exclusion
-
వైఎస్సార్సీపీకి ఓటేశారని సామాజిక బహిష్కరణ!
వినుకొండ (నూజెండ్ల): పోలింగ్ ముగిసినప్పటికీ టీడీపీ నేతల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతున్నది. వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని ఓ ఎస్సీ కాలనీ వాసులను సామాజిక బహిష్కరణ చేయడమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గురప్పనాయుడిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని గ్రామంలో మంచినీటి ప్లాంట్ వద్దకు రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు వినుకొండ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడును గురువారం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన మాశిపోగు వసంతరావు, దూపాటి లింగయ్య, పాలెపోగు యోబు, మాణిక్యరావుతోపాటు పలువురు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామంలోని వాటర్ ప్లాంట్ వద్ద తాగునీరు పట్టుకోవడానికి వీలులేదని, పొలం పనులకు పిలవబోమని, కౌలుకు భూములు ఇవ్వబోమని, కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై ఎస్సీ కమిషన్ తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సామాజిక బహిష్కరణ చేయడం దారుణం : ఎమ్మెల్యే బొల్లా గురప్పనాయుడు పాలెం ఎస్సీ కాలనీ వాసులకు తాగునీరు ఇవ్వకుండా, పనులకు పిలవకుండా బహిష్కరించడం దారుణమని ఎమ్మెల్యే బొల్లా అన్నారు. కాలనీ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. గ్రామంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుపై దాడి ఘటనతో.. అటవీశాఖ సిబ్బంది డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో రేపటి నుంచి(గురువారం) నుంచి విధుల బహిష్కరణకు ఫారెస్ట్ సిబ్బంది పిలుపు ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినట్లే ప్రభుత్వం తమకూ ఆయుధాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరు అవుతామని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు వాళ్లు. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రకటన ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఖమ్మం ఈర్లపుడిలో గుత్తికోయల దాడిలో మరణించిన శ్రీనివాసరావుకు అంత్యక్రియలు ఇవాళ(బుధవారం) ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. ఫారెస్ట్ సిబ్బంది తమ నిరసన తెలియజేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు, శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడి అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు ఆయన తమ వద్ద ప్రస్తావించిన అంశాన్ని సైతం వాళ్లు లేవనెత్తారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడుల అంశాన్ని చాలాకాలంగా ప్రభుత్వాల ముందు ఉంచుతున్నామని, ఈ పర్వంలో శ్రీనివాసరావు మృతి ఆఖరిది కావాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. ఈ క్రమంలో దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. -
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూడో విడత లాక్డౌన్లో మినహాయింపులపై కేంద్రం మరింత స్పష్టతనిచ్చింది. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. ఈ మినహాయింపు ఈ నెల 4వ తేదీ నుంచి వర్తించనుంది. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు) మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్‌లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. దీంతోపాటు గ్రీన్, ఆరెంజ్ జోన్లున్న ప్రాంతాల్లో సెలూన్లు తెరవొచ్చనీ, అత్యవసరం కాని వస్తువులను కూడా ఈ–కామర్స్ సంస్థలు బట్వాడా చేయవచ్చని వివరించింది. అయితే, రెడ్ జోన్లలో అత్యవసర వస్తువులను మాత్రమే సరఫరా చేసేందుకు ఈ–కామర్స్ సంస్థలకు అనుమతి ఉంటుంది. రెడ్జోన్లలో నివాసితులు తమ పని మనుషుల విషయంలో ఆ ప్రాంత సంక్షేమ సంఘాల అనుమతి ప్రకారం నడుచుకోవాలని, వారికేమైనా జరిగితే యజమానులదే బాధ్యత. 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన హోం శాఖ కొన్ని ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది) కరోనా సాధికారత బృందాల పునర్వ్యవస్థీకరణ కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన 11 ఉన్నతస్థాయి అధికారిక బృందాలను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఈ బృందాల్లోని కొందరు అధికారులు రిటైర్ కావడమో లేక బదిలీ కావడమో జరిగినందున ఈ మార్పు చేపట్టినట్లు తెలిపింది. ఈ బృందాల విధులు, పరిధులు యథా ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) -
వెలివేతతో ఇస్లామిక్ తీవ్రవాదానికి ఊతం
