Equations
-
జమ్మలమడుగులో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించగా, బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమని భూపేష్‌రెడ్డి అంటున్నారు. బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలన చేస్తోంది. పార్టీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు జరిపారు. జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి మరో సీటు పెరగనుంది. ఇదీ జరిగింది.. కాగా, కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది. ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్‌ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం. ఇదీ చదవండి: నాడు తండ్రి.. నేడు తనయుడికి ‘ఆది’పోటు -
సమీకరణాలు మారుతున్నాయా? ఎవరి జాతకాలు ఎలా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? పార్టీల్లో కుమ్ములాటలు, వర్గ విభేదాలు ఎలా ఉన్నాయి? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితేమిటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? మరో ఇద్దరు మంత్రుల పరిస్థితేమిటి..? ఈటల గజ్వేల్‌కి వెళితే.. హుజూరాబాద్ లో ఎవరు పోటీ చేస్తారు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రౌండప్‌లో చూద్దాం.. చదవండి: మునుగోడు యాక్షన్ ప్లాన్ రెడీ.. కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా.. మలి విడత ఉద్యమం ఉవ్వెత్తున లేచి.. ఊరూరా జేఏసీలు ఏర్పడి ప్రజలే సైనికుల్లా మారి రాజకీయ యుద్ధం చేసిన పోరాట గడ్డ.. తొలి సింహగర్జన.. తెలంగాణ రాష్ట్ర సమితి సారథిగా కేసీఆర్ అరెస్ట్ అయ్యింది కరీంనగర్‌లోనే. ఉద్యమాలు చేసిన ప్రాంతం కావడం వల్లే.. రాజకీయంగా కూడా చైతన్యం ఏర్పడింది. ప్రజలు కూడా టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ అండగా ఉంటూ వస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మంట్లో మాత్రం ప్రతిసారీ విభిన్నమైన తీర్పు వస్తోంది. 2009లో కాంగ్రెస్ గెలిస్తే.. 2014లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్ గెలిచారు. ఇక పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో గతంలో కాంగ్రెస్ గెలవగా.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారు. ఇదే నిజమైతే లోక్‌సభకు ఎవరిని దింపుతారో చూడాలి. పెద్దపల్లి ఎంపీ స్థానంలో మాత్రం టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతనే బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో 2009 వరకూ కాంగ్రెస్ హవా కొనసాగింది. టీఆర్ఎస్ రాకతో హస్తం చతికిలపడింది. గత రెండు ఎన్నికల్లోనూ 13 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. ఇదిలా ఉంటే.. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ రాజకీయ చరిత్రను మార్చేసింది. కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కారు దిగి కాషాయ సేనలో చేరారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలోనే దళితబంధుకు అంకురార్పణ జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సిరిసిల్ల నుంచే పోటీ చేస్తారనేది క్లియర్. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డే ఈసారి కూడా బరిలో నిలబడతారని భావిస్తున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేత కటకం మృత్యుంజయంతో పాటు రెడ్డబోయిన గోపిల పేర్లు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్ విషయానికి వస్తే కరీంనగర్లో ఆయన గ్రాఫ్ ఏమీ తగ్గలేదంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తే తేలికగా గెలుస్తారనే టాక్ వినిపిస్తోంది. ధర్మపురికి ప్రాతినిథ్యం వహించే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉందంటున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల ముఖ్య నేతలు కారెక్కారు. వీరిలో కొందరు నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో అలజడి రేగింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి వర్గ విభేదాలు తలనొప్పిగా మారే పరిస్థితులున్నాయి. టీఆర్ఎస్లోనూ ఇలాంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. కరీంనగర్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తర్వాత కారెక్కిన చల్మెడ లక్ష్మీ నరసింహారావు వేములవాడలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మరీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పరిస్థితి ఏంటనేది ప్రశార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో పార్టీలకతీతంగా రాజకీయ నాయకులంతా జనం బాట పట్టారు. మంత్రుల్లో కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లు ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా గజ్వేల్‌పై దృష్టి పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈటల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రసమయి బాలకిషన్ ప్రతి రోజూ ఏదో ఒక ఊర్లో దర్శనం ఇస్తున్నారు. రామగుండంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా హడావుడి చేస్తున్నారు. మంథని ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ లేదనే చెప్పాలి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా సమయం చిక్కినప్పుడల్లా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పార్లమెంటరీ నియోజక వర్గంలో పాదయాత్రలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీల నేతలు ముందుగానే తమ తమ నియోజక వర్గాల్లో హల్ చల్ చేస్తున్నారు. చరిత్ర తిరగరాసిన నేతలు.. విలక్షణ తీర్పులు ఇచ్చిన కరీంనగర్ జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికల నాటికి ఎవరెవరి జాతకాలు ఎలా మార్చుతారో చూడాలి. -
ఏపీ శాసన మండలిలో మారనున్న సమీకరణాలు
సాక్షి, అమరావతి: రేపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సమీకరణాలు మారనున్నాయి. మండలిలో రేపటి నుంచి ఆధిక్యంలోకి వైఎస్సార్సీపీ రానుంది. రేపు మండలి నుంచి ఏడుగురు టీడీపీ సభ్యులు రిటైర్ కానున్నారు. మండలిలో 22 నుంచి 15కు టీడీపీ బలం పడిపోనుంది. గవర్నర్ కోటాలో తాజాగా నలుగురు వైఎస్సార్సీపీ సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మండలిలో 17 నుంచి 20కు వైఎస్సార్సీపీ బలం పెరగనుంది. రేపు వైఎస్సార్సీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి రిటైర్ కానున్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తొలగించం: సీఎం జగన్ -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్‌పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్‌ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్‌దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
నంబర్ గేమ్!
పొడుస్తున్న పొత్తులతో మారుతున్న సమీకరణలు మేజిక్ ఫిగర్‌కోసం పార్టీల ముమ్మర ప్రయత్నాలు జతకడుతున్న చిరకాల రాజకీయ ప్రత్యర్థులు ఆసక్తి రేకెత్తిస్తున్న శాసనమండలి ఎన్నికలుసాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ;శాసనమండలి సమరం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జంప్‌జిలానీలు, జతకడుతున్న ప్రత్యర్థులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గ తేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లను సాధించింది. రెండో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్, మూడో స్థానంలో టీడీపీ నిలిచాయి. అయితే ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సమీకరణలు మారిపోయాయి. సంఖ్యాబలం లేకున్నా జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరింది. చాలా మంది ఎంపీటీసీలు గోడ దూకడంతో ఆ పార్టీ బలీయశక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్, టీడీపీలు కకావికలమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటాలో తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమని టీఆర్ఎస్ ఆశిస్తోంది. కాగా, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో మండలి రాజకీయం ఉత్కంఠను కలిగిస్తోంది. ముఖ్యంగా చిరకాల రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్, టీడీపీలు కౌన్సిల్ ఎన్నికల్లో సర్దుబాటు చర్చలు జరుపుతుండడం అధికారపార్టీని ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఇరుపార్టీలు జతకడితే ఉమ్మడిగా టీఆర్ఎస్ను నిలువరించడం పెద్ద కష్టమేమీకాదు. రెండు పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు చాలా మంది కారెక్కినప్పటికీ, ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు సరిపడా సంఖ్యాబలం ఉంది. కూడికలు.. తీసివేతలు చేతులు కలిపితే రెండు సీట్లు గెలుచుకోవచ్చనే ఉద్దేశంతో టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపాయి. సిద్ధాంతాల మధ్య వైరుఢ్యం ఉన్నా.. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉమ్మడిగా టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలనే కోణంలో జిల్లా నాయకత్వాలు కలిసిపోదామని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ కూడా అండగా నిలుస్తుందని అంచనా వేస్తోంది. దీంతో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాదిలో దక్కించుకున్న సీట్లకంటే ప్రస్తుతం అదనంగా 34 స్థానాలు ఉన్నట్లు లెక్క తీసింది. ఇందులో కొంతమంది చివరి నిమిషంలో ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లినా గెలుపునకు ఢోకా ఉండదని అనుకుంటోంది. అదేతరుణంలో గతంలో పార్టీ మారిన కొందరు తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది. దీనికితోడు టీఆర్ఎస్ సీనియర్లలో ఉన్న అసంతృప్తులు కూడా తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే బల మైన అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపేలా వ్యూహాలకు పదు ను పెడుతోంది. జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థ ల్లో 766 మంది ప్రతినిధులుండగా, ప్రస్తుతం ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సంఖ్యా ‘బలం’ ఇలా.. పార్టీల మధ్య అవగాహన కుదిరితే పక్షాల బలాబలాలు అనూహ్యంగా మారుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 236 మంది సభ్యులున్నారు. ఈ పార్టీ టీడీపీతో జతగడితే వీరి బలం 339కి పెరుగుతుంది. ఇప్పటికే టీడీ పీకి మిత్రపక్షంగా ఉన్న బీజీపీకి 44 మంది సభ్యులున్నారు. తాజా కూటమిలో బీజేపీ కూడా చేరితే వీరి సంఖ్య 383కు చేరుతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారపార్టీ గూటికి చేరిపోయారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ వైపు 299 మంది ప్రతినిధులున్నారు. అయితే 26 మంది సభ్యులున్న మజ్లీస్ ఎవరికి మద్దతిస్తుందనే అంశంపై ఇంకా స్పష్టతలేదు. అదేవిధంగా వామపక్ష పార్టీలకు చెందిన 12 మంది, స్వతంత్రులు 46 మంది ఏ పార్టీవైపు మొగ్గుతారో వేచిచూడాలి.