ఈ చానల్ ఇంతేనా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు చానల్ ఆధునికీకరణ ప్రయత్నాలు అంచనాల గడపదాటడం లేదు. ఈ చానల్ ఆధునికీకరణ ప్రాధాన్యతను గుర్తించి సాగునీటి శాఖ ఇంజినీర్లు లైన్ ఎస్టిమేట్లు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా, ఫైల్ ముందుకు నడవడం లేదు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఉన్నతాధికారులు కాలయాపన చేస్తున్నారు. 1972లో ఏర్పాటైన ఈ చానల్‌కు అప్పటి నుంచి సాంవత్సరిక మరమ్మతులకు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. ప్రత్యేక మరమ్మతులు చేయకపోవటం, డెల్టా ఆధునికీకరణలో దీనిని చేర్చకపోవడంతో రెగ్యులేటర్లు, ఇతర ముఖ్య కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కాలువకు 40 సంవత్సరాల నుంచి పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదు.
కాలువ పుట్టు పూర్వోత్తరాలు
కృష్ణానదికి అనుసంధానంగా ఉండవల్లి అవుట్‌ఫాల్ స్లూయీస్ నుంచి 47 కిలోమీటర్ల నిడివిలో గుంటూరు చానల్ విస్తరించింది.
27 వేల ఎకరాల ఆయకట్టు, 38 చెరువులు, 10 ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా అవుతోంది.
తాడేపల్లి,మంగళగిరి, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు.
1967లో ఈ కాలువ నిర్మాణ పనులు ప్రారంభమై 1972లో వినియోగంలోకి వచ్చింది.
{పజల తాగునీటి అవసరాలతో ముడిపడి ఉండటంతో వేసవిలోనూ ఈ కాలువకు సాగునీటి సరఫరా కొనసాగుతోంది.
దీని కారణంగా మరమ్మతులు చేసే అవకాశాలు లేక తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీటి ప్రవాహ వేగం తగ్గింది.
నిర్మించి ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తికావడంతో అనేక కట్టడాలు, స్లూయీస్‌లు, రెగ్యులేటర్లు పూర్తిగా శిథిలమయ్యాయి.
నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైన ప్రయత్నాలు
కాలువ దుస్థితిపై రైతుల నుంచి అనేక విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం 18.08.10 నుంచి ఆధునికీకరణకు
పయత్నాలు ప్రారంభించింది.
అంచనా మొత్తం రూ.127 కోట్లు
కాలువ అడుగు భాగంతోపాటు సైడ్ వాల్స్‌ను పూర్తిగా సిమెంట్ లైనింగ్ చేసేందుకు అంచనా.
వీటితోపాటు రెగ్యులేటర్లు, స్లూయీస్‌ల నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు.
స్పందించని ఉన్నతాధికారులు.. కాలువ మరమ్మతుల ఆవశ్యకతను గుర్తిం చిన జిల్లా అధికారులు లైన్ ఎస్టిమేట్లు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అయితే వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక్కడి రైతుల్ని సంతృప్తిపరచడానికి నెల రోజుల క్రితం చీఫ్ ఇంజినీరు కార్యాలయం నుంచి నరేంద్రగౌడ్ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు గుంటూరు చానల్‌ను పరిశీలించారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఇప్పటి పరిస్థితులను పరిశీలిస్తే అంచనాల ఆమోదం, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, టెండర్ల దశలు దాటాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఆ శాఖ ఇంజినీర్లు చెబుతున్నార