ex DGP Dinesh reddy
-
మాజీ డీజీపీ సోదరుని ఇంట్లో నగలు పోలేదట..
బంజారాహిల్స్ (హైదరాబాద్): మాజీ డీజీపీ దినేష్రెడ్డి సోదరుని కుమార్తె నివాసంలో అదృశ్యమైన విలువైన వజ్రాభరణాలు... భద్రంగా ఉన్నట్టు తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల అమెరికాకు వెళ్లే సమయంలో దినే ష్రెడ్డి సోదరుని కుమార్తె ఐశ్వర్య బంగారు గాజులు, ఉంగరాలను ఓ చీరలో ఉంచి అలమారాలో పెట్టారు. తాను అమెరికా నుంచి తిరిగి వచ్చాక అవి కనిపించకపోవడంతో చోరీకి గురయ్యాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ చాలా ఉంటుందని కూడా ఆమె పేర్కొనడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో పని చేస్తున్న డ్రై వర్లను, పని మనుషులను, వంట మనుషులను వారం రోజుల పాటు విచారించారు. ఫలితం లేకపోవడంతో ఎవరైనా దొంగల ముఠా ఈ చోరీకి పాల్పడి ఉంటుందని భావిస్తున్న తరుణంలో తమ నగలు దొరికాయంటూ ఐశ్వర్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరలో నగలు భద్రంగా ఉన్నాయని తెలియజేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
'వైఎస్ జగన్పై కావాలనే తప్పుడు కేసులు'
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని రాష్ట్ర మాజీ డీజీపీ దినేష్ రెడ్డి చెప్పారు. ఆరోపణలు రుజువు కాకుండానే ఆయనపై అభియోగాలు మోపడం సరికాదని ఆయన అన్నారు. దినేష్ రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన లోటస్ పాండ్లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా దినేష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని దినేష్ రెడ్డి తెలిపారు. దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను తాను దగ్గర నుంచి చూశానని అన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ సీపీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్ కు మాత్రమే సాధ్యమని దినేష్రెడ్డి చెప్పారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని దినేష్రెడ్డి చెప్పారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన దినేష్ రెడ్డి