exmas
-
పెళ్లికి ముందురోజు పరీక్షకు హాజరు
పెద్దపల్లి: పెళ్లికి ఒక్క రోజు ముందు బయటకు వెళ్లడం కష్టమైనప్పటికీ చదువుకోవాలన్న పట్టుదల ఆ అమ్మాయిని పరీక్ష హాల్‌కు నడిపించింది. పెళ్లి కొడుకు సహకారం అందించాడు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతవాడకు చెందిన ఈర్నాల పద్మావతి కోరుట్లలో బీఎస్పీ (బీజడ్సీ) సెకండియర్ చదువుతోంది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగనుంది. మూడు రోజుల ముందుగానే పెళ్లి కూతుర్ని చేయడం వంటి కా ర్యక్రమాలు నిర్వహించారు. గురువారం పరీ క్షకు హాజరైంది. శుక్రవారం కూడా మరో పరీక్ష ఉందని, పెళ్లి కార్యక్రమం ముగియగానే భర్తతో వెళ్లి పరీక్ష రాస్తానని పద్మావతి తెలిపింది. -
తెలంగాణ ఆర్టీసీ ఆశలు ఆవిరి.. పెంచుకుందామంటే పడిపోయింది
ఆక్యుపెన్సీ రేటును భారీగా పెంచుకుని పెద్ద మొత్తంలో అదనపు ఆదాయం ఆర్జించాలన్న ఆర్టీసీ యత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది. అదనపు ఆదాయం దేవుడెరుగు సగటున రోజుకు రావాల్సిన ఆదాయానికే గండి పడుతోంది. గతేడాది ఆర్టీసీ నిర్వహించిన 100 రోజుల ప్రణాళిక సూపర్ సక్సెస్ కావడంతో రూ.178 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి అదనపు బస్సులతో అదే తరహాలో రూ. 200 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా 100 రోజుల ప్రణాళిక ప్రారంభించినా.. ఈసారి మాత్రం సగటున రోజుకి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. గతేడాది ఇదే ఎండా కాలంలో చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాన్నిస్తే, ఈసారి అదే వేసవి చుక్కలు చూపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. గత నెల సగటున రోజుకి రూ.14 కోట్లకుపైగా ఆదాయం నమోదవుతూ రాగా, ఏప్రిల్ ఒకటి నుంచి అది రూ.11.5 కోట్లకు పడిపోయింది. మార్చి చివరి వరకు ఆక్యుపెన్సీ రేషియో సగటున 68 శాతం వరకు ఉంటే అది ఇప్పుడు 58 శాతం వద్ద దోబూచులాడుతోంది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిలో పడుతున్న తరుణంలో, ఈ వేసవిలో వంద రోజుల ప్రణాళిక పేరుతో.. స్పేర్‌లో ఉన్నవి సహా అన్ని బస్సులనూ రోడ్డెక్కించి అదనపు కిలోమీటర్లు తిప్పటం ద్వారా మరింత ఆదాయం పొందేందుకు చేసిన ప్రయత్నం ఈ నెలలో విఫలమైందనే చెప్పాలి. కనీసం రోజువారీ రూ.16 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.12 కోట్లు పొందటం కూడా గగనమైంది. దీంతో ఈ నెలలో నష్టాలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాభాల నుంచి నష్టాల బాటలోకి ఇటీవలి కాలంలో వంద రోజుల ప్రణాళిక, ప్రాఫిట్ ఛాలెంజ్ లాంటి కార్యక్రమాలతో చాలా డిపోలు లాభాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 35 డిపోలు లాభాలు తెస్తుండగా, మరో 20 డిపోలు అతి తక్కువ నష్టాల జాబితాలో ఉన్నాయి. అలాంటిది ప్రస్తుతం రోజుకు రెండుమూడు డిపోలు మాత్రమే లాభాల్లో ఉంటున్నాయి. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీని పరిశీలిస్తే.. 94 డిపోలు నష్టాలను చవిచూశాయి. హైదరాబాద్–1 డిపో రూ.2.27 లక్షలు, పికెట్ డిపో 80 వేల లాభాన్ని తెచ్చి పెట్టగా నార్కెట్‌పల్లి డిపో నోప్రాఫిట్/నో లాస్‌గా నిలిచింది(ఏప్రిల్ నెలకు సంబంధించి మిగతా రోజుల్లో నష్టాల్లో ఉంది). మిగతా డిపోలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. గతేడాది చివరలో డీజిల్ సెస్‌ను ఆర్టీసీ భారీగా పెంచటం ద్వారా టికెట్ చార్జీలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో భారీ ఆదాయం నమోదవుతోంది. గతేడాది వేసవిలో ఆ చార్జీలు తక్కువే ఉన్నాయి. అయినా గత ఏప్రిల్‌లో ప్రస్తుతం నమోదవుతున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం రావటం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో అప్పుడే మెరుగ్గా