మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ | Advanced supplementary from may24 | Sakshi
Sakshi News home page

మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

Published Sat, Apr 23 2016 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

జూన్ 1 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్
ఫీజు చెల్లింపునకు ఈ నెల 30 వరకు గడువు
ఆలస్య రుసుముతో అవకాశం లేదు
 
 సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు వెల్లడించింది. ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరపనున్నట్లు తెలిపింది. జూన్ 1 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ పరీక్షను  జూన్ 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలకు నిర్వహించనుంది.

ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనుంది. సాధారణ ఇంటర్మీడియెట్ పరీక్షల టైంటేబులే వొకేషనల్ కోర్సు విద్యార్థులకూ వర్తిస్తుందని బోర్డు వివరించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు తెలిపింది. ఆ తరువాత ఆలస్య రుసుముతో ఫీజు తీసుకునేది లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement