హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లు కోత!
న్యూఢిల్లీ : హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొ(హెచ్డీఎఫ్సీ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన ప్రస్తుత కస్టమర్లు తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షల వరకు రుణం తీసుకున్న మహిళా రుణగ్రహీతలు ఇక నుంచి తమ గృహ రుణాలపై 8.65 శాతం వడ్డీరేటు చెల్లిస్తే సరిపోతుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది.
ఇతర రుణగ్రహీతలు 8.70 శాతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్డీఎఫ్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోజనం తమ ప్రస్తుత ఖాతాదారులందరికీ కల్పించనున్నట్టు హెచ్డీఎఫ్ వెల్లడించింది. ఈ నెల మొదట్లో కొత్త కస్టమర్లకు రుణ రేటును 45 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు నాన్-రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఐఆర్లు)/ భారతీయ సంతతికి చెందిన కార్డు హోల్డర్స్కు(పీఐఓ) వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ ప్రకటనలో తెలిపింది.
రుణ మొత్తం మహిళలు ఇతరులు
రూ.75 లక్షల వరకు 8.65 శాతం(ఏడాదికి) 8.70 శాతం(ఏడాదికి)
రూ.75 లక్షలకు పైగా 8.70 శాతం(ఏడాదికి) 8.75 శాతం(ఏడాదికి)