కుమార్ డిగ్రీ పూర్తయి ఇంటివద్దనే ఉంటున్నాడు. గత నెల 9న ఓ యువతితో తిమ్మరాజుకు వివాహమైంది. ఈ పెళ్లి ఇష్టంలేని ఆమె పెళ్లైన మూడో రోజే అంతకు ముందు తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. నవ వధువు కనిపించకపోయే సరికి కంగారుపడ్డ తిమ్మరాజు, బంధువులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన తిమ్మరాజు ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడు ప్రశాంత్‌కుమార్ పలుచోట్ల వెతికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తే. -
ప్రియుడితో భార్య పరార్.. అతడి భార్యను పెళ్లాడిన బాధిత భర్త
పాట్నా: ఈయన పెళ్లాన్ని ఆయన.. ఆయన పెళ్లాన్ని ఈయన పెళ్లాడారు.. విధి ఆడిన వింత నాటకంలో ఒకరి భార్య మరొకరికి అర్థాంగి అయ్యింది. అర్థం చేసుకోవడానికి గందరగోళంగా ఉన్నా.. బిహార్‌లో జరిగిన వాస్తవం ఇది. ఖగారియా జిల్లాలో ఒకరి భార్యను మరొకరు పెళ్లాడారు. హార్డియా గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ సింగ్.. పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. నలుగురు పిల్లల తల్లైన నీరజ్ భార్య రూబీ దేవికి పెళ్లికి ముందు నుంచే తన గ్రామానికి చెందిన ముకేష్ అనే వ్యక్తితో పరిచయముంది. ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించింది. అయితే ముకేష్‌కు గతంలో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళల పేర్లు రూబీనే కావడం విశేషం. గతేడాది ఫిబ్రవరి 6న నీరజ్ భార్య రూబీ దేవి తన ముగ్గురు పిల్లల్ని(ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) తీసుకొని.. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడు ముకేష్‌ను పెళ్లి చేసుకుంది. ఇటు నీరజ్ తన కుమార్తెతో మిగిలిపోగా.. ముఖేష్ భార్య రూబీ దేవి కూడా తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉండిపోయింది. ముకేష్తో తన భార్య వెళ్లిపోయిన సంగతి నీరజ్‌కు తెలియడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టగా.. ప్రియురాలిని విడిచి ఉండేందుకు ముకేష్ అంగీకరించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన నీరజ్ పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ముకేష్ మొదటి భార్య ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా ఇద్దరూ నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఫిబ్రవరి 11న ఇంట్లో నుంచి పారపోయి. ఫిబ్రవరి 18న స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు జంటలు మధ్యప్రదేశ్‌లోని వేర్వేరుపట్టణాల్లో నివసిస్తున్నారు. నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. ముకేష్ రోజుకూలీగా పనిచేస్తున్నాడు. -
పెద్దలు కాదు.. విధి ఆ ప్రేమజంటను విడదీసింది
ఒకేచోట పని చేసే ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో చెబితే పెద్దలు కాదన్నారు. వీళ్లు ఎదురించారు. ఇంట్లోంచి వెళ్లిపోయి కలిసి బతకాలనుకున్నారు. కానీ, విధి ఈ లవ్‌స్టోరీని విచిత్రమైన మలుపు తిప్పింది. విషాదాంతమైన ముగింపు ఇచ్చింది. హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): బాపులపాడు మండలం వీరవల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ప్రేమజంట రోడ్డు ప్రమాదానికి గురైంది. 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెరువూరుకు చెందిన సారపు పోతురాజు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మెర్సీ కొంతకాలంగా ఓ స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ తమ పెద్దలకు చెప్పగా వారు అంగీకరించలేదు. ఈ నెల 19వ తేదీన మెర్సీకి వేరే యువకుడితో వివాహం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 18వ తేదీనే మెర్సీ, పోతురాజు తమ ఇళ్ల నుంచి పరారయ్యారు. దీంతో.. మెర్సీ అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెర్సీ, పోతురాజుతో కలిసి అతని స్వగ్రామమైన రంపచోడవరం మండలం చెరువూరులో ఉన్నట్లుగా గుర్తించారు. విచారణ నిమిత్తం తెనాలి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా ప్రేమికులకు పోలీసులు సూచించారు. దీంతో పోతురాజు, మెర్సీ బైక్‌పై తెనాలి బయలుదేరారు. వీరవల్లి సమీపంలో జాతీయ రహదారి ప్లై ఓవర్ బ్రిడ్జి మీదకు రాగానే పోతురాజు సెల్‌ఫోన్ మోగింది. అతను బైక్ నడుపుతూనే ఫోన్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. బైక్ అదుపుతప్పి వంతెన సైడ్ వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రేమికులు ఇద్దరూ ఎగిరి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో పోతురాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మెర్సీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వీరవల్లి ఏఎస్ఐ వై.ఆంజనేయులు, హైవే రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మెర్సీని హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నోట్: వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ కాల్ మాట్లాడడం మంచిది కాదు. నిర్లక్ష్యంగా చేసే ఈ పని.. జీవితాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. -
ప్రేమజంట నిర్వాకం: పెద్ద కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బుతో రెండో కూతురు
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): ఆ తండ్రికి ముగ్గురు కూతుళ్లు.. పొట్టచేత పట్టుకుని ఎడారి దేశం వెళ్లాడు.. కడుపు కట్టుకుని.. పైసాపైసా కూడబెట్టుకున్నాడు.. ఆ సొమ్ముతో ముందుగా పెద్దకూతురు వివాహం చేయాలని నిశ్చయించాడు.. కానీ, ప్రేమికుడితో కలిసి రెండోకూతురు ఆ సొమ్మును పట్టుకుని ఎటో వెళ్లిపోయింది.. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్నెగూడేనికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి వెతుక్కుంటూ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. తన ముగ్గురు కూతుళ్లలో పెద్దకూతురు వివాహం చేద్దామని భావించాడు. నెలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇన్నాళ్లూ కూడబెట్టిన రూ.6.40లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో నిల్వచేశాడు. బాధితుడికి డబ్బు అందిస్తున్న సీఐ రాజశేఖర్‌రాజు గమనించిన ఆయన రెండో కూతురు.. ఆ సొమ్ము తీసుకుని తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి పదిరోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తండ్రి.. ఈ విషయంపై కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ.. మేడిపెల్లి ఎస్సై సుధీర్‌రావు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, విజయ్‌తో కలిసి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ బృందం ఖమ్మం జిల్లా కూసుమంచిల ఆ ప్రేమజంటను గుర్తించి చాకచక్యంగా పట్టుకుంది. బుధవారం సీఐ రాజశేఖర్‌రాజు ఎదుట హాజరుపర్చింది. ఆ జంటనుంచి రూ.6లక్షలు రికవరీ చేశారు. పోలీసు బృందాన్ని మెట్పల్లి డీఎస్పీ రవీంద్రరెడ్డి అభినందించారు. ఈ సొమ్మును సీఐ రాజశేఖర్‌రాజు బాధితుడికి అందజేశారు. తన పెద్దకూతురు వివాహం కోసం దాచిన సొమ్ము మళ్లీ తన వద్దకు రావడంతో ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. సీఐ మాట్లాడుతూ, యువత తల్లిదండ్రులను నమ్మించి ప్రేమపేరిట మోసపోవద్దని సూచించారు. ఎస్సైలు సతీశ్, శ్యామ్‌రాజ్ పాల్గొన్నారు. -
పెళ్లికూతురి నిర్వాకం, పెళ్లైన 18 రోజులకే..
