ENT counseling
-
సర్జరీ తర్వాత మాట సరిగా రావడం లేదు
నాకు ఈమధ్యే గుండెకు సంబంధించిన సర్జరీ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఎంత ప్రయత్నించినా మాట సరిగా రావడం లేదు. ఆ మాట కూడా గాలిలా వస్తోంది. అంతకముందు నాకు ఎప్పుడూ గొంతుకు సంబంధించిన సమస్యలు లేవు. ఇదేగాక... తినేటప్పుడు, తాగేటప్పుడు, మింగే సమయంలో ఇబ్బందిగా ఉంది. గొంతుకు ఏదో అడ్డు పడినట్లుగా ఉంది. నాకు తగిన పరిష్కారం చూపండి.– కె.వి.జె. రాజు, గుంటూరు మీ సమస్యకు సంబంధించిన వివరాలు పరిశీలించాక మీకు స్వరపేటికలోని ఒక భాగం అయిన ‘వోకల్ ఫోల్డ్’లో సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన ఆపరేషన్లు (ముఖ్యంగా ఓపెన్ హార్ట్ సర్జరీ), ట్రకియాస్టమీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్‌లో కొన్నిసార్లు వోకల్ఫోల్డ్కు ఒత్తిడి తగలడం లేదా అది దెబ్బతినడానికి అవకాశాలు ఎక్కువ. మీకు కూడా అలాగే జరిగినట్లుగా అనిపిస్తోంది. దీనివల్ల మీరు చెప్పిన విధంగానే మింగడం, మాట్లాడటంలో సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు వోకల్ ఫోల్డ్ పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంది. మీ సమస్యను నిర్ధారణ చేయడానికి మొదట మీరు అనుభవజ్ఞులైన ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించండి. మీకు అవసరాన్ని బట్టి లారింగోస్కోపీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అంతేకాదు... మీరొకసారి స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించి అవసరమైన ఎక్సర్సైజ్లు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మాట్లాడుతుంటే నత్తి వస్తోంది... పరిష్కారంచూపండి నేను బీటెక్ చదువుతున్నాను. నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడుతుంటే నాకు నత్తిలా వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. నా చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది. భవిష్యత్తులో ఉద్యోగం, కెరియర్ గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంటోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా బాధపడుతున్నాను. నాకు తగిన పరిష్కారం చూపండి.– డి. విశాల్, సికింద్రాబాద్ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్యకారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్ని సార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ముక్కులోఏదో అడ్డంపడినట్లుగాఉంటోంది... నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. చాలా రకాల మందులతో పాటు డాక్టర్ సలహా మేరకు ముక్కులోకి చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు.– డి. శివరామ్, నేలకొండపల్లి ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్నిరకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. తరచూ జలుబు చేస్తోంది... తగ్గేదెలా? నాకు తరచూ జలుబు చేస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు చేసుకోలేక పోతున్నాను. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికితోడు ఈ మధ్య చాలా నీరసంగా కూడా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.– కె.ఆర్. శ్రీనివాసమూర్తి, అమలాపురం మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది అన్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండుభాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఈఎన్టీ పరీక్షలకు కసరత్తు
నల్లగొండ టౌన్ : జిల్లాలో ఒకవైపు కంటివెలుగు వైద్యశిబిరాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. ఫిబ్రవరి మాసంలో ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతుతోపాటు డెంటల్ ) పరీక్షలను నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో గత ఆగస్టు 15న ప్రారంభమైన కంటివెలుగు శిబిరాలను ఈ నెల 26 వరకు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కొంత ఆలస్యమయ్యే అవకాశం కని సిస్తోంది. ఆ శిబిరాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఈఎన్టీ పరీక్షల శిబిరాలను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించడానికి అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌నుంచి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల స భ్యులందరి ఆరోగ్య వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన శిక్షణను ఏఎన్ఎంలకు పూర్తి చేశారు. ఏఎన్ఎంల వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌ల్లోకి 2014 సమగ్ర కుటంబ సర్వే లెక్కల ప్రకారం కుటుంబాల ఆరోగ్య వివరాలు ఎస్కెఎస్ నుంచి డౌన్లోడ్ ఆయ్యా యి. దీనిలో ఆయా కుటుంబ యజమాని ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే ఆ కుటుంబ సభ్యుల వివరా లు, ఆరోగ్య స్థితిగుతులు తెలిసిపోనున్నాయి. వాటి ఆధారంగా వారి వద్దకు వెళ్లి సభ్యుల ఆరోగ్య స్థితిగతులను ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ కుటుంబంలోని సభ్యులు మరణిస్తే వారి పేరును తొలగించడం, కొత్త సభ్యులు వస్తే నమోదు చేయడం వంటి సదుపాయం కూడా కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గంగవరప్రసాద్ ఈ నెల 16వ తేదీలోగా హెల్త్ ప్రొఫైల్‌ను పూర్తి చేసి తమకు అందజేయాలని ఆయా వైద్యాధికారులకు, డిప్యూటి డీఎంహెచ్ఓలకు, ఏఎన్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏఎన్ఎంలు హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన అన్ని కుటుంబాల హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపించనున్నారు. తదనంతరం అక్కడినుంచి ఇచ్చే గైడ్‌లైన్స్ మేరకు ఫిబ్రవరిలో ఈఎన్టీ పరీక్షల క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. శిబిరాల కోసం అవసరమైన ఈఎన్టీ డాక్టర్లు, ఆడియాలజిస్టులు, డెంటల్ డాక్టర్ల నియామకంతో పాటు పరీక్షలకు కావాల్సిన పరికరాలను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆదేశాలు రాగానే ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈఎన్టీ పరీక్షలు నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పటికే ఆ యా కుటుంబ సభ్యుల హెల్త్ ఫ్రొఫైల్‌ను అన్ని పట్టణాలు, గ్రామాలలో సి బ్బంది సేకరిస్తున్నారు. హెల్త్ ప్రొఫైల్ ఆ ధారంగా కమిషనర్ ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకా రం శిబిరాలను ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ గంగవరప్రసాద్, డీఎంహెచ్ఒ -
సైనసైటిస్ అంటువ్యాధి కాదు
ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు చాలా ఎక్కువగా తలనొప్పి వస్తోంది. ఇది నాకు ఎవరి నుంచైనా వ్యాపించిందేమో అనిపిస్తోంది. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - విజయ్‌కుమార్, నల్లగొండ మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక చిన్న పట్టిక ఇది... అపోహ: సైనసైటిస్‌తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది. వాస్తవం: నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్‌తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి వచ్చేవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాస్తవం: నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల మీకు ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి. వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. ఒకవేళ సైనస్లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. మీరు వెంటనే ఈఎన్టీ నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. - డా॥శ్రీనివాస్ కిశోర్ సీనియర్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డు!
ఈఎన్టీ కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఈ సమస్యనుంచి బయటపడటానికి చాలా రకాల మందులు వాడాను. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. అయితే ఆ మందుకు అలవాటు అవుతానేమో అనే ఆందోళనతో మానేశాను. దాంతో రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. - హుసేన్ మియా, విజయవాడ ఇటీవల వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల మీరు చెబుతున్న సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. పైగా చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యల వల్ల ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట బయటపడే వాటిల్లో ముక్కుకు సంబంధించిన సమస్యలే ఎక్కువ. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడమో లేదా అలర్జీ ఉండటమో లేదా ముక్కులో పాలిప్స్ ఉండటమో లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండటమో జరగవచ్చు. మొదట మీరు నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చిన సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులకు దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఈసీ వినయకుమార్ హెచ్ఓడి అండ్ ఇఎన్‌టి సర్జన్ అపోలో హాస్పిటల్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్