నమోదైంది. శూన్య మాసం వల్లనేనా ప్రస్తుతం శుభముహూర్తాలు లేని శూన్యమాసం నడుస్తోంది. దీంతో శుభకార్యాలు లేక ప్రయాణాలు కూడా బాగా తగ్గాయి. సాధారణంగా ఎండ తీవ్రత పెరిగాక ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గుతుంది. కానీ శుభకార్యాలుంటే బస్సులు కిక్కిరిసి ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా నమోదవుతుంది. గతేడాది ఏప్రిల్‌లో ఎండలు ఎక్కువే ఉన్నా, శుభకార్యాల వల్ల ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా నమోదైంది. ఈ నెలాఖరు వరకు శూన్యమాసమే ఉండనున్నందున ఈ నెల అంతా ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. పరీక్షలు కూడా కారణమే విద్యార్థులకు ఇంకా వేసవి సెలవులు ప్రారంభం కాలేదు. పరీక్షలు కొనసాగుతున్నందున ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా తక్కువగా నమోదవుతోంది. ఈనెలాఖరుకుగాని వేసవి సెలవులు ప్రారంభమయ్యే వీలులేనందున అప్పటి వరకు ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలు తక్కువగా ప్రయాణిస్తారు. ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఆర్టీసీపై పడింది. అన్ని బస్సులూ తిప్పడంతో డీజిల్ భారం వంద రోజుల ప్రణాళిక పేరుతో ప్రస్తుతం అన్ని బస్సులనూ తిప్పుతున్నందున డీజిల్ వినియోగం భారీగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్నందున, ఆదాయం కంటే డీజిల్ ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితులుండటంతో బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో సర్వీసుకు–సర్వీసుకు మధ్య విరామం పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
టీఎస్పీఎస్సీ ఇష్టానుసారం పరీక్ష నిర్వహించడం సరికాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎస్పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జూనియర్ లెక్చరర్(జేఎల్) పరీక్ష ప్రశ్నపత్రంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పేపర్-2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగులో కూడా ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ ఇష్టానుసారం పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. -
దరఖాస్తుల వెల్లువ..
జనగామ: ముందస్తు ఎలక్షన్ ఫీవర్.. మరో పక్క పోటీ పరీక్షల హడావుడితో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వీఆర్వో రాత పరీక్షను ప్రశాంతంగా ముగించుకుని ఊపిరి పీల్చుకునేలోపే.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షలు రానే వచ్చాయి. నాలుగేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతీయువకులు ప్రిపరేషన్లో మునిగిపోయారు. కోచింగ్ సెంటర్లు.. యూట్యూబ్.. ఆన్లైన్ ఇలా ప్రతిదీ సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేట్, కాంట్రాక్టు, రెగ్యులర్, తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సెలవులు పెట్టుకుని.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడగా.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇదే నెల 12 వరకు చివరి అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో సర్వర్ డౌన్, సాంకేతిక లోపం కారణంగా ఈ నెల 14 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా ఒక్కసారిగా దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 204 పోస్టులు ఖాళీగా ఉండగా.. 