To farmers
-
పాలేరు రైతులకు త్వరలో భక్త రామదాసు నీళ్లు
ప్రతి ఇంటా నల్లానీరు...ప్రతి తండాకు తారు రోడ్డు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి: పాలేరు నియోజకవర్గ రైతులకు త్వరలోనే భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందజేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని భగవత్‌వీడు పంచాయతీ శివారు సోమ్లాతండాకు రూ. 1.51 కోట్లతో నిర్మంచనున్న బీటీ రహదారికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భక్తరామదాసు ఎత్తిపోతల పనులు పూర్తికావొచ్చాయని, సాగర్ నీరు పాలేరుకు సాగుకు వదిలితే ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాలువల నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తికాని ఎస్సారెస్పీ కాలువల తవ్వకం వేగంవంతం చేశామని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతితండాకు రోడ్డుసౌకర్యం కల్పించేందుకు రూ. 57 కోట్లతో 55 రహదారులను మంజూరు చేశామన్నారు. ఏడాదిలోగా ప్రతి తండాకు రోడ్డు, ప్రతి ఊరిలో ఇంటింటికి నల్లాద్వారా నీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిచేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేమున్నా, వాటిని పరిష్కరిస్తానని అన్నారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ... మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాంలో పాలేరు నియోజకవర్గం జిల్లాలోనే అభివృద్ధిలో ముందంజలో ఉంటుదని అన్నారు. ఈ ప్రాంతం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కొడబాల కోటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ మారుపాక నగేష్, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వడ్త్యి రాంచంద్రునాయక్, సర్పంచ్ పడిశాల ఎల్లయ్య, తహసీల్దారు వెంకారెడ్డి, ఎంపీడీఓ విద్యాచందన, టీఆర్ఎస్ నాయకులు బత్తుల సోమయ్య, సాధు రమేష్‌రెడ్డి, వీరవెల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం.. దైన్యం
సాక్షి, ఏలూరు : ధాన్యం విరగ పండినప్పటికీ రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ధాన్యానికి ఇచ్చే కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఏటా ఎంతోకొంత పెంచుతుంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం లేకపోవడం.. కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరకపోవడంతో మద్దతు ధరపై నేటికీ ప్రకటన వెలువడలేదు. జిల్లాలో ఇప్పటికే దాదాపు సగానికి పైగా ధాన్యా న్ని మిల్లర్లకు తక్కువ ధరకే రైతులు విక్రరుుంచారు. ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నా కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నారుు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మిల్లర్లు ధర తగ్గించేశారు. పట్టించుకునేదెవరు? ధరల విషయంలో దోపిడీకి గురవుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమైనా గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే అదీ లేదు. గత ఖరీఫ్‌లో ధాన్యానికి మద్దతు ధర రూ.60 పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించడంతో ఏ గ్రేడ్ ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,250 నుంచి రూ.1,310కి పెరిగింది. ఈసారి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. నిజానికి గిట్టుబాటు ధర ఎంతున్నా రైతుకి దక్కేది నామమాత్రమే. మద్దతు ధరను కనీసం రూ.2,200 పెంచితే మిల్లర్లు ధర పెంచుతారని రైతులు ఆశపడుతున్నారు. చేలల్లోనే ధాన్యం ఈ ఏడాది డెల్టా, సెమీ డెల్టాలో 3,78,190 ఎకరాలు, మెట్టలో 39,310 ఎకరాల్లో కలిపి మొత్తం 4,17,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వాస్తవానికి 17 శాతం తేమ గల ధాన్యాన్ని ఏ గ్రేడ్‌గా గుర్తించి క్వింటాల్‌కు రూ.1,345 చెల్లించాలి. అంతకు మించి తేమ ఉంటే బీ గ్రేడ్‌గా గుర్తించి రూ.1,310కు కొనుగోలు చేయాలి. ప్రభుత్వ ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,008 ధర రావాల్సి ఉండగా, దళారులు రూ.900 నుంచి రూ.920 మధ్య కొంటున్నారు. సాధారణ రకం ధాన్యానికి రూ.982 ధర వస్తుందనుకుంటే రూ.850 నుంచి రూ.880 మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్‌తో సంబంధం లేకుండా ఏ రకం ధాన్యాన్ని అయినా ఒకే ధరకు అడుగుతున్నారు. దీంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవడానికి మనసొప్పక చేలల్లోనే రాశులుగా పోసి నామమాత్రపు రక్షణ చర్యల మధ్య వదిలేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటివరకూ సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనగలిగారు. అలంకార ప్రాయంగా ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకే కొంటామని అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో విఫలమవుతూనే ఉన్నాయి. 