భార్యతో కలసి కలెక్టరేట్ కు వచ్చిన బి. వెంకట్ రెడ్డి
ఏలూరు : దేశ సరిహద్దుల్లో విదేశీయులపై యుద్ధం చేసి గెలిచా.. కానీ సొంతూరులో మాత్రం ఓడిపోయానంటున్నారు ఈ మాజీ సైనికుడు సత్తిబులి వెంకటరెడ్డి. సైనికుడిగా 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నానని, 40 ఏళ్ల క్రితం మిలటరీలో రిటైర్ అయిన తర్వాత తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల వద్ద ప్రభుత్వం ఇచ్చిన 4 ఎకరాలను సాగు చేసుకుంటూ అక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నానని చెప్పారు.
ఇటీవల జాతీయ విద్యాసంస్థ-నిట్ కట్టడుతున్నారనే పేరుతో తనకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్ధాక్షిణ్యంగా భూమిని లాక్కుని, ఇల్లు కూల్చివేశారని, ఉండటానికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేక్కడి న్యాయమంటూ మంత్రి వద్ద, అధికారుల వద్ద మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ కలెక్టర్ భాస్కర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.