exceed
-
నిర్ణీత వేగాన్ని అధిగమించిన రెండు రైళ్లు.. లోకోపైలట్లు సస్పెండ్!
భారతీయ రైళ్లు దేశంలోని లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఒక్కోసారి రైళ్లు నడిపే పైలట్ల పొరపాటు కారణంగా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. తాజాగా అటువంటి ఉదంతం యూపీలో చోటు చేసుకుంది. నిర్ణీత వేగ పరిమితి కంటే అధిక వేగంతో రైళ్లను నడిపిన ఇద్దరు లోకో పైలట్లు (డ్రైవర్), రైలు సహాయకులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు, వారి సహాయకులపై రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్త చర్యగా గంటకు 20 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించిన సెక్షన్లో 120 కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతున్నందుకు వారిని సస్పెండ్ చేశారు. రైలు బ్రిడ్జి పునరుద్ధరణ పనుల కారణంగా తాత్కాలిక వేగ పరిమితి అమలులో ఉన్న ఆగ్రా కాంట్‌కు సమీపంలోని జాజౌ- మణియన్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు సిబ్బంది వేగంగా రైలును పోనిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది. ఆగ్రా డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ ఈ సంఘటనను ధృవీకరిస్తూ సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటి సంఘటనలో రైలు ఆగ్రా కాంట్ నుంచి గ్వాలియర్‌కు బయలుదేరిన తర్వాత గతిమాన్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ వేగ పరిమితిని ఉల్లంఘించారు. మరో ఘటనలో కత్రా (జమ్మూ)- ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య నడిచే మాల్వా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ కూడా నిబంధనలను ఉల్లంఘించారు. ఈ సెక్షన్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైలు నడపడానికి అనుమతి ఉంది. అయితే ఇటీవల నది వంతెన మరమ్మతు పనుల కారణంగా గంటకు 20 కిలోమీటర్ల పరిమితిని నిర్ణయించారు.ఈ విషయమై ఆపరేషన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ వారు చెప్పిన సెక్షన్లో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించడం మరచిపోయి ఉండవచ్చు. అయినా ఇది రైలు ప్రయాణికులకు ముప్పు వాటిల్లే చర్య. అందుకే రైల్వే శాఖ దీనిని సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సాధారణంగా ట్రాక్ పరిస్థితి, ట్రాక్ మరమ్మతు పనులు, పాత రైల్వే వంతెనలు, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం తదితర సందర్భాల్లో రైల్వేశాఖ ఆ రూట్లో వైళ్లే రైళ్లకు వేగ పరిమితులను విధిస్తుంది. -
అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18 శాతం పెరిగి, రూ.16.61 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) 2021–22లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.12 లక్షల కోట్లు. రిఫండ్స్‌ను సర్దుబాటు చేయకుండా స్థూలంగా చూస్తే, పన్ను వసూళ్లు రూ.19.68 లక్షల కోట్లని ఆర్థికశాఖ వివరించింది. వీటిలో నుంచి మార్చి 31 వరకూ రూ.3.07 లక్షల కోట్ల రిఫండ్స్ జరిగాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) -
చైనా నుంచి తప్పుకున్నా నష్టాలే...
దేశ, విదేశాల్లో పాపులర్ అయిన క్యాబ్ సేవల నిర్వహణ సంస్థ ఉబర్ సంస్థ మరింత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది. చైనా నుంచి వ్యాపారాల్లో వైదొలిగినప్పటికీ, కంపెనీ ఆర్థిక నష్టాలు తగ్గకపోగా, మరింత పెరిగాయి. ఈ ఏడాదిలో మొదటి తొమ్మిది నెలల కాలంలో ఈ కంపెనీ 2.2 బిలియన్ డాలర్లు(రూ.14,926కోట్లకు పైగా) నష్టాలను మూటకట్టుకున్నట్టు కంపెనీకి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. చైనా ఆపరేషన్లు కలపన్నప్పటికీ ఉబర్ టెక్నాలజీస్ మూడో క్వార్టర్లో 800 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోయినట్టు తెలిసింది. కానీ ఇదేసమయంలో రెవెన్యూలు పెంపు కొనసాగిందని వెల్లడైంది. 2016 మొదటి తొమ్మిది నెలల కాలంలో నికర ఆదాయాలు 3.76 బిలియన్ డాలర్ల(రూ.25,517 కోట్లకు పైగా)ను కంపెనీ ఆర్జించగలిగింది. అమెరికాలో ప్రత్యర్థులందరినీ పడేసి విజయ ఢంకా మోగించి... ఆసియాలోకి ప్రవేశించిన ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్‌కు చైనాలో గట్టిదెబ్బే తగిలింది. బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరించినా చైనా మార్కెట్లో పట్టు సంపాదించలేకపోవటంతో ఈ రైడ్ దిగ్గజం ఆగస్టు 1న అక్కడ క్యాబ్ మార్కెట్లో అగ్రగామి సంస్థ దీదీ చుక్సింగ్లో ఉబర్ కంపెనీని విలీనం చేసేసింది. ఒప్పందంలో భాగంగా దీదీ 1 బిలియన్ డాలర్లను ఉబర్‌లో పెట్టుబడులు పెట్టింది. దీంతోనైనా కొంత నష్టాలను తగ్గించుకోవాలని కంపెనీ భావించింది. కానీ కంపెనీ నష్టాలు తగ్గకపోగా, మరింత పెరిగినట్టు తెలుస్తోంది.