ఇంజినీరింగ్ విద్యార్థిని గ్యాంగ్‌రేప్
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్ లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. సహ విద్యార్థి, అతడి ముగ్గురు స్నేహితులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఈ ఘోరాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. బాధితురాలు లాహోర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థిని.
కొన్ని నెలల కిత్రం తనను ఒంటరిగా తీసుకెళ్లి సహ విద్యార్థి అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు తెలిపింది. సెల్ఫోన్లో వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి అతడి ముగ్గురు స్నేహితులు తర్వాత తనపై అత్యాచారం చేశారని వెల్లడించింది. ఈ దురాగతానికి పాల్పడిన నలుగురిపై పోలీసులు అరెకేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.