7,938 మంది నుంచి దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ జారీలో ఆగమాగం ఉద్యోగాల నోటిఫికేషన్ జారీలో అధికారుల అనాలోచిత నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. సిలబస్, పరీక్ష నిర్వహణ తేదీలు, ప్రిపరేషన్ సమయం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నోటిఫికేషన్ జారీ చేస్తారు. కానీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీపై అధికారులు సరైన కసరత్తు చేయకుండా హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత నెల రోజులు కూడా ప్రిపరేషన్‌కు సమయం లేకుండా అక్టోబర్ 4న పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ముందుగా నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులు కలవరపడ్డారు. అదే రోజు గురుకుల పీజీటీ పరీక్షతోపాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలు ఉండడంతో 10వ తేదీ తేదీ నిర్వహించేలా మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే విధంగా ఈ పరీక్షకు నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉద్యోగాలకు 200 మార్కులు, రెండు పేపర్ల చొప్పున భారీ సిలబస్ ఇచ్చిన అధికారులు.. నెలరోజులు కూడా సమయం లేకుండా పరీక్ష తేదీ నిర్వహించనుండడంపై మండిపడుతున్నారు. గ్రూప్స్ ఉద్యోగాలకు ఎదురు చూసి.. వాస్తవానికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న గ్రూప్–1, గ్రూప్–2 తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశనే మిగిల్చింది. ముందస్తుగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో కొత్త ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఆశలు వదులుకున్నారు. దీంతో ఈ సమయంలో జారీ అయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలపై నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. అక్టోబర్ 10న పరీక్ష జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్ 10న నిర్వహిస్తున్నాం. 4న ముందుగా అనుకున్న టీఎస్పీఎస్సీ..అభ్యర్థుల అభ్యర్థన మేరకు 10కి మార్చింది. జిల్లాలో 204 పోస్టులకు 7,938 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం 15 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. –వెంకటేశ్వరావు, జిల్లా పంచాయతీ అధికారి, జనగామ -
నిర్లక్ష్యం
► గందరగోళంగా రీవాల్యుయేషన్ ఫలితాలు ఎస్కేయూ: దినేష్ (హాల్‌టికెట్ నెంబర్ 155 85029) బీకాం రెండో సంవత్సరానికి సంబంధించి రెండు సబ్జెక్టులకు రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకొన్నాడు. కానీ ఫైనాన్స్ అకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఫలితాలు ప్రకటించలేదు. రెండు రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలకు దరఖా స్తు చేసుకోవడానికి నోటిఫికేషన్‌ను వి డుదల చేయనున్నారు. ఉత్తీర్ణులయ్యామా?లేదా? అనే అంశంపై స్పష్టత రాకపోవడంతో సప్లిమెంటరీ పరీక్షలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. ఇది అనేక మంది విద్యార్థుల పరిస్థితి. చలనా చూపితేనే రీవాల్యుయేషన్.. ఆశించినంత మార్కులు రాకపోవడం, ఫెయిల్ అయిన వారికి అవకాశం కల్పించడం కోసం రీవాల్యుయేషన్ (పునర్ మూల్యాంకనం) విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఒక్కో విద్యార్థి రెండు, మూడు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకొన్నారు. ఒక సబ్జెక్టుకు మాత్రమే ఫలితాలు ప్రకటించి మిగిలిన సబ్జెక్టుల ఫలితాలను పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు గందరగోళంకు గురవుతున్నారు. ఫీజు కట్టినట్లు బ్యాంకు చలానా చూపితే జవాబు పత్రాలు తీసి రీవాల్యుయేషన్‌కు పంపుతున్నారు. గందరగోళంగా వాల్యుయేషన్.. బీకాం మొదటి, రెండు, మూడో సంవత్సరానికి సంబంధించి 4 వేల మంది విద్యార్థులు తాజాగా చేపట్టిన రీవాల్యుయేషన్లో ఉత్తీర్ణులయ్యారు. వేలాది మంది విద్యార్థులు రీవాల్యుయేషన్లో పాస్ కావడం ఇదే తొలిసారి. అధ్యాపకుల నిర్లక్ష్యంతో మొదటి వాల్యుయేషన్‌లో విద్యార్థులు ఫెయిల్ అయినట్లు స్పష్టమవుతోంది. నిర్లక్ష్యంగా వాల్యుయేషన్ చేశారా? లేక రీవాల్యుయేషన్ తేలికగ్గా చేశారా? అనే అంశంపై స్పష్టత లేదు.