Euro Football Championship
-
‘యూరో’లో ఇటలీ జైత్రయాత్ర
లండన్: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ ఇటలీ ఫుట్‌బాల్ జట్టు యూరో కప్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ జట్టుతో ఇక్కడి వెంబ్లీ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో 4–2తో మూడుసార్లు చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. గత 34 మ్యాచ్‌ల్లో ఇటలీకి ఓటమి లేకపోవడం విశేషం. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఇటలీ తరఫున 60వ నిమిషంలో చియేసా గోల్ చేయగా... స్పెయిన్ తరఫున 80వ నిమిషంలో మొరాటా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. -
నేటి నుంచి ‘యూరో’
రోమ్: స్టార్ ఆటగాళ్లంతా పాల్గొనే ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ ‘యూరో కప్’కు రంగం సిద్ధమైంది. కరోనాతో గతేడాది వాయిదా పడిన ఈ మెగా ఈవెంట్‌ను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. నేడు అర్ధరాత్రి 12.30 నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇటలీతో టర్కీ తలపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఆతిథ్య దేశం కాకుండా 11 దేశాల్లో ఈ సారి యూరో కప్ నిర్వహిస్తుండటం విశేషం. రోమ్ (ఇటలీ)లో మొదలయ్యే ఈ టోర్నీ రష్యా, అజర్బైజాన్, జర్మనీ, రుమేనియా, స్పెయిన్, నెదర్లాండ్స్, హంగేరి, డెన్మార్క్, స్కాట్లాండ్లలో లీగ్ మ్యాచ్‌లు జరుపుకొని ఇంగ్లండ్‌లో జూలై 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా లండన్‌లోనే జరుగనున్నాయి. మొత్తం 24 జట్లు ఆరు గ్రూపులుగా తలపడనున్నాయి. మ్యాచ్‌ల్ని స్టేడియంలో ప్రత్యక్షంగా తిలకించే అవకాశముంది. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరించి తీవ్రత తక్కువ ఉన్న దేశాల్లో అధిక సీట్ల సామర్థ్యంతో, వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో స్వల్ప సంఖ్యలోనైనా ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నారు. టీవీలో ఈ మెగా టోర్నీని ‘సోనీ నెట్వర్క్’ ప్రసారం చేస్తోంది. తెలుగు ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘సోనీ టెన్ 4’ చానల్లో తెలుగులో వ్యాఖ్యానంతో తొలిసారి యూరో కప్‌ను ప్రసారం చేస్తున్నారు. ఎవరు ఏ గ్రూపులో... టర్కీ, ఇటలీ, వేల్స్, స్విట్జర్లాండ్ (ఎ), డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, రష్యా (బి), నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ఆస్ట్రియా, నార్త్ మెక్డోనియా(సి), ఇంగ్లండ్, క్రొయేషియా, స్కాట్లాండ్, చెక్ రిపబ్లిక్ (డి), స్పెయిన్, స్వీడెన్, పొలండ్, స్లోవేకియా (ఇ), హంగేరి, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ (ఎఫ్). -
సూపర్ స్లొవేకియా
* రష్యాపై 2-1తో విజయం * హామ్సిక్ అద్భుత ప్రదర్శన * యూరో కప్ లిలీ మెట్రోపోల్ (ఫ్రాన్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా తొలిసారి యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్లొవేకియా జట్టు అదరగొట్టే ఆటతీరుతో అద్భుతం చేసింది. తొలి మ్యాచ్‌లో వేల్స్ జట్టు చేతిలో ఓడినప్పటికీ... రెండో మ్యాచ్‌లోనే తేరుకొని నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. రష్యా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో స్లొవేకియా 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. స్లొవేకియా తరపున వీస్ (32వ నిమిషంలో), హామ్సిక్ (45వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... రష్యాకు గ్లుషకోవ్ (80వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. ఆరంభంలో అంతగా దూకుడు కనబరచని స్లొవేకియా 32వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలచింది. మధ్య భాగంలో నుంచి హామ్సిక్ అందించిన లాంగ్‌పాస్‌ను ఎడమవైపున అందుకున్న వీస్ ‘డి’ ఏరియాలో ఇద్దరు రష్యా డిఫెండర్లను ఏమార్చి కుడికాలితో బలమైన షాట్ కొట్టి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ తర్వాత 45వ నిమిషంలో హామ్సిక్ ఎడమవైపు నుంచి క్లిష్టమైన కోణం నుంచి కొట్టిన షాట్ నేరుగా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో స్లొవేకియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో రష్యా ఎదురుదాడులు చేసినా... స్లొవేకియా పటిష్టమైన డిఫెన్స్‌తో వారి ఆశలను వమ్ము చేసింది. చివర్లో సబ్‌స్టిట్యూట్ గ్లుషనోవ్ గోల్ చేసినా... రష్యాకు నిరాశే మిగిలింది. పోర్చుగల్‌ను నిలువరించిన ఐస్లాండ్ సెయింట్ ఎటెని: క్రిస్టియానో రొనాల్డో, నాని, పెపెలాంటి పలువురు స్టార్ ఆటగాళ్లతో కూడిన పోర్చుగల్ జట్టుకు తొలి మ్యాచ్‌లో ‘డ్రా’ ఎదురైంది. ట్విట్టర్లో రొనాల్డోకు ఉన్న ఫాలోవర్స్ (43 లక్షలు)లో పదోవంతు కూడా జనాభా లేని ఐస్లాండ్ (3 లక్షల 32 వేలు) జట్టు యూరో అరంగేట్రంలోనే పటిష్టమైన పోర్చుగల్‌ను 1-1తో నిలువరించి అందరి దృష్టిని ఆకర్షించింది. పోర్చుగల్ తరఫున నాని (31వ నిమిషంలో)... ఐస్లాండ్ తరఫున బిర్కిర్ జార్నాసన్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్కోరును సమం చేశాక... ఐస్లాండ్ మొండి పట్టుదలతో పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో పోర్చుగల్ మరో గోల్ చేయడంలో విఫలమైంది. ఐస్లాండ్ ఆటతీరుపట్ల రొనాల్డో అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్కోరును సమం చేశాక ఐస్లాండ్ ఆటగాళ్లు గోల్‌పోస్ట్ ముందు బస్సు అడ్డుపెట్టి ఆడినట్లు వ్యవహరించారని విమర్శించాడు. స్విట్జర్లాండ్, రొమేనియా మ్యాచ్ డ్రా గ్రూప్ ‘ఎ’లో స్విట్జర్లాండ్, రొమేనియాల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. 18వ నిమిషంలో రొమేనియాకు లభించిన పెనాల్టీ కిక్‌ను బొగ్దాన్ స్టాన్‌కు గోల్‌గా మలిచాడు. స్విట్జర్లాండ్ తరఫున 57వ నిమిషంలో మెహమెది గోల్ చేశాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ ఖాతాలో నాలుగు, రొమేనియాకు ఒక పాయింట్ ఉన్నాయి. ‘యూరో’లో నేడు ఇంగ్లండ్ X వేల్స్ సా.గం. 6.30 నుంచి ఉక్రెయిన్ X నార్తర్న్ ఐర్లాండ్ రా.గం. 9.30 నుంచి జర్మనీ X పోలాండ్ రా.గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం