fake encounter case
-
18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై : 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఫేక్ ఎన్కౌంటర్ కేసులో తాజాగా ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నవంబర్ 11, 2006 ఢిల్లీలో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తాది ఫేక్ ఎన్‌కౌంటరేనని నిర్ధారించింది. ఈ కేసులో మాజీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ గౌరీ గాడ్సేలతో కూడిన ముంబై హైకోర్టు ధర్మాసనం దోషిగా తేల్చుతూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2013లో ప్రదీప్ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘శర్మ ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు లభ్యమైన సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. సాధారణ సాక్ష్యాధారాలు సైతం ఈ ఫేక్ ఎన్కౌంటర్లో అతని ప్రమేయం ఎలాంటిదో నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి’ అని కోర్టు పేర్కొంది. అనంతరం, మూడు వారాల్లో సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం శర్మను ఆదేశించింది. దీంతో పాటు పోలీసులతో సహా 13 మందికి ట్రయల్ కోర్టు విధించిన నేరారోపణ, జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో ఆరుగురు నిందితుల నేరారోపణ, జీవిత ఖైదును రద్దు చేసి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. నవంబర్ 11,2006 ఢిల్లీ ఫేక్ ఎన్ కౌంటర్ కేసు నవంబర్ 11, 2006న మహరాష్ట్ర వాశి నగర పోలీస్ టీం సభ్యులు గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారనే అనుమానంతో నారాయణ్ గుప్తా అలియాస్ లఖన్ భయ్యా అతని స్నేహితులు అనిబేదాను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం ముంబై అంధేరి నానా నాని పార్క్‌లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ టీం నారాయణ్ గుప్తాను ఎన్కౌంటర్ చేసింది. తన అన్న నారాయణ్ గుప్తాది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ నవంబర్ 15,2006న బాధితుడి తమ్ముడు రామ్ ప్రసాద్ గుప్తా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శర్మ నిర్ధోషి అప్పటి నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసులో జులై 2013లో సెషన్స్ కోర్టు ఫేక్ ఎన్ కౌంటర్లో 13 మంది పోలీసులతో సహా 22 మందిపై అభియోగాలు మోపింది. సాక్ష్యాలు లేని కారణంగా శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ 21 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 21 మంది నిందితుల్లో ఇద్దరు కస్టడీలోనే చనిపోయారు. మా అన్నది ఫేక్ ఎన్‌కౌంటరే అయితే ఎన్కౌంటర్లో దోషులుగా నిర్ధారించడంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు నారాయణ్ గుప్తా తమ్ముడు రామ్ ప్రసాద్ పెట్టిన కేసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ దోషులే కోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో కేసు మలుపు తిరిగింది. కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌కు తాజాగా, సుధీర్ఘంగా కొనసాగిన ఈ దర్యాప్తులో పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు ముంబై హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ చవాన్ వాదిస్తూ .. ప్రస్తుత ఈ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌కు పాల్పడ్డారని వాదించారు. 3 వారాల గడువుతో ఈ కేసులో శర్మను దోషిగా నిర్ధారించాలని కోరుతూ ప్రాసిక్యూషన్, అపహరణ, హత్యల మొత్తం ఆపరేషన్‌కు మాజీ పోలీసు ఎన్కౌంటర్ స్పషలిస్ట్ ప్రదీప్ శర్మే అసలు సూత్రదారి అంటూ కేసును తీర్పిచ్చింది. శర్మ లొంగిపోయేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. -
సీబీఐ అప్పుడు నాపై ఒత్తిడి చేసింది: అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తప్పుదోవలో తమలో కొందరిపై ప్రయోగిస్తోందంటూ విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై గుప్పిస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. సీబీఐ తనపైనా ఓ కేసు దర్యాప్తు విషయమై ఒత్తిళ్లు చేసిందని, నరేంద్ర మోదీని అందులో ఇరికించే యత్నమూ చేసిందని ఆరోపించారాయన. బుధవారం ఓ మీడియా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కూడా సీబీఐ నా మీద కూడా ఒత్తిళ్లకు పాల్పడింది. గుజరాత్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ప్రధాని మోదీని ఇరికించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఆయన(మోదీ) గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో నన్ను ప్రశ్నించిన సీబీఐ.. మోదీ పేరును ప్రస్తావించాలని సీబీఐ నాపై(షా తనను తాను ఉద్దేశించుకుని) ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అని పేర్కొన్నారాయన. కానీ, ఆ సమయంలో దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు నేను తలొగ్గలేదు. అలాగని సీబీఐ తీరును బీజేపీ బహిరంగంగా ఎండగట్టలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతికి మద్దతుగా రాద్ధాంతం చేస్తోందని, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారాయన. ఇక రాహుల్ గాంధీ అనర్హత పరిణామంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆయన కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తన తలరాతకు ప్రధాని మోదీనే కారణమంటూ రాజకీయ రచ్చ చేస్తున్నాడు.. కన్నీళ్లు కారుస్తున్నాడు అంటూ షా తప్పుబట్టారు. ఇంకా పలు అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదీ చదవండి: ఆ పథకానికి పీఎం మోదీ కన్వీనర్.. కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా -
