పేలుడు మృతుల పరిహారం రూ.10లక్షలకు పెంపు
ఝబువా: మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు శనివారం ఉదయం పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాదంలో విచారం వ్యక్తం చేశారు.
మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున శనివారం ప్రకటించారు. అనంతరం ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో 90 మంది దుర్మరణం పాలవగా.. మరో 100 మందికి పైగా గాయడ్డారు.