endownment department
-
ఆలయ ఆగమాలు, ఆచారాల్లో జోక్యం వద్దు
సాక్షి, అమరావతి: ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవో, తదితర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైదిక ఆగమ విషయాల్లో ఆలయాలకు స్వయం ప్రతిపత్తిని నిర్ధారించడానికి 1987 నాటి దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్–13(1)కి అనుగుణంగా అధికారులు ఆలయాల ఆచారాలు, సంప్రదాయాల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ బుధవారం జీఓ–223ను జారీచేశారు. వివిధ ఆలయాల్లో స్వామివార్లకు నిర్వహించే సేవలకు సంబంధించిన విధానాలు.. యాగాలు, కుంభాభిషేకాలు, ఇతర ఉత్సవాల నిర్వహణ వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడి సీనియర్ అర్చకులు, ఇతర మతపరమైన సిబ్బంది అభిప్రాయాలే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఈఓ వైదిక కమిటీలను ఏర్పాటుచేసుకోవచ్చని ఆయన ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఏదైనా సందేహం, అభిప్రాయభేదం ఏర్పడితే ప్రఖ్యాత పీఠాధిపతులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో ఏ ఆలయానికి ఆ ఆలయం లేదా ఇతర దేవదాయ ధార్మిక సంస్థలు ఒక స్వతంత్ర సంస్థగా పరిగణించబడతాయన్నారు. అలాగే, ఒకే రకమైన ఆగమాలకు సంబంధించిన ఆలయాలు, ధార్మిక సంస్థలైనప్పటికీ సంబంధిత ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు భిన్నంగా వేరొక ఆలయ సంప్రదాయాలు పాటించాలనిలేదని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
‘కొణతాల’ వారి కబ్జా కథ..
సాక్షి, అనకాపల్లి: దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల బరితెగింపునకు ఈ ఘటన మరో ఉదాహరణ. ఎంతో ఉన్నతాశయంతో ఆరేడు దశాబ్దాల క్రితం దేవదాయ శాఖకు రాసిచ్చిన భూములపై కూటమి గద్దలు ఎప్పట్నుంచో కన్నేశాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చీరాగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడీ కబ్జా బాగోతాన్ని నడిపిస్తోంది అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబీకులు. ఈ భూదాహం కథాకమామిషు ఏమిటంటే..అనకాపల్లి పట్టణంలోని సర్వే నెంబరు 66లో 29.71 ఎకరాల భూమి (పూల్‌బాగ్ భూములు)ని చెముడు ఎస్టేట్ మహారాణి వైరిచర్ల చంద్రముఖి పట్టా మహాదేవి దేవదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్ చేసి మరీ అప్పగించారు. తన తదనంతరం దేవదాయ శాఖకు భూమిని అప్పగించాలని.. అప్పటివరకు ట్రస్టీలుగా తన పెద్ద అల్లుడు రాజూభీర్ ఉదిత్ ప్రతాప్ శంకర్ డియో, డాక్టర్ పేర్రాజు, న్యాయవాది రామచంద్రరావులను నియమించారు. ఆమె మరణానంతరం భూములను తమకు అప్పగించాలని ట్రస్టీని దేవదాయ శాఖాధికారులు 1963లో కోరారు. దీనిపై ట్రస్టీ కోర్టును ఆశ్రయించింది. 1996లో దేవదాయ శాఖకే అనుకూలంగా కోర్టు తీర్పువచ్చింది. ఆ తర్వాత చోటుచేసుకున్న వివిధ పరిణామాల తర్వాత దేవదాయ శాఖాధికారులు భూములను స్వాధీనం చేసుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటుచేశారు. వాటి రక్షణకు సెక్యూరిటీని కూడా నియమించారు.దేవస్థానం బోర్డులు పీకేసి..నిజానికి.. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామాలయానికి చెందిన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి ఎప్పటినుంచో కన్నేశారు. అందులో భాగంగా.. కోర్టు ఇంటెరిం ఆర్డర్ పేరిట 29.71 ఎకరాల ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడున్న దేవస్థానం బోర్డుల్ని 2022 నవంబర్ 27నే పీకేశారు. వాటి స్థానంలో ఆ భూములు తమవేనని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటూ కొణతాల రామకృష్ణ సోదరుడి మావయ్య అయిన బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు వెలిశాయి. దీంతో వీరిపై అనకాపల్లి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పటి దేవదాయ శాఖ ఏసీపీ శిరీష ఫిర్యాదు చేయగా బోర్డులు పీకేసిన ఆరుగురిపై సీఐ దాడి మోహన్ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఆ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు కొణతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు భార్య రజనీ, ఆయన బావమరిది బొడ్డేటి శ్రీనివాసరావు అనుచరులు సిద్ధమయ్యారు. జేసీబీతో ఆ భూములను చదును చేసేందుకు యత్నించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం ఏఈవో రాంబాబు, దేవదాయ ఏఈ కె.సూర్యనారాయణమూర్తి, సిబ్బంది, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ నాయకులు శ్రీరామ్, శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ కోర్టుకుఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే.. ఆ భూమిలో కొణతాల రామకృష్ణ, ఆయన సోదరులు రైతులతో సాగు చేయించడం ప్రారంభించారు. తద్వారా మొత్తం 30 మంది రైతుల నుంచి రూ.10వేల చొప్పున కౌలు వసూలుచేస్తున్నారు. అంతేకాక.. ఇవి తమ భూములేనంటూ వివిధ ఆక్రమణదారుల పేరుతో మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. హఠాత్తుగా శనివారం మరోసారి దేవదాయ శాఖ బోర్డుల్ని తొలగించి వాటి స్థానంలో బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు పెట్టారు. దీంతో ఆలయ బోర్డు చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నాయుడు పేరిట ఉన్న బోర్డులు తొలగించారు. నాయుడుతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దేవదాయశాఖ భూములను కాపాడతాంగతంలో కోర్టు నాలుగు వారాలపాటు స్టే ఇస్తే.. దేవస్థానం బోర్డులు పీకేసీ బీవీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు ఏర్పాటుచేశారు. అప్పుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆరుగురిపై కేసులు నమోదుచేశారు. మళ్లీ శనివారం ఉదయం జేసీబీలతో ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాం. దేవదాయశాఖ భూములను కాపాడడమే మా లక్ష్యం. – రాంబాబు, కనకమహాలక్ష్మి ఆలయ ఏఈఓ, అనకాపల్లి -
దేవస్థానం, అటవీ శాఖ మధ్య సరిహద్దు చిచ్చు!
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం, అటవీ శాఖ మధ్య సరిహద్దు చిచ్చు రేగింది. గతేడాది దేవస్థానం వారు ఎక్కడ ఏ పనులు చేపట్టినా అటవీ శాఖ వారు తమ పరిధి అని గొడవ పడుతుండటంతో ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టడానికి ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. అప్పుడు విజయవాడలో జరిగిన సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ, దేవదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ, అటవీ శాఖ సీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి తదితరులు సరిహద్దులను నిర్ణయిస్తూ ప్లాన్ రూపొందించారు. అందులో అధికారులందరూ సంతకాలు చేశారు. శ్రీశైలానికి సంబంధించి 4,900 ఎకరాలు స్థలం ఉందని, అందులో 900 ఎకరాల డ్యామ్ నిర్మాణ సమయంలో మునిగిపోయి ఉందని గుర్తించారు. దీనితో పాటు ఎవరి హద్దులో వారు ఉండాలని, గొడవలకు పోవొద్దని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే అటవీ శాఖలో ఉన్న అధికారులు మరో ప్రాంతానికి బదిలీ కావడంతో కొత్తగా శ్రీశైలానికి బదిలీపై వచ్చిన ఎఫ్డీ, డీఎఫ్‌వో స్థానిక రేంజ్ ఆఫీసర్ ఉన్నత అధికారులను తప్పుదారి పట్టించారని ఆరోపణలున్నాయి. దీంతో కొత్తగా వచ్చిన ఎఫ్డీ, డీఎఫ్‌వోలు దేవస్థానానికి 100 ఎకరాలు మాత్రమే ఉందన్న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీంతో దేవస్థానం–అటవీ శాఖ మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా దేవస్థానం పరిధిలో 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న టోల్గేట్ అటవీ శాఖ పరిధిలో ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వడం ప్రారంభించారు. అలాగే దేవస్థానం నిర్వహిస్తున్న డార్మెటరీ కూడా అటవీ శాఖ కిందికే వస్తుందని, అక్కడా తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో పెద్దిరాజు, రెవెన్యూ ఏఈవో మల్లికార్జునరెడ్డి, పర్యవేక్షకులు శివప్రసాద్, దేవస్థానం సీఎస్‌వో అయ్యన్న, సంబంధిత సిబ్బందిని పంపించి ఎఫ్ఆర్వో నరసింహులు చేస్తున్న పనిని తాత్కాలికంగా నిలుపుదల చేయించారు. శనివారం మధ్యాహ్నం తిరిగి టోల్గేట్ దాటాక పిల్లర్ల నిర్మాణానికి అటవీ శాఖ వారు గుంతలు తవ్వుతున్నారు.. అని తెలుసుకుని రెవెన్యూ అధికారులు, సీఎస్‌వో సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులకు ఇబ్బంది కలిగించేలా దేవస్థానం ఆస్తులను ధ్వంసం చేస్తూ గుంతలు తవ్వడంపై అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ నరసింహులును ప్రర్మింస్తూ, స్థానిక సీఐకి సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ప్రస్తుతం క్షేత్ర పరిధిలో నిర్మించిన డార్మెటరీ, దేవస్థానం టోల్గేట్ అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని, అందుకే ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు టోల్గేట్, నందీశ్వర డార్మెటరీల వద్ద సరిహద్దు నిర్మాణాల కోసం గుంతలను తవ్వి పిల్లర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఎఫ్ఆర్వో నరసింహులు అన్నారు. డీఎఫ్‌వో సూచనల మేరకు నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, అనంతరం దేవస్థానంపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తామని చెప్పారు.15 రోజుల్లో నిర్ణయించుకోండి..సరిహద్దుల సమస్య ప్రభుత్వంలోని దేవదాయ–అటవీ శాఖకు సంబంధించి రెండు ప్రభుత్వ విభాగాలకు సంబంధించింది కాబట్టి 15 రోజుల్లోగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఐ ప్రసాదరావు.. దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఏఈవోలకు సూచించారు.దేవస్థానం వారికి నోటీసులు జారీ చేశామని ఎఫ్ఆర్వో చెబుతుండగా, తమకు నోటీసులు అందలేదని దేవస్థానం అధికారులు సీఐకు తెలిపారు. ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అటు దేవస్థానం, ఇటు అటవీ శాఖ సంయమనం పాటించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా ఇరువర్గాలకు సూచించారు. లేకుంటే దేవస్థానం, అటవీ శాఖ నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రూ.1,400 కోట్లతో ఆలయాల అభివృద్ధి
తొండంగి: రాష్ట్రంలో రూ.1,400 కోట్లతో ముఖ్య దేవాలయాలను అభివృద్ధి చేశామని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై రూ.25 కోట్లతో నిర్మించిన శివసదన్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, ఘాట్ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్నవరం కొండపై భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా 138 గదులతో శివసదన్ నిర్మించినట్లు తెలిపారు. శ్రీసత్యన్నారాయణ యాత్ర నివాస్, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సీఆర్వో కార్యాలయం వెనుక ఆదిశంకర మార్గ్, సత్యగిరి వైజంక్షన్ వద్ద హరిహర మార్గ్, వనదుర్గ మార్గ్‌లను పూర్తి చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన దాత రాజామణి సుమారు రూ.2 కోట్లతో భక్తుల కోసం రత్నగిరి విశ్రాంతి భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. వైకుంఠ ఏకా దశి నాడు శంఖు చక్రాలు ప్రారంభించాలని ఆలయ ఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు. -
ఆ దేవుళ్లు చేసిన పాపమేంటి?
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. ఇప్పుడు దీన్ని ’’సీఎం వరమిచ్చినా దేవాదాయశాఖ కరుణించడం లేదు’’అని మార్చి చదువుకోవాలి. ధూపదీప నైవేద్యాలకు స్వయంగా సీఎం ముందుకొచ్చినా.. దేవాదాయ శాఖే దాన్ని అడ్డుకుంది. గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పథకం కింద అందిస్తున్న భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన సమయంలో కొత్తగా మరో 2,796 దేవాలయాలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. అప్పటికే ఆ జాబి తా దేవాదాయ శాఖ పరిశీలనలో ఉన్నందున, ఆ జాబితాలోని దేవాలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు సీఎం తేల్చి చెప్పారు. కానీ, శనివా రం విడుదలైన ఉత్తర్వుల్లో ఆ సంఖ్యను దేవాదాయశాఖ 2,043గానే చూపింది. నిధుల సాకుతో మిగతా గుడులను అందులో నుంచి తప్పించింది. ఫలితంగా, ఆయా దేవాలయాల్లో దేవరులతోపాటు, ఆ ఆలయాలనే నమ్ముకుని ఉన్న అర్చకులు ఇప్పుడు ఆగమాగమయ్యే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకే జాబితా.. ఎలా తొలగిస్తారు..? రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతినెలా రూ.6 వేలు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటిల్లో రూ.2 వేలను దేవుడికి ధూపదీప నైవేద్యానికయ్యే వ్యయానికి వాడుతుండగా, మిగతా మొత్తాన్ని ఆ ఆలయ పూజారి కుటుంబం గడవటానికి భృతిగా వినియోగిస్తున్నారు. ఆదాయం లేక ఆలనాపాలనా లేని మరిన్ని దేవాలయాలను కూడా దీని పరిధిలోకి తేవాలన్న ఉద్దేశంతో దేవాదాయ శాఖ గత ఏడాది చివరలో ఓ జాబితాను సిద్ధం చేసింది. ప్రతి జిల్లా అదనపు కలెక్టర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ముగ్గురు అర్చకులు.. వెరసి ఐదుగురు సభ్యుల కమిటీ అర్చకుల అర్హతల ఆధారంగా ఎంపికలు జరిపింది. అలా 2,796 మంది పూజారుల జాబితాను సిద్ధం చేసుకుని ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ఆ జాబితా ఆధారంగానే ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేశారు. మిగిలిన 753 దేవాలయాల పరిస్థితేంటి? కొంతకాలంగా ధూపదీప నైవేద్య పథకానికి ఆర్థిక శాఖ నిధులు సరిగా ఇవ్వటం లేదు. మూడు నెలల మొత్తం బకాయిగా పేరుకుపోయి ఉంది. గతేడాది చివరలో కూడా నాలుగు నెలల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఈ జాబితాను తగ్గించాలని భావించిన అధికారులు, సీఎం ప్రకటనకు భిన్నంగా కేవలం 2,043 దేవాలయాలకే పథకాన్ని వర్తింపు చేస్తున్నట్టు శనివారం ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆ జాబితాలో 753 దేవాలయాలు మిగిలి పోయాయి. ఒకేసారి రూపొందిన మొత్తం జాబితాను ఓకే చేయాల్సిందిపోయి, సింహభాగం దేవాలయాలను ఎంపిక చేసి కొన్నింటిని వదిలేయటం ఇప్పుడు గందరగోళంగా మారింది. ప్రభుత్వం నుంచి భృతి రాదని తేలితే వారు ఆ ఆలయాల్లో అర్చకులు కొనసాగే పరిస్థితి అంతగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. -
‘ఈనాడు’ అసత్య యజ్ఞంలో ‘వాస్తవాలే’ సమిధలు
సాక్షి, అమరావతి: వాస్తవాలన్నింటినీ సమిధలుగా మార్చి ‘ఈనాడు’ అసత్యాల యజ్ఞం చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో రాష్ట్రంలో సాగుతున్న అతి పెద్ద హిందూ ధార్మిక కార్యక్రమంపైనే ఓ అసత్య కథనాన్ని అల్లింది. సనాతన హిందూ సంప్రదాయం, ధర్మ ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకి చాటి చెప్పేలా, పురాణాలలో చెప్పిన మహత్తర యజ్ఞాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేయిస్తుంటే ‘ఈనాడు’ ఏమాత్రం ఓర్వలేకపోయింది. పలువురు పీఠాధిపతుల సమక్షంలో అనేక మంది వేద పండితులు, వందలాది రుత్విక్కుల ఆధ్వర్యంలో విజయవాడలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ‘అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం’ పైనా విషం చిమ్మింది. దానికి పెట్టే ఖర్చును ‘‘దేవదాయ సొత్తే.. సమిధ’’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. హిందూ ధర్మ వ్యాప్తికి, దైవ కార్యక్రమాలకు దేవదాయ శాఖ డబ్బు కాకుండా మరే డబ్బును ఖర్చు చేస్తారన్న కనీస జ్ఞానాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది ఆ పత్రిక. కేవలం దైవ, హిందూ ధర్మ ప్రచారాలకు మాత్రమే ఉపయోగించాల్సిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేసినా కిమ్మనని ఈనాడు.. ఇప్పుడు ధర్మ ప్రచారానికి ఉపయోగించడమూ నేరమే అంటోంది. నాడు చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాల్సిన దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం భవనానికి రూ.10 కోట్ల సీజీఎఫ్ నిధులు ఖర్చు చేసింది. ఇదంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయిన ‘ఈనాడు’.. ఇప్పుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు దైవ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడాన్ని తప్పుపడుతోంది. ఈనాడు కథనంలో అవాస్తవాలను దేవదాయ శాఖ కమిషనర్ బట్టబయలు చేశారు. వాస్తవాలను వివరించారు. ఆ వాస్తవాలిలా ఉన్నాయి.. ఈనాడు ఆరోపణ:మహా యజ్ఞానికి ఉపయోగించే నెయ్యిని దేవదాయ శాఖ కిలో రూ. 1400లు పెట్టి కొంటోంది. మార్కెట్లో దాని ధర రూ. 600 – 650 మాత్రమే. దేవదాయ శాఖ కమిషనర్ చెబుతున్న వాస్తవం: కిలో రూ. 1,400 అన్నది పచ్చి అబద్ధం. యజ్ఞ నిర్వహణకు ఉపయోగించే పవిత్ర దేశీ ఆవు నెయ్యిని కొంటున్నది రూ. 1,071కే. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవముల సందర్భంగా హైదరాబాద్‌లో చిన జీయర్ స్వామి ఆశ్రమం నిర్వహించిన యజ్ఞానికి ఆ సంస్థ కొన్న ధరకన్నా దేవదాయ శాఖ కొన్న ఆవు నెయ్యి ధర చాలా తక్కువ. ఈ రెండు యజ్ఞాలకూ దేశీ ఆవు నెయ్యి సరఫరా చేసింది ఒకే సంస్థ. చిన జీయర్ స్వామి వారి ఆశ్రమం 15 లీటర్ల ఆవు నెయ్యి టిన్ను రూ. 24107.14కి కొనగా, దేవదాయ శాఖ బేరమాడి 15 లీటర్ల టిన్నును రూ. 16,071కే కొన్నది. ఆరోపణ: దుర్గగుడి కొనే నెయ్యి ధరకన్నా యజ్ఞానికి ఎక్కువ ధర. వాస్తవం: వివిధ ఆలయాలు కొనే నెయ్యి అత్యధికం ప్రసాదాల తయారీకి మాత్రమే వినియోగిస్తారు. యజ్ఞ కార్యక్రమాలకు ఉపయోగించే నెయ్యి పూర్తి భిన్నమైనది. యజ్ఞ యాగాదులకు వినియోగించవలసిన నెయ్యి పూర్తిగా స్వదేశీ ఆవు పాలను మరిగించి పెరుగు చేసి, ఆ పెరుగు నుండి తీసిన వెన్నను మరిగించి తయారు చేసిన నెయ్యి మాత్రమే అయి ఉండాలి. ఆరోపణ: యజ్ఞ సామాగ్రిని ఇష్టానుసారం ధరలకు కొన్నారు. దీక్షా వస్త్రాలకే రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. వాస్తవం: యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే వేద పండితులకు, రుత్విక్కులు, పరిచారికలు, భజంత్రీలకు కలిపి మొత్తం 688 మందికి ఒక్కొక్కరి మూడు దీక్షా వస్త్రాల చొప్పున మొత్తం 2064 అందజేయాలని నిర్ణయం జరిగింది. మహా యజ్ఞంలో సుమారు 15 మంది పీఠాధిపతులను ఆహ్వానించినందున హైందవ సంప్రదాయాన్ని అనుసరించి వారికి ఉపయోగించే వస్త్రాలు ఏకతానుతో చేసినవి అయి ఉండాలి. దీక్షా వస్త్రాల కొనుగోలుకు రూ. 11.35 లక్షలు ఖర్చు చేశాం. ‘ఈనాడు’లో పేర్కొన్నట్టు రూ.20 లక్షలు కాదు. ఆరోపణ: మహా యజ్ఞం నిర్వహణకు పెద్ద ఆలయాల నుంచి నిధులు సమీకరించారు. వాస్తవం: ఆలయాల ప్రథమ కర్తవ్యం సనాతన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించటం, యజ్ఞ యాగాదులు నిర్వహించటం. ఈనాడు ఆరోపణ: ప్రతి పనినీ అధికారులు దుర్గగుడికే అప్పగిస్తున్నారు కమిషనర్ చెబుతున్న వాస్తవం: మహా యజ్ఞం నిర్వహణకు వచ్చిన వివిధ శాఖల సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థల వలంటీర్లకు మాత్రమే దుర్గమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి భోజనాలు ఏర్పాటు చేశాం. -
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
ఎక్కడివారక్కడే గప్‌చుప్..!
సాక్షి, ఒంగోలు: సహజంగా ఏటా దేవదాయ, ధర్మాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుంటారు. జూన్ నెల 25వ తేదీ నుంచి ఈ మేరకు బదిలీలు ప్రారంభమయ్యాయి. జీవో ఎంఎస్ నంబర్ 46 పేరుతో దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం కూడా జూన్ 26న జీవో ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జూన్ 24వ తేదీ నుంచి బదిలీలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో బదిలీల ప్రక్రియ జిల్లాలో మూడు రోజులుగా నిలిచిపోయింది. కారణం సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం. జిల్లాను యూనిట్‌గా చేసుకున్నప్పుడు అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంది. గడిచిన ఏడాది కాలంగా జిల్లా దేవదాయ శాఖకు ఓ రకంగా అసిస్టెంట్ కమిషనర్ లేనట్టే. శ్రీరామమూర్తి సెలవులో వెళ్లినప్పటి నుంచి దేవదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్ లేరు. తాజాగా నియమితులైన అధికారి కూడా నియామకం అయిన వారం రోజుల తర్వాత కూడా విధుల్లో చేరలేదు. ఎక్కడివారక్కడే.. నిజానికి బదిలీల ప్రక్రియ నిర్వహించాలంటే తొలుత ఏయే గ్రూప్స్ ఆలయాల కార్య నిర్వహణాధికారులు ఎంతెంత కాలం నుంచి విధులు నిర్వహిస్తున్నారనే విషయంలో జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయానికి నివేదికలు ఇవ్వాలి. కానీ, నివేదికలు ఇచ్చేటప్పుడే అసమగ్ర నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ను అనుసరించి నిర్దేశిత తేదీలను అధికారులు పట్టించుకోరు. తద్వారా బదిలీలకు నిర్దేశించిన తేదీల్లో హడావిడిగా, నువ్వక్కడ, నేనిక్కడ అన్న రీతిలో బదిలీలు నిర్వహిస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్‌లో పారదర్శకతను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. బదిలీలకు తప్పుడు నివేదికలు మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌ను ప్రభుత్వ ఉత్తర్వులుగా మార్చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి తప్పుడు నివేదికలు ఇవ్వడం, బదిలీల సమయంలో అందుబాటులో ఉండక పోవడం, అనంతరం రాజకీయంగా ప్రాతినిధ్యం చేసి ఒకేచోట ఉండిపోవటం అనేది పలుచోట్ల ఈవోలు చేస్తున్న వ్యవహారం. ఈ క్రమంలో కమిషనర్ కార్యాలయం కూడా ఏ ఒకరిద్దరినో బదిలీ చేస్తున్నట్టు చూపించడంతో ప్రక్రియను సరిపెట్టేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో పారదర్శక నివేదికలతో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించాల్సిన ఈవోల బదిలీలు తూతూ మంత్రంగా జరుపుతూ దేవదాయ – ధర్మదాయ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రికవరీల ఊసేది? జిల్లాలో పలు చోట్ల దేవదాయ–ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన నిధులు గోల్మాల్ అవుతున్నాయి. భక్తుల కానుకలు నివేదికల్లో అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఇటీవల పొందూరు గ్రూప్ ఆలయ పరిధిలో రూ.23లక్షల కుంభకోణం జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి విచారణలు చేసి రికవరీ చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇంకో విచిత్రం ఏమంటే, నిధుల అవకతవకలు జరిగిన ప్రాంతాల్లోని ఈవోలకు అదనపు బాధ్యతలు కేటాయించటం దేవదాయ, ధర్మదాయ శాఖలో కొసమెరుపు. సత్వరం సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బదిలీలు పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహింపజేసి దేవాలయాల ఉన్నతికి పాటు పడాలని ఆయా ప్రాంతాల్లో భక్తులు కోరుతున్నారు. పాతుకుపోతున్న ఈవోలు జిల్లాలోని ఆలయాల కార్యనిర్వహణాధికారులు 50మంది వరకు ఉన్నారు. వీరిలో ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన వారు కొందరు ఉండగా, అధికులు జూనియర్ అసిస్టెంట్ హోదా నుంచి వచ్చి ఈవోగా పదోన్నతులు పొందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు నుంచే తప్పుడు సమాచారం ఇస్తుంటారు. జిల్లాలో ఉన్న 50మంది ఈవోల్లో అధిక శాతం మంది ఎక్కడివాళ్లక్కడ పాతుకు పోయారు. అధిక ఈవోలు 8,9 ఏళ్లుగా తాము నియామకం అయినచోటే పాతుకుపోయారు. ► సింగరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈవోగా ఉన్న అధికారి తొమ్మిదేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక ఆయన్ని మళ్లీ కోటప్పకొండకు ఇన్చార్జి ఈవోగా కూడా గత ప్రభుత్వ హయాంలో నియమించారు. ► ఒంగోలు గ్రూప్ ఆలయాల ఈవో తొమ్మిదేళ్లుగా, కొత్తపట్నం గ్రూప్ ఆలయాల ఈవో ఐదేళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. ► కారంచేడు గ్రూప్ దేవాలయాలకు కూడా ఈవో సుదీర్ఘకాలంగా బదిలీకి దూరంగా ఉన్నారు. ► కొప్పోలు గ్రూప్ ఆలయాల కార్యనిర్వహణాధికారి సుధీర్ఘకాలంగా బదిలీ కాలేదు. ► పొదిలి గ్రూప్ టెంపుల్స్‌కు చెందిన నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం(పొదిలికొండ) తదితరాల ఆలయాల ఈవోలు కూడా బదిలీలకు దూరం. ► మార్టూరు మండలంలోనూ అదే పరిస్థితి. ఈ ప్రాంతంలో 19 ఆలయాలకు ఒకరే ఈవో, వీరు కూడా అనేక ఏళ్లుగా బదిలీకి దూరంగా ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా మేనేజర్ హోదా కూడా ఉంది. ఇలా మార్కాపురం, కందుకూరు, పర్చూరు డివిజన్లలోని పలు ఆలయాల ఈవోలు ఒకేచోట ఏళ్ల తరబడి పాతుకుపోయారు. దీంతో బదిలీలకు మొహం చాటేస్తున్నారు. -
ఏసీబీ వలలో దేవాదాయశాఖాధికారులు
► అర్చక నిధి నిధులు మంజూరు కోసం లంచం డిమాండ్ ► జూనియర్ అసిస్టెంటు బిందుబాయ్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అరెస్ట్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దేవాదాయ, ధర్మాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. మృతి చెందిన పూజారి కుటుంబ సభ్యులకు అర్చక నిధి నిధులు మంజూరు కోసం లంచం డిమాండ్ చేయగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలోని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డోన్ మండలం కొత్తకోట చెన్న కేశవస్వామి ఆలయ పూజారి శేషయ్య ఏడాది క్రితం మృతి చెందారు. ఆయన కుటుంబానికి అర్చక నిధి నుంచి రూ. 2.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో శేషయ్య భార్య పద్మావతి అర్చక నిధి కోసం దేవాదాయశాఖాధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఏ.బిందుబాయ్ అర్చక నిధి ఇన్చార్జ్గా, బీ.వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. బాధిత మహిళ దరఖాస్తులో పొందుపరచిన అంశాలను ఇన్స్పెక్టర్ బి.వెంకట్శేర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్చక నిధి ఇన్చార్జ్గా ఉన్న ఏ.బిందుబాయ్కు పంపాలి. బిందుబాయ్ రూ. ఐదు వేలు, ఇన్స్పెక్టర్ రూ. రెండు వేలు లంచం అడగడంతో పద్మావతి ఏసీబీని ఆశ్రయించింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు చెప్పినట్లు పద్మావతి అల్లుడు రాధాకృష్ణమూర్తి, అతని అన్న పూజారి వెంకటరమణతో కలసి అధికారులకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారి వద్ద నుంచి రూ.5 వేలు, 2 వేలు స్వాధీనం చేసుకొని జడ్జి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇన్స్పెక్టర్ బి.వెంకట్శేర్లు