నిందితులంతా నిర్దోషులే
ముంబై: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిల మృతిలో కుట్ర కోణం, ఆ ముగ్గురి మృతితో నిందితులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందంటూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఎస్జే శర్మ తీర్పుచెప్పారు. ‘22 మంది నిందితులపై కుట్ర ఆరోపణలను సమర్ధనగా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. దీంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం’ అని తీర్పుచెప్పారు. సొహ్రాబుద్దీన్ షేక్‌కు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడనేది పోలీసుల ఆరోపణ. అప్పటి డీజీపీ వంజారా ఆదేశాల మేరకే మరో అధికారి పీసీ పాండే ఎన్కౌంటర్లో ప్రజాపతిని చంపారని సీబీఐ ఆరోపించింది. అయితే, ఇందుకు ఫోన్‌కాల్స్ వంటి ఎలాంటి ఆధారాలను చూపకపోవడంతో న్యాయస్థానం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు తీర్పుపై సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ స్పందించారు. ఈ తీర్పు విచారకరమనీ, దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతితో కలిసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి బస్సులో వస్తుండగా 2005 నవంబర్ 22వ తేదీ రాత్రి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే ఏడాది నవంబర్ 26వ తేదీన సొహ్రాబుద్దీన్, మరో మూడు రోజుల తర్వాత కౌసర్ బీ హత్యకు గురయ్యారు. వీరిని గుజరాత్, రాజస్తాన్ పోలీసు బృందమే హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంచిన పోలీసులు 2006 డిసెంబర్ 27వ తేదీన గుజరాత్–రాజస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులోని 22 మంది నిందితుల్లో 21 మంది గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన దిగువ స్థాయి పోలీసు అధికారులు కాగా 22వ వ్యక్తి గుజరాత్లో సొహ్రాబుద్దీన్ దంపతులు హత్యకు ముందు బస చేసిన ఫాంహౌస్ యజమాని. గుజరాత్ సీఐడీ నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీబీఐ.. అప్పటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అప్పటి రాజస్తాన్ హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఐపీసీ అధికారులు వంజారా, పీసీ పాండే సహా 38మందిపై ఆరోపణలు మోపింది. మొత్తం 210 మంది సాక్షులను విచారించగా అందులో 92 మంది వ్యతిరేకంగా మాట్లాడారు. విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు ఈ కేసును గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయాలన్న సీబీఐ పిటిషన్‌కు అనుకూలంగా 2013లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మూడేళ్ల క్రితం మృతి చెందడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కేసు విచారణ సాగిందిలా.. నవంబర్ 22, 2005: గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసి ప్రజాపతి హైదరాబాద్ నుంచి సాంగ్లికి బస్సులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. షేక్ దంపతులను ఒక వాహనంలో, ప్రజాపతిని మరో వాహనంలో తీసుకెళ్లారు. నవంబర్ 22 నుంచి 25 2005: అహ్మదాబాద్ సమీపంలోని ఒక ఫాం హౌస్‌లో సొహ్రాబుద్దీన్, కౌసర్ బీలను ఉంచారు. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు నవంబర్ 26, 2005: గుజరాత్, రాజస్థాన్ పోలీసులు కలిసి జరిపిన ఎన్కౌంటర్లో సొహ్రాబుద్దీన్ మరణించాడు. అది నకిలీ ఎన్కౌంటర్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి నవంబర్ 29, 2005: కౌసర్ శరీరమంతా కాలిన గాయాలతో శవమై కనిపించింది. డిసెంబర్ 27, 2006: రాజస్థాన్, గుజరాత్ పోలీసు బృందం ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ప్రజాపతిని తీసుకువెళుతూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని సర్హాద్ చప్రిలో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారు. మే 22, 2006: ఈ ఎన్కౌంటర్ కేసును విచారించాలని, కౌసర్ ఆచూకీ తెలపాలంటూ సొహ్రాబుద్దీన్ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా గుజరాత్ రాష్ట్ర సీఐడీని ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి 2010: సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. జులై 23, 2010: అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా, అప్పటి రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఇతర ఐపీఎస్ అధికారులతో పాటు 38 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. జులై 25: అమిత్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. డిసెంబర్ 30, 2014: ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అమిత్‌ను కేసు నుంచి విముక్తుడ్ని చేసింది. ఇతర ఐపీఎస్ అధికారులు బయటపడ్డారు. నవంబర్ 2017: సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్జే శర్మ కేసు విచారణను ప్రారంభించారు డిసెంబర్ 21, 2018: సరైన సాక్ష్యాలు లేవంటూ 22 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు నిర్దోషులుగా బయటపడిన పోలీసులు -
అమిత్ షాకు క్లీన్చిట్ సబబే!
ముంబై: సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ కోర్టు 2014లో అమిత్ షాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సీబీఐ సవాలుచేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ బాంబే లాయర్ల బృందం ఈ పిల్ వేసింది. ఫిర్యాదుదారుడు, బాధితుడు కాని వ్యక్తి లేదా సంస్థ ఈ కేసులో జోక్యం చేసుకోవద్దని జస్టిస్ రంజిత్ మోరె, జస్టిస్ భారతి డాంగ్రెల ధర్మాసనం మందలించింది. ఇందులో తలదూర్చే హక్కు పిటిషన్‌దారులకు లేదని తేల్చిచెప్పింది. -
ఆర్మీ మేజర్ జనరల్‌కు జీవితఖైదు
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో 1994లో జరిగిన సంచలన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఓ ఆర్మీ మేజర్ జనరల్, ఇద్దరు కల్నల్లు సహా ఏడుగురికి జీవిత ఖైదు పడింది. డిబ్రూగఢ్ జిల్లాలోని దిన్జన్‌లో సైనిక కోర్టు విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మేజర్ జనరల్ ఏకే లాల్, కల్నల్లు థామస్ మాథ్యూ, ఆర్ఎస్ సిబిరెన్‌లతోపాటు జూనియర్ కమిషన్డ్, నాన్ కమిషన్డ్ అధికారులుగా ఉన్న దిలీప్ సింగ్, జగ్దేవ్ సింగ్, అల్బీందర్ సింగ్, శివేందర్‌సింగ్‌లను ఆర్మీ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. 1994 ఫిబ్రవరి 23న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యు) కార్యకర్తలు ప్రవీణ్ సోనోవాల్, ప్రదీప్ దత్తా, దేవాజిత్ విశ్వాస్, అఖిల్ సోనోవాల్, భాబెన్ మోరన్‌లను దోషులు అపహరించి, నకిలీ ఎన్కౌంటర్ చేసి చంపారు. డంగారి ఫేక్ ఎన్‌కౌంటర్‌గా ఈ కేసు పేరుమోసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నాటి ఏఏఎస్యు అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత జగదీశ్ భుయాన్ ఒక్కరే హైకోర్టులో పోరాడారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజులు సీబీఐ దర్యాప్తు జరిగిన అనంతరం ఈ కేసును తాము మిలిటరీ చట్టం కింద విచారిస్తామంటూ కోర్టు అనుమతిని ఆర్మీ పొందింది. ఇప్పుడు ఏడుగురికి జీవితఖైదు విధించడంపై భుయాన్ స్పందిస్తూ ‘24 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, సైన్యంపై నేను నమ్మకం కోల్పోలేదు. ఆర్మీ తన సొంత సిబ్బందికే గుణపాఠం నేర్పే శిక్ష వేసింది’ అని అన్నారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ తప్పుచేసే సైనికులపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తీర్పును కోల్‌కతాలోని తూర్పు ఆర్మీ కమాండ్, ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ఇందుకు మూడు నెలల సమయం పట్టొచ్చు. దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దోషుల్లో ఒకరైన ఏకే లాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహోద్యోగిని 2007లో ఫిర్యాదు చేయడంతో ఆర్మీ విచారణ అనంతరం 2010లోనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. -
కోర్టే.. పోలీసులను హంతకులు అనొచ్చా?