భోపాల్ : మనసులు కలిశాయో, లేదో చూడకుండానే ఇద్దరికీ పెళ్లి చేశారు. అమ్మాయిని అత్తారింటికి సాగనంపారు. కానీ ఆమె మనసు కట్టుకున్న భర్త మీదకు పోలేదు, అంతకు ముందు తన చేయి పట్టుకుని ఊసులాడిన ప్రియుడి దగ్గరే ఆగిపోయింది. గుండెల్లో ప్రియుడి జ్ఞాపకాలను మోస్తూ మరొకరితో ఉండలేననుకుంది. అలా అనుకుందో, లేదో.. పెళ్లైన 18 రోజులకే చెప్పా పెట్టకుండా ప్రియుడితో పారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూర్తి రైక్వార్ అనే 20 ఏళ్ల యువతికి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తితో డిసెంబర్ 6న వివాహమైంది. కానీ అప్పటికే ఆమె భజ్జు యాదవ్ అనే అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో ఉంది. పెళ్లయినా కూడా అతడి తలపుల్లో నుంచి బయటకు రాలేకపోయింది. మరోవైపు పెళ్లి తర్వాత జరిగే తంతు కోసం నూతన వధువు పుట్టింటికి పంపించారు. (చదవండి: ఆ కోరికే విద్యార్థులను లేచిపోయేలా చేసింది...) అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఆమె డిసెంబర్ 24న మెట్టినింటికి తిరుగు పయనమైంది. ఇక దొరికిందే ఛాన్సని భావించిన సదరు యువతి తన మెడలో మూడు ముళ్లు పడ్డాయన్న విషయాన్ని మర్చిపోయి ప్రియుడితో పరారైంది. లక్షలు ఖరీదు చేసే బంగారు నగలు, డబ్బును కూడా వెంటపెట్టుకుని ఉడాయించింది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తన భార్య దారిలోనే ఎవరితోనే జంప్ అయిందని తెలుసుకున్న భర్త అమ్మాయి ఇంటికి వెళ్లి నానా రభస చేశాడట. ఈ విషయం గురించి వధువు తండ్రి రామ్‌పాల్ మాట్లాడుతూ.. కూతురు కోసం అల్లుడు గాలిస్తున్నాడని తెలిపాడు. ఆమె రూ.5 లక్షలు విలువ చేసే నగలతో పాటు, రూ.20 వేలు పట్టుకెళ్లిందని పేర్కొన్నాడు. (చదవండి: చికెన్ లేదన్నాడని ఎంత పని చేశారు..) -
ప్రియుడితో వెళ్లేందుకు స్టోరీలు అల్లి..
లక్నో : ప్రియుడితో కలిసి జీవించేందుకు కిడ్నాప్, హత్య డ్రామా నడిపిన యువతి ఉదంతం యూపీలో వెలుగుచూసింది. గోరఖ్‌పూర్‌లో నివసించే ఓ వ్యక్తి కుటుంబానికి మీ కుమార్తెను అపహరించి హత్య చేశామని మెసేజ్ రావడంతో వారి ఇంట విషాదం నెలకొంది. అయితే ఓ యువకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో అతనితో వెళ్లేందుకే బాధితుడి కుమార్తే ఈ డ్రామాను ఆడిందని పోలీసులు నిర్ధారించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ‘మీ కుమార్తె జీవితాన్ని అంతం చేసి ప్రతీకారం తీర్చుకున్నాం..చాలా నెలల తర్వాత వచ్చిన అవకాశం అందిపుచ్చుకుని ఆమె ఆఫీస్‌కు వెళుతుండగా హతమార్చాం..వీరు ఎలాంటి తండ్రంటే కనీసం మీకు ఆమె ఆనవాళ్లు కూడా మిగల్చలేద’ని తండ్రి అనిల్ కుమార్ పాండే మొబైల్‌కు కుమార్తె కాజల్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌తో పాటు యువతి గాయాలు, రక్తపు మరకలతో కనిపిస్తున్న ఫోటోలను ఉంచడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీస్ విచారణలో కాజల్ డ్రామా బయటకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాజల్ మంగళవారం ఉదయం ఇంటినుంచి వెళ్లిందని, మొహరం పండుగ సెలవు గురించి అడగ్గా తనకు పనిఉందంటూ వెళ్లిందని ఆమె తండ్రి పాండే చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించామని అన్నారు. ఇక పోలీస్ విచారణలో కాజల్ ప్రేమ వ్యవహారం బయటపడింది. ప్రేమజంటను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన ఖాకీలు కాజల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఏడాది కిందట కాజల్‌కు ఆగ్రాకు చెందిన హరిమోహన్ ఓ డేటింగ్ యాప్‌లో పరిచమయ్యారు. డేటింగ్ యాప్‌లో మొదలైన వారి స్నేహం ప్రేమకు దారితీసిందని దర్యాప్తు అధికారి సుమిత్ శుక్లా వెల్లడించారు. ప్రేమికుల జంట కాల్ రికార్డులు, వారి మొబైల్ లొకేషన్ల ఆధారంగా ఈ కేసును ఛేదించామని చెప్పారు. కాగా తండ్రి వేధింపులు భరించలేక తాను ఇలా చేశానని, కుటుంబ సభ్యుల తీరుతో విసిగిన తాను బాయ్‌ఫ్రెండ్‌తో స్వేచ్ఛగా జీవించేందుకు ఆగ్రాకు పారిపోయేందుకే కిడ్నాప్, హత్య నాటకానికి తెరతీశామని వారు వెల్లడించారు. -
యువకుడితో ఇద్దరు యువతుల పరారీ!
