Environmental Education
-
ఈసారి ఇంటర్లో ఆ పరీక్ష లేదు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ఈసారి ఎన్విరాన్మెంటల్, హ్యూమన్ వ్యాల్యూస్ అండ్ ఎథిక్స్ పరీక్షలు ఉండవు. అసైన్మెంట్ల ద్వారా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఆయా సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులకు అసైన్మెంట్లు ఇచ్చి ఇంటి వద్ద వాటికి సమాధానాలు రాసి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ బోర్డు రూపొందించిన అకడమిక్ కేలండర్లో ఈ మేరకు ప్రతిపాదించింది. ఇక మిగతా వాటికి ప్రతి సబ్జెక్టులో 70 శాతం సిలబస్‌తో, 100 మార్కులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఇక ప్రాక్టికల్స్ ఉండే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో.. థియరీ పరీక్షలకు 70, ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు ఉండేలా ప్రతిపాదించింది. అదే విధంగా... ఈసారి ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలను పెంచుతోంది. మరోవైపు ప్రాక్టికల్స్‌కు ప్రశ్నపత్రాలను బోర్డు నుంచి పంపించకుండా, కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు రూపొందించి పరీక్షలు నిర్వహించి మార్కులను బోర్డుకు పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన అకడమిక్ కేలండర్పై ఈనెల 27వ తేదీన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మూడు రకాలుగా తరగతులు ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యా బోధనను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించేందుకు బోర్డు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కాలేజీల వారీగా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రణాళికలను రూపొందించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ప్రస్తుతం ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా విద్యార్థుల సంఖ్య ఉంది. 404 ప్రభుత్వ కాలేజీలను చూస్తే వేయికి పైగా విద్యార్థులు కలిగిన కాలేజీలు 12 ఉన్నాయి. అందులో కొన్నింటిలో 2 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు కాలేజీలు 1,600 వరకు ఉండగా, అందులో ఎక్కువ కాలేజీల్లో 500 మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్న కాలేజీల్లో షిఫ్ట్ విధానంలో బోధన చేపట్టనున్నారు. బాగా తక్కువ విద్యార్థులు ఉన్న కాలేజీల్లో మామూలుగానే ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు తరగతులుంటాయి. అంతకంటే ఎక్కువ, వేయిలోపు విద్యార్థులున్న కాలేజీల్లో మాత్రం ఒక రోజు ఫస్టియర్, మరొక రోజు సెకండియర్ విద్యార్థులకు విద్యా బోధన చేపట్టే అవకాశం ఉంది. పరీక్షల షెడ్యూల్లో మార్పులుంటాయా? ఈసారి ఇంటర్ పరీక్షలను మే 3వ తేదీ నుంచి ప్రారంభించేలా బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రధాన పరీక్షలు మే 19వ తేదీతో ముగిసేలా, పరీక్షలన్నీ మే 24వ తేదీవరకు ముగిసేలా ప్రతిపా దించింది. అయితే ఇప్పటికే టెన్త్ పరీక్షలను మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను మరో రెండు మూడ్రోజులు ప్రీపోన్ చేసే అవకాశముంది. లేదం టే టెన్త్ పరీక్షల షెడ్యూల్ మార్పు చేయాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థుల ప్రధాన పరీక్షలు మే 19వ తేదీతో ముగుస్తాయి కనుక టెన్త్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీనిపై 27వ తేదీన విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
♦ జూన్ 1 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ ♦ ఫీజు చెల్లింపునకు ఈ నెల 30 వరకు గడువు ♦ ఆలస్య రుసుముతో అవకాశం లేదు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు వెల్లడించింది. ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరపనున్నట్లు తెలిపింది. జూన్ 1 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలకు నిర్వహించనుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనుంది. సాధారణ ఇంటర్మీడియెట్ పరీక్షల టైంటేబులే వొకేషనల్ కోర్సు విద్యార్థులకూ వర్తిస్తుందని బోర్డు వివరించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు తెలిపింది. ఆ తరువాత ఆలస్య రుసుముతో ఫీజు తీసుకునేది లేదని స్పష్టం చేసింది. -
నైతిక విలువలు ఉంటేనే ఇంటర్ పాస్ !
విజయనగరం అర్బన్: ఇంటర్ విద్యార్థులకు నైతిక, మానవీయ విలువలు ఉంటేనే మొదటి సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. నైతిక విలువలతో కూడిన సబ్జెక్టు పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంది. లేకపోతే మిగిలిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా మార్కులను పక్కన పెడతారు. జూనియర్ ఇంటర్లో గత ఏడాది నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ (నైతిక, మానవీయ విలువులు) అనే సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే పర్యావరణ విద్య(ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్) ఉంది. మామూలు సబ్జెక్టులతోపాటు ఈ సబ్జెక్టుల్లోనూ కచ్ఛితంగా పాస్ కావాలి. ఎందుకంటే..! నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు మార్కులు, ర్యాంకులు మినహా ఇతర అంశాలపై దృష్టి సారించడం లేదు. పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించడంలేదు. సామాజిక బాధ్యతలను కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్యను ఒక సబ్జెక్టుగా చేర్చారు. ఈ ఏడాది నైతిక, మానవీయ విలువలు అనే సబ్జెక్ట్ ప్రవేశపెట్టారు. పర్యావరణంపై అవగాహన పెంపొందించుకోడానికి, నైతిక, మానవీయ విలువలను తెలుసుకోవడానికి ఈ సబ్జెక్టులు దోహదపడుతున్నాయి. ఆయా సబ్జెక్టుల్లో థియరీలో 60, ప్రాజెక్టు వర్క్‌లో 40 మార్కులకు ప్రశ్నలుంటాయి. తప్పనిసరిగా ఈ పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. నూతనంగా ప్రవేశపెట్టిన నైతిక, మానవీయ విలువులు సబ్జెక్టుపై ఈ నెల28న, పర్యావరణ విద్య సబ్జెక్టుపై 31వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు. తప్పనిసరిగా క్వాలిఫై కావాలి ‘జూనియర్ ఇంటర్ విద్యార్థులు తప్పనిసరిగా పర్యావరణ విద్య, నైతిక, మానవీయ విలువులు పరీక్షల్లో క్వాలిఫై కావాలి. లేకపోతే వారికి మార్కుల జాబితాలు ఇవ్వరు. దీనివల్ల డిగ్రీ, ఇతర ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం ఉండదు. ఈ మేరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.’ - ఎ.విజయలక్ష్మి, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి.