మళ్లీ చైన్‌స్నాచర్ల హల్‌చల్!
నల్లగొండ ఎస్పీ సమాచారంతో మూడు జిల్లాల పోలీసుల అలర్ట్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: చైన్‌స్నాచర్ల ముఠా మరోసారి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు సభ్యుల ముఠా మెదక్ జిల్లా మీదుగా నల్లగొండ సరిహద్దుల్లోకి వస్తోందన్న సమాచారం మేరకు నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. గతంలో ఈ ముఠా జిల్లాలో కూడా దొంగతనాలకు పాల్పడడంతో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్, మెదక్ పోలీసులు కూడా అప్రమత్తమై వాహనాల తనిఖీలు చేపట్టారు.
విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమాచారం విషయంలో కొన్ని వదంతులూ ప్రచారంలోనికి వచ్చాయి. కొందరు దొంగలు తుపాకులతో కాల్పులు జరుపుతూ నల్లగొండ, మెదక్ సరిహద్దుల్లో సంచరిస్తుండడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారన్న సమాచారం అటు మెదక్, ఇటు నల్లగొండ ప్రజానీకాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ విషయమై నల్లగొండ ఎస్పీ వీ.కే.దుగ్గల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చైన్‌స్నాచర్లు సంచరిస్తున్నారన్న సమాచారంతోనే తనిఖీలు చేపట్టామని, దీన్ని భూతద్దంలో చూసి ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరమేమీ లేదని చెప్పడం గమనార్హం.