Emergency Meet
-
ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ అత్యవసర సమావేశపు నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ప్రభావం చూపొచ్చంటున్నారు. హిందూ నూతన సంవత్సరం ‘2079 సంవత్’ తొలివారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. కన్సాలిడేషన్‌లో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,400 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఫెడ్ రిజర్వ్ సమావేశం అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ ఒకటిన) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్బీఐ ఎంపీసీ అత్యవసర భేటీ రిజర్వ్ బ్యాంక్ తన తదుపరి పరపతి ద్రవ్య సమీక్ష(ఎంపీసీ) సమావేశాన్ని గురువారం (నవంబర్ 3న) అత్యవసరంగా నిర్వహించనుంది. వరుసగా మూ డు త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలంకావడంతో ఆర్బీఐ మరోదఫా వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఈ వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, యూపీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్‌పీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, గెయిల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న) వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యలోటు, మౌలిక రంగ గణాంకాలు సోమవారం విడుదల కానున్నాయి. మరసటి రోజు అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. సేవారంగ డేటా గురువారం వెల్లడి కానుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ అక్టోబర్ 21 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 28వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. తగ్గిన ఎఫ్ఐఐల అమ్మకాల ఉధృతి దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఉధృతి తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్‌లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటి వరకు(29 తేదీ నాటికి) రూ.1,586 కోట్ల షేర్లను మాత్రమే అమ్మారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో నికరంగా 1.70 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగడం, బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత తదితర అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చు’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా అసిసోయేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఎమర్జెన్సీ కి ప్రపంచ దేశాల పిలుపు
-
జెట్ ఎయిర్వేస్ సంక్షోభంపై అత్యవసర భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని యాజమాన్యంతో మంగళవారం జరిపిన అత్యవసర భేటీలో డీజీసీఏ ఆదేశించింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. నగదు లభ్యత కొరవడటంతో సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొద్ది నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారి మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. విమాన సర్వీసుల్లో కోత విధించే క్రమంలో జెట్ ఎయిర్వేస్ ఈ దిశగా సంకేతాలు పంపుతోంది. జెట్ ఎయిర్వేస్ చేతులెత్తేయడంతో వేతనాలపై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మార్చి నాటికి వేతనాలను క్లియర్ చేస్తామని తమకిచ్చిన హామీ నెరవేరకపోవడంతో కంపెనీ పట్ల విశ్వాసం సన్నగిల్లిందని జెట్ ఎయిర్వేస్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు రాసిన లేఖలో పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా జోక్యం చేసుకోవాలని డీజీసీఏను కోరింది. జెట్ ఎయిర్వేస్లో దాదాపు 560 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లు పనిచేస్తుండగా 490 మంది ఇంజనీర్లు ఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకూ తమకు కంపెనీ మూడు నెలల జీతాలు బకాయి ఉందని ఇంజనీర్ల అసోసియేషన్ డీజీసీఏకు పంపిన ఈ మెయిల్లో పేర్కొంది. అత్యవసర భేటీ.. జెట్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులకు నెలకొన్న అసౌకర్యం నేపథ్యంలో అత్యవసర భేటీని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో డీజీసీఏ సంస్థ యాజమాన్యంతో సమావేశమైంది. విమాన సర్వీసుల రద్దు, క్యాన్సిలేషన్, రిఫండ్ల వివరాలతో పాటు సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం, బ్యాంకర్లకు బకాయిలు వంటి పలు అంశాలపై యాజమాన్యంతో ఈ భేటీలో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సంక్షోభం సమసేలా.. ప్రైవేట్ ఎయిర్‌లైనర్ జెట్ ఎయిర్వేస్ దివాళా బారిన పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను కాపాడే క్రమంలో ప్రభుత్వం బ్యాంకర్లను చొరవ చూపాలని సూచించింది. బ్యాంకులకు కంపెనీ బకాయి పడిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని దివాళా గండం నుంచి గట్టెక్కించాలని బ్యాంకులను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. కాగా, జెట్ ఎయిర్వేస్ను తిరిగిగాడిలో పెట్టే ప్రణాళికలను సైతం ఆయా బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
2019 ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం అవ్వాలి: కన్నా
-
పార్టీ నేతలతో మోదీ అత్యవసర భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. కేరళలో గురువారం జనరక్ష యాత్రలో పాల్గొనాల్సిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన కార్యక్రమాన్ని రద్దు చేసకుని మరీ ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగివచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రధానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఆర్థిక రంగం కుదేలైందన్న విపక్షాల విమర్శలను ప్రధాని తోసిపుచ్చిన క్రమంలో ఆర్థిక మంత్రి జైట్లీ, పార్టీ చీఫ్ అమిత్ షాలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కఠిన నిర్ణయాలకూ వెనుకాడమని కూడా ప్రధాని పేర్కొన్న విషయం విదితమే. దీంతో వృద్ధి రేటును గాడినపెట్టడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన వంటి అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక అంశాలతో పాటు త్వరలో జరగనున్న పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలూ ప్రధానితో జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
అణు పరీక్ష.. ఐరాస ఎమర్జెన్సీ మీటింగ్
సాక్షి, వాషింగ్టన్: ఉత్తర కొరియా అణు పరీక్ష నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి స్పందించింది. సోమవారం ఉదయం 10 గంటలకు భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయ్యింది. ఖండాత్గర క్షిపణి పేరిట కిమ్ జంగ్ నియంతృత్వ ప్రభుత్వం హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే. వణికిన ఉత్తర కొరియా ఈ మేరకు ఐరాస రాయబారి నిక్కీ హలె తన ట్విట్టర్ లో భేటీ అంశాన్ని ధృవీకరించారు. అమెరికాతోపాటు జపాన్, ఫ్రాన్స్; యూకే, దక్షిణ కొరియాలు భేటీలో పాల్గొని ఉత్తర కొరియా అణు పరీక్ష పై చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. తమతోపాటు మిత్రపక్షాల జోలికి వస్తే భారీ సైనికచర్యకు దిగాల్సి ఉంటుందని అమెరికా సైన్యాధికారి జేమ్స్ మట్టిస్ తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉ.కొ. ఓ మూర్ఖపు దేశమంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆరోసారి అణు పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. భారత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అణ్వాయుధాల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఉ.కొ. పెద్ద తప్పు చేసిందంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది కూడా. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశంలో ఈ అంశం హాట్ హాట్‌గా మారింది. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిందేనని భద్రతా మండలికి బ్రిటీష్ ప్రధాని థెరెసా విజ్ఞప్తి చేస్తుండగా, అవి ఎలాంటి ప్రభావం చూపబోవంటూ రష్యా పరోక్షంగా ఉత్తర కొరియాకు మద్ధతునిస్తూ వస్తోంది. -
బ్యాంకులు, ఫ్యాక్టరీలు బంద్..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు శుక్రవారం రోజు మూతపడనున్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడవ వేతన సంఘ సిపారసులను తమకు వర్తింపచేయాలని కనీసం వేతనం నెలకు రూ.18,000లకు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు 12 డిమాండ్ల సాధనకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగ్గనున్నాయి. ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్ల తెరుస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు శుక్రవారం ఈ సమ్మె చేయనున్నాయి. . మరోవైపు ట్రేడ్ యూనియన్ల నిర్వహించబోయే ఈ బంద్‌ను ఎలాగైనా ఆపాలని కేంద్రప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయంపై ప్రధాని మోదీ నేడు ఎమర్జెన్సీ మీటింగ్‌ను నిర్వహించారు. ప్రధాని నిర్వహించబోయే ఈ మీటింగ్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కార్మికశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం విఫలమవ్వడంతో ప్రధాని మోదీ ఈ మీటింగ్ నిర్వహించారు. మరో 48 గంటల్లో కార్మిక సంఘాలను సంప్రదించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల వివిధ యూనియన్లు కూడా శుక్రవారం జరగబోయే బంద్‌లో పాల్గొనబోతుండటంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు తీవ్ర అంతరాయం కలుగనుంది. అయితే ట్రేడ్ యూనియన్లు నిర్వహించబోయే ఈ బంద్‌లో రైల్వే ఉద్యోగులు పాల్గొనే సంకేతాలు లేకపోవడంతో, రైళ్లు యథాతథంగా తిరగనున్నట్టు సమాచారం.ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ సమ్మెపై తీవ్ర ఇరకాటంలో పడింది. సమ్మెకు మద్దతిస్తే ప్రభుత్వ పక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు విమర్శలు వస్తాయని ఆలోచిస్తోంది.