extensive checks
-
మళ్లీ చైన్‌స్నాచర్ల హల్చల్!
నల్లగొండ ఎస్పీ సమాచారంతో మూడు జిల్లాల పోలీసుల అలర్ట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: చైన్‌స్నాచర్ల ముఠా మరోసారి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు సభ్యుల ముఠా మెదక్ జిల్లా మీదుగా నల్లగొండ సరిహద్దుల్లోకి వస్తోందన్న సమాచారం మేరకు నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. గతంలో ఈ ముఠా జిల్లాలో కూడా దొంగతనాలకు పాల్పడడంతో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్, మెదక్ పోలీసులు కూడా అప్రమత్తమై వాహనాల తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమాచారం విషయంలో కొన్ని వదంతులూ ప్రచారంలోనికి వచ్చాయి. కొందరు దొంగలు తుపాకులతో కాల్పులు జరుపుతూ నల్లగొండ, మెదక్ సరిహద్దుల్లో సంచరిస్తుండడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారన్న సమాచారం అటు మెదక్, ఇటు నల్లగొండ ప్రజానీకాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ విషయమై నల్లగొండ ఎస్పీ వీ.కే.దుగ్గల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చైన్‌స్నాచర్లు సంచరిస్తున్నారన్న సమాచారంతోనే తనిఖీలు చేపట్టామని, దీన్ని భూతద్దంలో చూసి ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరమేమీ లేదని చెప్పడం గమనార్హం. -
బాంబు కలకలం
►తిరుమల, తిరుపతిలో విస్తృత తనిఖీలు ►పరుగులు తీసిన పోలీసులు ►భద్రత కట్టుదిట్టం సాక్షి, తిరుమల/తిరుపతి క్రైం: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో బాంబు ఉందనే సమాచారంతో కలకలం రేగింది. దీనికితోడు రాష్ట్ర డీజీపీ కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో, తిరుపతి అలిపిరి వద్ద అన్ని భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. మధ్యాహ్నం నుంచి పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, ఏఆర్ పోలీసులు వారివారి పరిధిలో భద్రతను కట్టుదిట్టంచేశారు. మూడు బృందాలుగా విడిపోయి బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు ఆలయం, రద్దీ ఉండే అన్ని అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లే భక్తులను రెట్టింపు స్థాయిలో తనిఖీ చేసి అనుమతించారు. మరోవైపు సీసీ కెమెరాల్లో నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలించారు. ప్రధానమైన తిరుమల టోల్గేట్, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్, టీటీడీ వసతి గృహాలు, ప్రముఖ దేవాలయాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. టోల్గేట్ వద్ద వచ్చే వాహనాలను, యాత్రికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి తిరుమలకు అనుమతించారు. కార్ల బ్యానెట్ సైతం తెరచి డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు.దీంతో తిరుమలకు ప్రయాణించే భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అన్ని చోట్లా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముక్కంటి చెంత శ్రీకాళహస్తి: తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబులు ఉన్నట్లు పుకార్లు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు ముక్కంటి చెంత పోలీసులు గురువారం రాత్రి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటకిషోర్ నేతృత్వంలో వన్ టౌన్ సీఐ చిన్న గోవింద్, ఎస్ఐ ఏటీ.స్వామి పోలీసులు భక్తులను రాత్రి 7 నుంచి 9-30 గంటల వరకు విస్తృతంగా తనిఖీ చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నామని.... ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డీఎస్పీ వెంకటకిషోర్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారుల అదుపులో అనుమానితులు బాంబు ఉందంటూ పుకార్లు రావడంపై తిరుపతి ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆరాతీశారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
‘తీవ్ర’ తనిఖీలు
= పుత్తూరు ఘటనతో అప్రమత్తమైన పోలీసులు = జిల్లా అంతటా విస్తృత తనిఖీలు = కొత్త వారు వస్తేసమాచారమివ్వాలని విజ్ఞప్తి = ఆందోళనలో ప్రజలు సాక్షి, తిరుపతి/పుత్తూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వారం కిందట తీవ్రవాదులు ప ట్టుబడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వారం కిందట పుత్తూరు పట్టణంలోని గేట్పుత్తూరులో అల్ ఉమా తీవ్రవాదులు బిలాల్, ఇ స్మాయిల్ పట్టుబడిన సంగతి తెలిసిందే. వీరు ఆరు నెలలుగా పుత్తూరులో ఉంటూ తమ కార్యకలాపాలు సాగించారు. ఇంకో విశేషం ఏం టంటే బిలాల్ భార్యాబిడ్డలతో పాటు ఇక్కడ ఉండగా, వీరిని ఇక్కడికి తీసుకొచ్చిన ఫక్రుద్దీన్ ఏడాదిన్నర పాటు పుత్తూరులోనే ఉన్నాడు. వీరంతా పోలీసులకు పట్టుబడడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టుబడిన తీవ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారం భించారు. రెండు రోజుల క్రితం పుంగనూరులోని నక్కబండ ప్రాంతాన్ని తనిఖీ చేసిన వి షయం విదితమే. అక్కడ ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఇద్దరిని అ రెస్టు చేసినట్లు తెలుస్తోంది. చింతపండు మాటున మారణాయుధాలు తీవ్రవాది ఇస్మాయిల్ చింతపండు వ్యాపారం చేస్తూ, అందులో మారణాయుధాలను రవాణా చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి ఆ యుధాలను, పేలుడు పదార్థాలను తీసుకొచ్చి వాటిని చింతపండు బాక్సుల్లో పెట్టి చెన్నైకు రవాణా చేసినట్లు ఇస్మాయిల్ వెల్లడించాడని స మాచారం. ఈ చింతపండును జిల్లాలోని కు ప్పం, మదనపల్లె, పలమనేరు, పీలేరు, పుంగనూరు నుంచి సేకరించామని, దీనికిగాను తమకు ఏజెంట్లు ఉన్నారని ఇస్మాయిల్ విచారణలో తెలి పినట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతాల్లో సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. సరిహద్దులో ఉండడంతోనే పుత్తూరులో.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో ఉండడంతోనే పుత్తూరును తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతానికి అల్ఉమా తీవ్రవాదులకు తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పథకం ప్రకారం తమ టార్గెట్‌లో ఉన్న పలువురు బీజేపీ అగ్రనేతలను మట్టుబెట్టడం, హిందూ దేవాలయాలు, తిరుమల వంటి చోట్ల విధ్వం సం సృష్టించడానికి పుత్తూరును స్థావరం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్టు సమాచారం. దీం తో అప్రమత్తమైన పోలీసులు జిల్లాలో అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆందోళనలో ప్రజలు దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తీవ్రవాదులు తమ టార్గెట్‌గా చేసుకోవడం జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దీనికి తోడు ఆరు నెలలుగా ఇద్దరు తీవ్రవాదులు పుత్తూరులో అద్దె ఇంటిలో ఉండడం జిల్లా వాసులను మరింత కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పుంగనూరులో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్ట డం వీరి ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రస్తుతం ఏ కొత్త ముఖం కనిపించినా జిల్లావాసులు అనుమానించే పరిస్థితి నెలకొంది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పక్కాగా సమాచారం లేదు జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప క్కాగా సమాచారం లేదు. అయి నా నిర్లక్ష్యం చేయడం లేదు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. కొత్తవారు వస్తే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరుతున్నాం. లాడ్జీలలో గదులిస్తే పక్కాగా సమాచారం తీసుకోవాలని ఆదేశించాం. పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశాం. -కాంతిరాణాటాటా, ఎస్పీ మా జాగ్రత్తలో మేమున్నాం తిరుమల, తిరుపతికి ప్రమాదముందని ప్రత్యేకంగా సమాచా రం లేదు. తిరుపతికి రోజూ 50 వేలమంది కి పైగా భక్తులు వ స్తుంటారు. మా జాగ్రత్తలో మేమున్నాం. సిబ్బందిని అప్రమత్తం చేశాం. -రాజశేఖర్ బాబు, ఎస్పీ, తిరుపతి అర్బన్