
సాక్షి, చిత్తూరు(పలమనేరు) : ఇరువురు యువతులు ఓ యువకుడితో పరారైన సంఘటన పలమనేరు మండలంలో బుధవారం వెలుగుచూసింది. పట్టణ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. మండలంలోని పందేరుపల్లి ఒడ్డూరుకు చెందిన నాగమ్మ కుమారుడు రాజశేఖర్(20) గ్రామంలో ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు అతనితో స్నేహంగా ఉండేవారు. వారిమధ్య ప్రేమ వ్యవహారమో.. ఏమో తెలియదు గానీ ఈనెల 1న ఇంట్లోని రూ.12వేలు తస్కరించిన రాజశేఖర్ తన బైక్‌తో సహా కనిపించకుండా పోయాడు. దీంతో అతని తల్లి బంధువులు గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు సైతం గ్రామంలో కనిపించకుండా పోయారు. ఆరా తీయగా, ఆ ఇరువురు యువతులు రాజశేఖర్‌ను తీసుకెళ్లినట్టు అనుమానంగా ఉందంటూ యువకుని తల్లి నాగమ్మ బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment