‘కాంట్రాక్టు’ వ్యవస్థను రద్దుచేయండి
నిజామాబాద్ నాగారం : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్‌చేస్తూ శనివారం తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు వ్య వస్థను రద్దు చేసి యాజమాన్యమే కార్మికులకు నేరుగా వేతనాలు ఇవ్వాలని కోరారు. స్థానిక ఆర్యనగర్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, అక్కడి నుంచి వినాయక్‌నగర్, పు లాంగ్మీదుగా క లెక్టరేట్ చేరుకున్నారు.
అక్కడినుంచి బస్టాండ్, గాంధీచౌక్, ఆర్ఆర్చౌరస్తా నుం చి వర్ని చౌరస్తా మీదుగా ఖిల్లాలోని జిల్లా విద్యుత్కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాం ట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామన్న టీఆర్ ఎస్ ప్రభుత్వం మాట మార్చవద్దన్నారు. యాజ మాన్యం సైతం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సాయిలు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థను నమ్ముకొని 20 ఏళ్ల నుంచి కష్టాలు అనుభవిస్తూ సంస్థ అభివృద్ధికి పని చేస్తున్నామన్నారు.
శ్రమకు తగ్గ ప్రతిఫలం రాకున్నా, ఎప్పటికైనా పర్మినెంట్ అవుతుందని ఆశతో ఎదు రు చూస్తు విధులు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు ఇచ్చే వేతనాల్లో కాంట్రాక్టర్లు కార్మికుల నుంచి రూ. వెయ్యి నుంచి రూ. రెండువేల వరకు ముందుగా తీసుకున్న తర్వాతే వేతనాలు బ్యాంకు ఖాతాలలో వేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది కాంట్రాక్టర్లు తెగించి ఏటీఎం కార్డులు వారి వద్ద ఉంచుకొని కార్మికులపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కార్మిక శాఖ ఆదేశాల మేరకు 2005 నుంచి ఈఎస్ఐ, ఈపీఎఫ్ కార్మికులకు కట్టాలని ఆదేశాలు ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోకుండా జేబుల్లో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిగ్గా వేతనాలు ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ముఖ్యంగా కాంట్రాక్టర్లు, అధికారు లు కుమ్మక్కై కార్మికులకు చెల్లించాల్సిన డీఏలను చెల్లించడం లేదన్నారు. కొంతమంది కార్మికులను అకారణంగా తొలగిస్తున్నారని అన్నారు. అన్ని అర్హతలున్నా, పర్మినెంట్ చేస్తామని కార్మికుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారు లు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులను క్రమద్ధీకరించాలని, లేకుంటే సమ్మెచేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెట్టు జాషువ, కార్యదర్శి మల్లయ్య, సభ్యులు బీర్రాథోడ్, తిరుపతి, విజయ్, రమేష్, గోపీ, ముస్తాప, సతీష్,సుమారు 600మంది కార్మికులు పాల్గొన్నారు.