సాక్షి, చిత్తూరు(పలమనేరు) : ఇరువురు యువతులు ఓ యువకుడితో పరారైన సంఘటన పలమనేరు మండలంలో బుధవారం వెలుగుచూసింది. పట్టణ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. మండలంలోని పందేరుపల్లి ఒడ్డూరుకు చెందిన నాగమ్మ కుమారుడు రాజశేఖర్(20) గ్రామంలో ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు అతనితో స్నేహంగా ఉండేవారు. వారిమధ్య ప్రేమ వ్యవహారమో.. ఏమో తెలియదు గానీ ఈనెల 1న ఇంట్లోని రూ.12వేలు తస్కరించిన రాజశేఖర్ తన బైక్‌తో సహా కనిపించకుండా పోయాడు. దీంతో అతని తల్లి బంధువులు గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు సైతం గ్రామంలో కనిపించకుండా పోయారు. ఆరా తీయగా, ఆ ఇరువురు యువతులు రాజశేఖర్‌ను తీసుకెళ్లినట్టు అనుమానంగా ఉందంటూ యువకుని తల్లి నాగమ్మ బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు. -
పెళ్లి చేసిన పూజారితోనే వధువు జంప్
భోపాల్ (సిరోంజ్) : వధు, వరులను వేద మంత్రాలతో ఒక్కటి చేసిన పూజారే వంకర బుద్ధి చూపించాడు. నవవధువుతో పూజారి పారిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌లో చోటుచేసుకుంది. వినోద్ మహరాజ్ అనే పూజారి మే 7న ఓ నూతన జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి అమ్మగారిఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లోని 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని వధువు వెళ్లిపోయింది. దీంతో యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మే23న మరో వివాహం చేపించాల్సి ఉండగా, పురోహితుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపగా, పురోహితుడు వినోద్ మహరాజ్ ముగ్గురు పిల్లలకు తండ్రి అని తేలింది. పురోహితుడు, సదరు యువతికి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పురోహితుడి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండాపోయారు. ఇప్పుడు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కూతురికి గుండు చేసి.. ముఖానికి నల్లరంగు పూసి..
అప్పటికే పెళ్లయిన తమ కూతురు ఎవరితోనో లేచిపోయిందని.. ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లరంగు పూసి.. గ్రామ వీధుల్లో ఊరేగించారు ఆమె తల్లిదండ్రులు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. వారం రోజుల తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. దాంతో ఆమె తండ్రి, భర్త, సవతి తల్లి కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి, తర్వాత పంచాయతీ వద్ద హాజరుపరిచారు. కుటుంబానికి పరువునష్టం కలిగించినందుకు ఆమెకు ఈ శిక్ష విధించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో యువతి కుటుంబానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎహసాన్ సాదిక్ తెలిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్యల లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని ఇద్దరు గర్భిణులను గత వారం దారుణంగా హతమార్చారు. -
ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!