Encounter place
-
దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ స్థలం వద్ద పహారా
సాక్షి, షాద్‌నగర్: దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో షాద్‌నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. త్రిసభ్య కమిటీ సభ్యులు దిశను దహనం చేసిన స్థలంతో పాటు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. నవంబర్ 27న దిశను హత్య చేసిన నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును నవంబర్ 29న పోలీసులు అరెస్టు చేసి అదే రోజు రాత్రి షాద్‌నగర్‌కు తీసుకొచ్చారు. షాద్‌నగర్ కోర్టులో జడ్జి అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్‌ను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి నిందితులను 30న తహసీల్దార్ ఎదుట హాజరు పరిచారు. చటాన్‌పల్లి వద్ద ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం అదేరోజు నిందితులకు తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. అయితే, నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్ 2న కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. కోర్టు నిందితులను డిసెంబర్ 3న పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత సీన్ రీకన్‌క్ష్రషన్ నిమిత్తం వారిని డిసెంబర్ 6న అర్ధరాత్రి చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీçసుకువచ్చారు. నిందితులు పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నిందితులు చనిపోయిన విషయం విదితమే. అప్రమత్తమైన పోలీసులు ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిటీ షాద్‌నగర్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్కౌంటర్ జరిగి 58 రోజులు గడుస్తున్నా ఘటనా స్ధలానికి ఎవరికి వెళ్లకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా దారి మూసేశారు. పోలీసులు ప్రత్యేంగా గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన సిట్ బృందం
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలోని చీకటీగల కోన, చచ్చినోడుబండ వద్ద ఎన్కౌంటర్ జరిగిన స్థలాలను గురువారం సిట్(స్పెషల్ ఇన్విస్టిగేషన్) బృందం పరిశీలించింది. గురువారం ఉదయం 11.30 గంటలకు సిట్ బృందం శ్రీవారి మెట్టు ప్రాంతానికి చేరుకుంది. వాహనాలు పోవడానికి వీలు లేకపోవడంతో సుమారు 15 కిలోమీటర్లు సిట్బృందం కాలినడకన ఘటనా స్థలం చేరుకుంది. మృతదేహాలు ఏవిధంగా పడి ఉన్నాయి.. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మృతదేహాలు పడి ఉన్నాయి.. ఎంతమంది టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్పులు జరిపారు. కూలీల వద్ద ఉన్న ఆయుధాలు ఎక్కడ లభించాయి.. వంటి అంశాలపై స్థానిక అధికారులను ఆరా తీశారు. అనంతరం ఘటనా స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. సంఘటన స్థలంలో ఎక్కడైనా భారీ వృక్షాలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఈసందర్భంగా సిట్ చైర్మన్ రవిశంకర్ అయ్యన్నార్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు 8మందితో కూడిన బృందం శేషాచలంలోని చీకటీగల కోన, చచ్చినోడు బండ ఎన్కౌంటర్ ఘటనా స్థలాలను సందర్శించిందన్నారు. ఈకేసుకు సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాధ్ జెట్టి నుంచి నివేదిక తీసుకున్నామన్నారు. ఘటన జరిగిన తీరుపై స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మరో రెండు నెలల కాల వ్యవధిలో హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక అందిస్తామన్నారు. తిరుపతి పోలీసుల నుంచి మరికొన్ని నివేదికలు అందాల్సి ఉందన్నారు. అవి అందిన తర్వాత తుది నివేదికను హైకోర్టుకు అందజేస్తామని తెలిపారు. సిట్ బృందం రవిశంకర్ అయ్యన్నార్తో పాటు సభ్యులు డీఐజీ రమణకుమార్, పాలరాజు, చంద్రశేఖర్, యుగంధర్ బాబు, రఘు, మదుసూదన్, చంద్రశేఖర్ వచ్చారు. వీరితో పాటు తిరుపతి వెస్టు డీఎస్పీ శ్రీనివాసులు, చంద్రగిరి సీఐ శివప్రసాద్, ఎస్ఐ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా ఈ బృందంలో సభ్యుడైన సీబీసీఐడీ డీఎస్పీ యుగంధర్‌బాబు తిరుగు ప్రయాణంలో ఎండ తీవ్రత వల్ల కొంత అస్వస్థతకు గురయ్యారు. చంద్రగిరి సీఐ శివప్రసాద్ వ్యయప్రయాసాలతో శేషాచలంలోకి ద్విచక్ర వాహనాన్ని తెప్పించి సురేంద్రబాబును క్షేమంగా గమ్యానికి చేరవేశారు. -
మూడో వ్యక్తి ఊహాగానమే!: నాయిని
‘సూర్యాపేట’ ఘటనపై హోంమంత్రి నాయిని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో కాల్పులు జరిపి పోలీసులను హతమార్చిన ‘సిమి’ ఉగ్రమూకలో మూడో వ్యక్తి సైతం ఉన్నాడని జరిగిన ప్రచారం ఊహాగానమేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ ముష్కర మూకలో మూడో వ్యక్తి ఉన్నట్లు ఆధారాలు లభిస్తే ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఎన్కౌంటర్ స్థలంలో లభించిన రైలు టికెట్ మృతిచెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిది అయివుండవచ్చని భావిస్తున్నామన్నారు. సిమి ముష్కరులతో పోరాడుతూ అసువులు బాసిన ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుళ్లు నాగరాజు, లింగయ్య, హోంగార్డు మహేశ్‌ల ధైర్య సాహసాలపై సీనియర్ జర్నలిస్టు కళా సురేందర్ రచించిన ‘పోలీస్ టైగర్స్’ అనే పుస్తకాన్ని సోమవారం హోంమంత్రి నాయిని సచివాలయంలో ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నలుగురు పోలీసు అమరుల ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపిన మూకను తొలుత ఉత్తరప్రదేశ్‌కు చెందిన దోపిడీ దొంగల ముఠాగా భావించామన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సహకారంతో మృతి చెందిన అస్లం, ఎజాజుద్దీన్లను సిమి ఉగ్రవాదులుగా గుర్తించామన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు హోంమంత్రి నిరాకరించారు. ఈ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడడం సబబు కాదన్నారు. పుస్తక రచయిత కళా సురేందర్ మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలు భవిష్యత్తు తరాలకు తెలపాలనే ఈ రచన చేసినట్లు పేర్కొన్నారు.