eshwar Rao
-
టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ
చిత్తూరు రూరల్: టీడీపీ పేరుకు మాత్రమే బీసీల పార్టీ అని.. కానీ, నిజానికి అది బీసీల వ్యతిరేక పార్టీ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత రావూరి ఈశ్వరరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీని నమ్ముకుని తాను వీధిలో పడ్డానని కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీలోని ఓ నలుగురు నాయకులు తన కొంపముంచారని ఆరోపించారు. చిత్తూరు గురునగర్ కాలనీలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో పార్టీలో తనను పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. అంతేకాక.. రూ.340 కోట్లు విలువచేసే తన ఫ్యాక్టరీని మూయించారన్నారు. ఇన్నాళ్లు పార్టీలో ఉన్నందుకు తన పరువు పూర్తిగా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిజానికి.. ప్రజాసేవ చేస్తూ 24 ఏళ్లు టీడీపీకి బానిసలా సేవచేశానని.. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా అనేక సంవత్సరాలు పనిచేశానని ఆయన చెప్పారు. పైగా.. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మనోహర్ విజయంలో కీలకపాత్ర పోషించానన్నారు. కానీ, పార్టీ కోసం ఇంతలా కృషిచేసిన తనకు టీడీపీ తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు. టీడీపీలోని ఆ నలుగురు నేతలు తనను దారుణంగా అవమానించారని.. వీరు చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గ నేతలను అస్సలు ఎదగనివ్వడంలేదని ఆయన చెప్పారు. ప్రస్తుత టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గురజాల జగన్మోహన్కు కూడా వారి నుంచి అవమానాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇలాంటి నీచమైన పార్టీ నుంచి తాను వైదొలుగుతున్నానని.. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రావూరి ఈశ్వరరావును వైఎస్సార్సీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి కలిశారు. రావూరికి పార్టీ కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించి తన విజయానికి పాటుపడాలని అభ్యర్థించారు. సీఎం వైఎస్ జగన్ సింహంలాంటి వారని, ఆయన చేస్తున్న అభివృద్ధి తనకు బాగా నచ్చిందని రావూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయానందరెడ్డి గెలుపునకు తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
వారికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుంది. కేసీఆర్‌ను కాదని ఇతర పారీ్టలకు ఓట్లు వేయొద్దు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే రాష్ట్రం పదేళ్లు తిరిగి వెనుకకు పోతుంది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో నామినేషన్ వేశారు. అంతకుముందు హరీశ్‌రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ అనంతరం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని చెప్పారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌పై కొందరు నాయకులు సంచలనాల కోసం నోరుపారేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1.80 లక్షల ఉద్యోగాలు కలి్పంచామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పారీ్టకి రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా రాదని, డక్ ఔట్ అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గానికి 7వ సారి నామినేషన్ వేశానని చెప్పారు. -
యువతి గొంతుకోసిన గుర్తుతెలియని వ్యక్తి
గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి కావేరి(18) అనే యువతి గొంతు కోశాడు. ఈ ఘటనలో ఆమెకు గొంతుపై తీవ్రగాయం కావడంతో గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కావేరికి మూడు నెలల క్రితమే ఈశ్వరరావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త బైక్ మెకానిక్. ప్రొద్దునే బైక్ గ్యారేజీకి భర్త వెళ్లటంతో ఇంట్లో ఒక్కటే ఉంది. ఇది గమనించిన దుండగుడు ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి మంచి నీళ్లు అడిగాడు. నీళ్లు తీసుకురావడానికి కావేరి ఇంట్లోకి వెళ్లింది. ఆమెతో పాటే దుండగుడు లోపలికి వెళ్లి మెడలోని గొలుసును లాక్కెళ్లబోయాడు. కావేరి ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. గాయాలపాలైన కావేరిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని విశాఖ సౌత్‌జోన్ ఏసీపీ రామ్మోహన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను తగలబెట్టిన దుండగులు
అనంతగిరి మండలం వాలాసి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఓ బైక్‌ను పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. దీంతో యజమాని ఈశ్వర్ రావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.