ex army
-
22 ఏళ్ళు దేశం కోసం పనిచేస్తే... టీడీపీ వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్
-
మాజీ జవాన్ నిర్వాకం.. మద్యంమత్తులో కలెక్టరేట్‌కి వచ్చి..!
వేలూరు: వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవాన్ని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఓ మాజీ ఆర్మీ జవాన్ తన భార్యతో కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ వద్దకు వెళ్లి.. మద్యం మత్తులో సెల్‌ఫోన్‌ను చూస్తూ నిలుచున్నాడు. ఆ సమయంలో వినతిపత్రం ఇవ్వాలని కలెక్టర్ మాజీ జవాన్‌ను కోరగా అందుకు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. గమనించిన జిల్లా అధికారులు వెంటనే పోలీసులను రప్పించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడ మద్యం మత్తులో అతను కింద పడి పోయాడు. అనంతరం పోలీసులు విచారణ జరపగా అతను వేలూరు జిల్లా కన్నియంబాడికి చెందిన మాజీ జవాన్ వేల్మురుగన్ తేలింది. ఇతని కుటుంబ ఆస్తి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తేలింది. దీంతో పోలీసులు చేసేది లేక అతన్ని కారులో ఇంటికి పంపించి వేశారు. -
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రోడ్రిగ్స్ కన్నుమూత
న్యూఢిల్లీ/పనాజీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని పనాజీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో తెలియజేసింది. జనరల్ రోడ్రిగ్స్ 1990 నుంచి 1993 వరకు భారత సైనికాధిపతిగా పనిచేశారు. 2004 నుంచి 2010 దాకా పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారు. రోడ్రిగ్స్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
అనంతపురంలో టీడీపీ నేతల భూ కుంభకోణం
సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సైనికుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి టీడీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ భూ బాగోతం రాచానపల్లి, ఇటుకలపల్లి, కురుగుంట గ్రామాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. మాజీ సైనికుల పేరుతో వంద కోట్ల రూపాయల విలువైన భూములు స్వాహా చేసిన టీడీపీ నేతల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలతో.. మాజీ సైనికుల పేర్లతో భూమి పట్టాలు పొంది.. ఆ వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని.. లోతుగా విచారిస్తే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఏవిధంగా స్వాహా చేశారో తెలుస్తుందని స్థానికులు కోరుతున్నారు. చదవండిః కన్నయ్య కుమార్‌పై దాడికి యత్నం -
పోరాటాలే శరణ్యమా...!
కార్పొరేషన్ మాయ : ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కొత్తడ్రామాకు తెరదీశారు. మాజీ సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో ప్రకటించారు. ఇందుకు రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి జీఓ ఇవ్వలేదు. నిధులు కేటాయించకుండా మొండిచెయ్యి చూపారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలను మంజూరు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ జవాన్లు వాపోతున్నారు. పూర్తిగా నిర్లక్ష్యం : 20 ఏళ్ల కిందట టీటీడీలో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ప్రస్తుతం దాన్ని పూర్తిగా విస్మరించారు. కేవలం పలు శాఖల్లో ఔట్సోర్సింగ్ కింద మాత్రమే నియామకాలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 మందికి పైగా గన్ లైసెన్స్ ఉన్నారని, వీరికి అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెబుతామని శపథం చేస్తున్నారు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు చింతకొమ్మదిన్నె మండలంలో మాజీ సైనికుల భూములను కోట్టేశారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి ఉందని వారు వాపోతున్నారు. ఆదుకున్న వైఎస్సార్ : దివంగత సీఎం వైఎస్సార్ 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు మాజీ సైనికులు ఇంటిపట్టాలు ఇచ్చారు. దీంతో పావలా వడ్డీతో రుణాలు ఇచ్చారు. 2009 ఎన్నికల సమయంలో మరిన్ని సంక్షేమ పథకాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారని కానీ ఆయన మరణంతో తదుపరి ఏర్పడిన ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని మాజీ జవాన్లు చెబుతున్నారు. మాజీ సైనికుల ప్రధాన డిమాండ్లు ఇవే వైఎస్సార్ తరహాలోనే ఇంటి పట్టాలు, పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలి. రూ.వెయ్యి కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టాలి. ప్రతి మాజీ సైనికుడికి ఇంటిస్థలాలు, పొలాలు అందించాలి. అలాగే కేటాయించిన ఇంటి స్థలాల ప్రాంతంలో ప్రత్యేక నిధులతో బోర్లు, రోడ్లు ఏర్పాటు చేయించాలి. తమకు పక్కా గృహాలు కేటాయించాలి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మంది మాజీ సైనికులు ఉన్న ప్రాంతంలో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి. వైఎస్సార్ మాదిరి చేయాలి వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలువురు మాజీ సైనికులు ఇంటి పట్టాలు అందాయి. పావలా వడ్డీలతో రుణాలిచ్చి మాజీ సైనికులను గౌరవించారు. ఆయన తరహాలో పథకాలు అమలు చేసే నాయకుడికే మాజీ జవాన్లు మద్దతు పలుకుతున్నారు. చాలామంది వైఎస్‌జగన్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. – రామక్రిష్ణారెడ్డి, పోరుమామిళ్ల అర్హులైన అధికారులను నియమించాలి జిల్లాస్థాయి మాజీ సైనిక్ వేల్ఫేర్ బోర్డుల్లో అర్హులైన అధికారులను నియమించాలి. ఇతర శాఖలకు చెందిన అధికారులను నియమించడంతో మాజీ సైనికులకు సంక్షేమ ఫలాలు అందడం లేదు. అర్హులైన మాజీ సైనికులను నియమిస్తే అన్ని బెనిఫిట్స్ మాజీ సైనికులకు అందుతాయి. – కెప్టెన్ నారాయణ, పోరుమామిళ్ల చెప్పినవి కూడా చేయలేరా? మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం పెట్టలేదు. చెప్పిన హామీని నెరవేర్చలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. మాజీ సైనికులకు అన్ని రకాల వసతులు కల్పించాలి. – టీఎం బాషా, పోరుమామిళ్ల ప్రభుత్వాలు చొరవ చూపాలి సైన్యంలో సేవలందిచి ఇక్కడికి వచ్చాక మాజీ సైనికులకు అందాల్సిన బెనిఫిట్స్ అందడం లేదు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లురిగేలా తిరగాల్సి వస్తోంది. మా పరిస్థితి చూసి నేటి యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా మాజీ సైనికులకు తగిన గౌరవం, వసతులు కల్పించాల్సి ఉంది. – బయన యల్లారెడ్డి, పోరుమామిళ్ల -
ఇమ్రాన్‌కు ఆర్మీ అండదండలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మిలటరీ, ఐఎస్ఐ మద్దతుతో ప్రధాని గద్దెనెక్కనున్న ఇమ్రాన్ ఖాన్ కారణంగా.. భారత్‌తో సత్సంబంధాల్లో మార్పు ఉంటుందని ఆశలేమీ పెట్టుకోవద్దని రాజకీయ, మిలటరీ నిపుణులు హెచ్చరించారు. ‘ఆయన ఆర్మీ మనిషి. పాక్ ఆర్మీ చెప్పింది చేయడమే ఆయన పని’ అని పాకిస్తాన్లో భారత మాజీ దౌత్యవేత్త జి. పార్థసారథి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సమర్థించారు. ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ ఆలోచనాధోరణిలో మార్పు ఉండబోదన్నారు. భారత్‌లోనూ మరో 10 నెలల్లో ఎన్నికలున్నందున మోదీ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌తో దోస్తీకి పాకులాడే ప్రయత్నం చేయకపోవచ్చని మరో మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ నాయకత్వంలో భారత్–పాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పరోక్షయుద్ధాన్ని కొనసాగిస్తుందన్నారు. -
త్వరలో మాజీ సైనికుల కల సాకారం
అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలోని మాజీ సైనికుల ఇంటిపట్టాల కల త్వరలో సాకారం కానుందని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న తెలిపారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీలోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంటి పట్టాల మంజూరుకు మార్గం సుగమం అవుతోందని చెప్పారు. జిల్లాలో మాజీ సైనికుల భూమి ఆక్రమణకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ సైనికులు శ్రీనివాసులు, అబ్దుల్‌ఖాదర్, ఆంజనేయులు, రమేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఆజాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
దేశ సరిహద్దుల్లో గెలిచా.. సొంతూరులో ఓడిపోయా
ఏలూరు : దేశ సరిహద్దుల్లో విదేశీయులపై యుద్ధం చేసి గెలిచా.. కానీ సొంతూరులో మాత్రం ఓడిపోయానంటున్నారు ఈ మాజీ సైనికుడు సత్తిబులి వెంకటరెడ్డి. సైనికుడిగా 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నానని, 40 ఏళ్ల క్రితం మిలటరీలో రిటైర్ అయిన తర్వాత తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల వద్ద ప్రభుత్వం ఇచ్చిన 4 ఎకరాలను సాగు చేసుకుంటూ అక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నానని చెప్పారు. ఇటీవల జాతీయ విద్యాసంస్థ-నిట్ కట్టడుతున్నారనే పేరుతో తనకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్ధాక్షిణ్యంగా భూమిని లాక్కుని, ఇల్లు కూల్చివేశారని, ఉండటానికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేక్కడి న్యాయమంటూ మంత్రి వద్ద, అధికారుల వద్ద మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ కలెక్టర్ భాస్కర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.