లండన్: ఇస్లామిక్ తీవ్రవాదం పేట్రేగిపోవడానికి సామాజిక బహిష్కరణ లేదా వెలివేత కూడా ఓ కీలక కారణమని తాజా అధ్యయనంలో తేలింది. మెడికల్ సైన్స్, న్యూరోఇమేజింగ్ పద్ధతుల ద్వారా తీవ్రవాదానికి ఆకర్షితులైన వ్యక్తులను విశ్లేషించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న నఫీస్ హమీద్ మాట్లాడుతూ..‘ సామాజిక బహిష్కరణకు గురైనప్పుడు తీవ్రవాదంవైపు మొగ్గుచూపే ఆలోచనలు పెరుగుతున్నాయని గుర్తించాం. 2017లో స్పెయిన్‌లోని లాస్ రమ్బ్లాస్ జిల్లాలో జరిగిన ఇస్లామిక్ స్టేట్ దాడిలో 13 మంది చనిపోగా దాదాపు 100 మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో 535 మంది ముస్లిం వ్యక్తులను పరిశోధనకు ఎంపిక చేసుకున్నాం. ముగ్గురు సభ్యులు ఆడే వర్చువల్ గేమ్ ‘సైబర్ బాల్’లో వీరిని భాగస్వాములు చేశాం. ఆ ఆటలో ఇద్దరు స్పెయిన్ పౌరుల ముఖకవళికలతో ఉన్న ఆటగాళ్లు వీరిని నిర్లక్ష్యం చేసేలా చేసి వారి మెదళ్లను స్కాన్ చేయడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించాం. ఇందులో పాల్గొన్న వ్యక్తులు పాఠశాలల్లో ఇస్లామిక్ బోధన, మసీదులు కట్టడం వంటి విషయాలు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో 38 మంది మొరాక్ సంతతి వ్యక్తులు హింసను ప్రేరేపించేందుకు అంగీకరించారు’ అని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికులు రోడ్డుపాలు
అన్‌సీజన్ పేరుతో 59 మంది తొలగింపు యాజమాన్యతీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం అనంతపురం న్యూసిటీ: అన్‌సీజన్ పేరుతో ఆర్టీసీ యాజమాన్యం రీజియన్ వ్యాప్తంగా 59 మంది కార్మికులను రోడ్డుపాలు చేసింది. శనివారం నుంచి విధులకు హాజరుకావాల్సిన పనిలేదని తేల్చి చెప్పింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా విధుల నుంచి తొలగిస్తే తమ బాధ ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజియన్‌లోని రెగ్యులర్‌గా తిరిగే 42 బస్సులను రద్దు చేసిన కారణంగా కార్మికులు వీధిన పడాల్సి వచ్చిందని కార్మిక సంఘాలంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రీజియన్‌లో 109 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత 106 మంది విధుల్లో చేరారు. సమ్మె కాలంలోనూ విధులకు హాజరయ్యారని 28 మందిని ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇక మిగితా వారిని కాంట్రాక్టు పద్ధతినే కొనసాగించింది. 42 సర్వీసుల రద్దు... రద్దీగా ఉండే బెంగళూరు, బళ్లారి, హిందూపురం, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గంలాంటి ప్రాంతాలకు సంబంధించి 42 బస్సు సర్వీసులను అధికారులు ఆపేశారు. ఈ కారణం చూపి యాజమాన్యం కాంట్రాక్టు సిబ్బందిని పక్కన పెట్టింది. అసలే ప్రైవేట్ వాహనాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉన్న బస్సులను తొలగించి ప్రైవేట్ రవాణాకు ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మెలో పని చేసినా తొలగించారు : మల్లికార్జున డ్రైవర్, అనంతపురం సమ్మె కాలంలో పనిచేసిన తనను రెగ్యులర్ చేయలేదు. ఇప్పుడేమో విధులకు రావద్దని చెబుతున్నారు. 240 రోజులు విధుల్లో పని చేస్తే రెగ్యులర్ చేయాలి. ఆ నిబంధనను పాటించలేదు. మా పరిస్థితేమిటి? ప్రభుత్వం ఆదుకోవాలి. సరైన పద్ధతి కాదు : కొండయ్య, ఈయూ నాయకుడు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అన్‌సీజన్ పేరుతో కార్మికులను తొలగించడం సరైన పద్ధతి కాదు. ఒక్కసారిగా 59 మందిని తొలగిస్తే వారెక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలి. కార్మికులతో ఆడుకోవద్దు.. : సుందర్రాజు, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ప్రభుత్వం, యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు ఉద్యోగభద్రత లేకుండా పోయింది. కార్మికులతో ఆడుకోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. -
రజకుల బహిష్కరణపై సీఐ విచారణ
బహిష్కరణ బాధ్యులపై బైండోవర్ కేసు నమోదు నేలకొండపల్లి:మండలంలోని ఆరెగూడెంలో రజకుల బహిష్కరణపై కూసుమంచి సీఐ ఎం.కిరణ్‌కుమార్ గురువారం రాత్రి విచారణ ప్రారంభించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు ఇరు వర్గాలను, మండల స్థాయి అధికారులు, రజక సంఘం నాయకుల సమక్షంలో పిలిపించి విచారణ చేపట్టారు. ముత్యాలమ్మ పండగ రోజు జరిగిన వివాదంపై ఇరు వర్గాలను అడిగి వివరాలను తెలుసుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఎవరి వాదనలు వారు వినిపించారు. బహిష్కరణ గురించి టమకా వేయించిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాల వాదన విన్న తరువాత శుక్రవారం గ్రామంలో రజకులను బహిష్కరించలేదని, రజకులు వారి పనులు చేసుకునేందుకు అందరి ఇళ్లలోకి రావచ్చని టమకా వేయించాలని సీఐ గ్రామ పెద్దలకు సూచించారు. అదేవిధంగా రజకులను బహిష్కరించిన వారిపై నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో బైండోవర్ కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో నేలకొండపల్లి ఎస్సై పి.దేవేందర్‌రావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొత్తకుండ్ల శ్రీలక్ష్మి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.ఆశయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దోనపల్లి వెంకన్న, తెలంగాణ రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, ఎంఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంమూర్తి, గురుమూర్తి, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భద్రునాయక్, ఆర్ఐ వసంత, సర్పంచ్ కొమ్మినేని కృష్ణయ్య, గ్రామ రెవెన్యూ అధికారి చైతన్యభారతి, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
బహిష్కరణపై భగ్గు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరెగూడెం బాధిత రజకులు అండగా నిలిచిన ప్రజా సంఘాల నాయకులు నేలకొండపల్లి: మండలంలోని ఆరెగూడెంలో రజక కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయాలని గ్రామపెద్దలు కొందరు టముకు వేయించడం, పనులకు పిలవకుండా దూరంగా ఉంచడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నెల 27వ తేదీన గ్రామస్తులు సమావేశమై 28వ తేదీ జరుపుకునే ముత్యాలమ్మ పండుగ వేడుకలో సల్లకుండ పట్టుకొని రజకులు ఇంటింటికీ తిరగాలని గ్రామపెద్దలు ఆదేశించగా..ఉన్న పది కుటుంబాల్లో వృద్ధులు తిరగలేరని, చదువుకున్న యువకులు ఆ పని చేసేందుకు నిరాకరిస్తున్నారని సదరు రజకులు చెప్పడంతో..కొందరు గ్రామ పెద్దలు ఆగ్రహించారు. రజకులందరినీ సాంఘిక బహిష్కరణ చేస్తున్నామని, వీరితో పని చేయించుకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని 27వ తేదీన టముకు వేయించడంపై సోమవారం మీడియాలో కథనాలు రావడంతో..ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో కూడా ఇలా అవమానించడం, ఆత్మగౌరవం దెబ్బతీయడం తగదని, సదరు గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పండగపూట ఊరి రజకులంతా..ఏడుస్తూ, బహిష్కరణ అవమానంతో బాధ పడుతూ గడిపారని..ఈ దుశ్చర్య బాధాకరమని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. ఫిర్యాదు..విచారణ ఆరెగూడెంలో పది కుటుంబాల రజకులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..పలు సంఘాల నాయకులు నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పి.దేవేందర్‌రావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కె.వెంకటేశ్వరరావుకు విన్నవించారు. ఎస్సై గ్రామంలో విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు బాసట పలు ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఆరెగూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత రజకులను కలిసి మాట్లాడారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, గౌరవ అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మాయ్య, బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీలక్ష్మి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నందిపాటి మనోహార్, ఎమ్మార్పీఎస్ నేత వంగూరి ఆనందరావు, పీవైఎల్ రాష్ట్ర నాయకులు సీౖÐð .పుల్లయ్య, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకన్న, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు భద్రునాయక్, ఇప్టూ నేత పగిడికత్తుల రామదాసు తదితరులు బాధితులను కలిసిన వారిలో ఉన్నారు. చర్యలు తీసుకోవాల్సిందే.. రజకులను బహిష్కరించడం బాధాకరం. ఆరెగూడెం సంఘటనలు పునరావృతం కావొద్దంటే బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. –పాగర్తి సుధాకర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు. పనికి రావొద్దంటున్నారు.. ఊరిలో గతంలో మాదిరి బట్టలు ఉతికేందుకు వెళితే గ్రామ పెద్దలు రావద్దంటున్నారు. టముకు వేయించి..అవమానించిండ్రు. బాధగా ఉంది. –ఎలిమినేటి వీరమ్మ.ఆరెగూడెం. అవమానంపై ఆగ్రహం.. సత్తుపల్లి రూరల్: ఆరెగూడెంలో పది రజక కుటుంబాలను గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో రజకసంఘం నాయకులు మోటార్‌సైకిల్ ర్యాలీ తీసి, రింగ్సెంటర్లో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి..నినాదాలు చేశారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్‌కు, తహసీల్దార్ దొడ్డా పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి తెలగారపు అప్పారావు కోరారు. కార్యక్రమాలలో చింతల సత్యనారాయణ, ఈలప్రోలు రామ్మూర్తి, కోటా సత్యనారాయణ, టోపీ శ్రీను, బి.శ్రీనివాసరావు, మరికంటి సత్యనారాయణ, రాయల కోటేశ్వరరావు, కానూరి శ్రీనివాసరావు, పగిళ్ల చెన్నయ్య పాల్గొన్నారు.