englad team
-
మళ్లీ స్పిన్ పిచ్‌కు సిద్ధమే!
విశాఖపట్నం: రెండో టెస్టులోనూ స్పిన్ పిచ్‌పై సమరానికి సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. స్పిన్నర్ టామ్ హార్లీ మాయాజాలంతో హైదరాబాద్ టెస్టులో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్‌లో మరో పూర్తిస్థాయి స్పిన్ ట్రాక్ ఎదురైనా... తమ దళంలో అందుబాటులో ఉన్న నలుగురు స్పిన్నర్లతో దీటుగా ఎదుర్కొంటామని కోచ్ చెప్పారు. ‘ఒకవేళ తొలి టెస్టులాగే వైజాగ్‌లోని పిచ్ కూడా స్పిన్‌కే అనుకూలిస్తే భయపడం. జట్టులోని స్పిన్నర్లు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. షోయబ్ బషీర్ అబుదాబిలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడే సిరీస్‌లోనూ రాణించే నైపుణ్యం అతనికి ఉంది. తప్పకుండా ఇక్కడ కూడా అతను ప్రభావం చూపుతాడు’ అని మెకల్లమ్ అన్నాడు. వైజాగ్ చేరుకున్న ఇరుజట్లు భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం సాయంత్రం వైజాగ్ చేరుకున్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. అనంతరం ఆటగాళ్లంతా ప్రయాణ బడలిక దృష్ట్యా పూర్తిగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది. -
ఇంగ్లండ్ పేసర్ దెబ్బ; తొలి వన్డేలో ఘన విజయం
కార్డీఫ్: కార్డీఫ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ 9 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ షకీబ్ మహమూద్ దెబ్బకు 141 పరుగులకే కూప్పకులిపోయింది. ఆ తర్వాత 142 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (68), జాక్ క్రాలే (58) అజేయంగా అర్ధ సెంచరీలు సాధించడంతో 21.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. జాక్ క్రాలే అరంగేట్ర మ్యాచ్ లోనే ఆర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఫాస్ట్ బౌలర్ షకీబ్ మహమూద్ సహాయంతో ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 141 పరుగులకే పాకిస్థాన్‌ను కట్టడి చేసింది. షకీబ్ 42 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. షకీబ్ మహమూద్తో పాటు లూయిస్ గ్రెగొరీ, మాట్ పార్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.తొలి వన్డే కు ముందు ఇంగ్లాండ్ ప్రధాన ఆటగాళ్లు కొంత మంది కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లుతో కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. -
ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్
లండన్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం సచిన్ కుటుంబసమేతంగా లండన్‌లో ఉన్నాడు.