న్యూఢిల్లీ: మణిపూర్‌లో బూటకపు ఎన్కౌంటర్ల కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను హంతకులుగా అభివర్ణించడాన్ని కేంద్రం తీవ్రంగా ఆక్షేపించింది. ఉన్నత న్యాయస్థానమే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. మణిపూర్, కశ్మీర్‌లలో ప్రాణాలను పణంగా పెట్టి బలగాలు విధులు నిర్వహిస్తున్నాయని వారిపై విచారణకు ఆదేశించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఈ కేసులు నమోదు చేయడం సరికాదని కోర్టును కోరారు. అయితే ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. సీబీఐ డైరెక్టర్‌తో చర్చ సందర్భంగా యథాలాపంగా అన్నట్లు కోర్టు స్పష్టతనిచ్చింది. మణిపూర్‌లో 1,528 మంది అమాయక పౌరులు, ఆందోళనకారులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హతమార్చినట్లు భద్రతా దళాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసి.. చార్జిషీటు నమోదు చేయాలని జూలై 14న సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులతోపాటు 300 మంది ఆర్మీ జవాన్లు సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం అమల్లో ఉండగా ఇలాంటి కేసులు పెట్టడమేంటని తమపై దాఖలైన ఎఫ్ఐఆర్లను సవాల్ చేశారు. -
ఇష్రత్ జహాన్ కేసు.. పిటిషనర్ మృతి
తిరువనంతపురం : ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు పిటిషనర్ గోపినాథ్ పిళ్లై మృతి చెందారు. కేరళలో అలపుజ్జా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో 76 ఏళ్ల పిళ్లై తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. కాగా, గోపినాథ్ పిళ్లై... 2004 గుజరాత్ ఎన్కౌంటర్ మృతుల్లో ఒకరైన జావెద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిళ్లై తండ్రి. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హత్యకు కుట్రపన్నారంటూ ముంబైకి చెందిన19 ఏళ్ల విద్యార్థిని ఇష్రాత్ జహాన్, మరో ముగ్గురిని 2004, జూన్ 15న ఎన్కౌంటర్ చేశారు. మృతులను జావెద్ గులాం షేక్(ప్రణేశ్ పిళ్లై), అంజాద్ అలీ రానా, జీషన్ జోహార్ గా గుర్తించారు. అయితే తన కొడుకు అమాయకుడని.. ఇది పక్కా ఫేక్ ఎన్కౌంటర్ అంటూ వాదిస్తూ గోపినాథ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మిగతా బాధిత కుటుంబాలు కూడా ఆయను తోడయ్యాయి. మోదీ ప్రభుత్వం సానుభూతి పొందటం కోసమే అమాయకులైన వారిని చంపేశారని పిటిషనర్లు అప్పుడు వాదనలు వినిపించారు. (ఇష్రత్‌పై లాలూ కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు) ఇదిలా ఉంటే ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇదో ఫేక్ ఎన్కౌంటర్ అని తేల్చి ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ పోలీసులు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) సంయుక్తంగా ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. పలువురు ఉన్నతాధికారుల పేర్లను ఇందులో చేర్చి దర్యాప్తు కొనసాగించింది. -
బెయిల్‌పై విడుదలైన డీజీ వంజరా
సోహ్రాబుద్దీన్, ఇషత్ ్రఎన్‌కౌంటర్ కేసుల్లో నిందితుడు అహ్మదాబాద్: ఇషత్ ్రజహాన్, సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ల కేసులో ప్రధాన నిందితుడైన వివాదాస్పద మాజీ ఐపీఎస్ అధికారి డీజీ వంజారా బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. 2004లో ఇషత్ ్రజహాన్, 2005లో సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో వంజరాను 2007 ఏప్రిల్‌లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఏడున్నరేళ్లుగా జైల్లోనే ఉన్నారు. బుధవారం బెయిల్ లభించిన అనంతరం సబర్మతీ కేంద్ర కారాగారం నుంచి బయటకు రాగానే.. ‘తనకు, తనలాంటి పోలీసులకు మంచి రోజులు వచ్చాయి (అచ్చే దిన్ ఆయే)’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇంతకాలం జైల్లో ఉండడానికి రాజకీయ కారణాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను చేసిన పనుల గురించి విచారించేదేమీ లేదు. పోలీసులు అనుమానిత ఉగ్రవాదులను ఎన్కౌంటర్లు చేయడం ద్వారా గుజరాత్‌ను మరో కశ్మీర్‌లా మారకుండా చేయగలిగారు.’’అని వంజరా వ్యాఖ్యానించారు. తాను చేసినవన్నీ నిజమైన ఎన్కౌంటర్లేనని.. తమపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని పేర్కొన్నారు. -
'ఎన్కౌంటర్' వంజారాకు భారీ స్వాగతం!
సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నిందితుడు, వివాదాస్పద పోలీసు అధికారుల్లో ఒకరైన మాజీ డీజీ వంజారా బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు వద్ద ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు చేరుకుని వంజారాకు స్వాగతం పలికారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. ఆయనతో కలిసి ఫొటోలు తీయించుకోడానికి ఎగబడ్డారు. దాదాపు ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్న వంజారాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన ఆయన.. ఏదో ఎన్నికల్లో నెగ్గినట్లుగా మెడలో దండలు వేయించుకుని ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపుగా వెళ్లి.. అందులోనే విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు. అయితే.. వంజారా తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోకి మాత్రం ప్రవేశించకూడదని కోర్టు ఉత్తర్వులిచ్చింది. రెండు బూటకపు ఎన్కౌంటర్లలో ఏడుగురిని హతమార్చిన కేసులో మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు సహా.. వంజారా కూడా నిందితుడు. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారంటూ వాళ్లను ఎన్కౌంటర్లో హతమార్చారు. కానీ ఉగ్రవాదుల పేరుతో పౌరులనే చంపేశారని సీబీఐ కేసు పెట్టింది.