2012 ఖరీఫ్‌లో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారు. అంచనా దిగుబడి 11.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, లక్షా 35 వేల హెక్టార్లలో వరి పంట నీలం తుపానుకు దెబ్బతింది. దీంతో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కోల్పోయారు. మిగిలిన ధాన్యాన్ని కొనడానికి జిల్లాలో 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేవలం 28 కేంద్రాల్లో 7,301మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 2013 రబీలో లక్షా 68 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ధాన్యం కొనుగోలుకు 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్పత్తి లక్ష్యం 11.99 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నది కేవలం 108 మెట్రిక్ టన్నులే. 2013 ఖరీఫ్‌లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేశారు. వర్షాలకు 54 వేల 400 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గరిష్టంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ వర్షం దెబ్బకు ఆ దిగుబడి సగానికి పడిపోయింది. 80కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా కేవలం 250 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఈ ఏడాది రబీలో జిల్లాలోని 57 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ కేవలం 886 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొంటే మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. అది ఎగవేయడానికి, మిల్లర్లకు మేలు చేకూర్చడానికీ ప్రభుత్వమే ఈ విధంగా కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నారుు. -
అతలాకుతలం..
ఖమ్మం, న్యూస్‌లైన్ : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తడిసిన ధాన్యం, మిర్చి, వేరుశనగ, మొక్కజొన్నలను ఆరబెట్టి, మార్కెట్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగానే.. మళ్లీ గురువారం కురిసిన వర్షం వారిని ఆగమాగం చేసింది. అప్పటివరకు ఎండ తీవ్రంగానే ఉండటంతో పంటలను ఆరబోసిన రైతులు.. అకస్మాత్తుగా మబ్బులు కమ్మి, వర్షం పడడంతో వాటిని కాపాడుకునేందుకు ఉరుకులు.. పరుగులు తీయాల్సి వచ్చింది. అయినా పలుచోట్ల ధాన్యం, ఇతర పంటలు వర్షార్పణం అయ్యాయి. తడిసిన పంటలు రంగు మారితే ఉన్న కాస్త ధర కూడా పతనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన పత్తి, మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను వ్యాపారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ ప్రాంగణంలోనే నిల్వ చేశారు. అయితే గురువారం కురిసిన వర్షంతో పత్తి, మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. మధ్య యార్డు (మిర్చియార్డు)లో రాశులుగా ఉన్న వేరుశనగ, మొక్కజొన్నల వద్దకు వరద ప్రవాహం రావడంతో అవన్నీ తడిసి ముద్దయ్యాయి. మార్కెట్ యార్డులో వర్షపు నీరు సక్రమంగా పోయే విధంగా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో ఆ నీరంతా పంటల మీదుగానే ప్రవహించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం మండలంలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సంతో గన్నేరుకొయ్యపాడు, గన్నవరం ప్రాంతాలలో చెట్లు నేల కూలాయి. నందిగామ లో మూడు విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. రోడ్లపై నీరు నిలవడంతో పట్టణంలోని ప్రదాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పాలేరు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలాయపాలెం మండలం బీరోలు, బంధంపల్లి, జూపెడ, బచ్చోడు, కాకరావాయిలలో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. కూసుమంచి మండలంలోని పాలేరు, నర్సింహులగూడెం, జుజ్జులరావుపేట, జక్కేపల్లి, పెరకసింగారంలలో అకాల వర్షానికి వరి ధాన్యం, వరి పనలు కొద్దిగా తడిసిపోయాయి. వైరా, మధిర, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోనూ చిరుజల్లులు కురియడంతో ఆరబోసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. టార్ఫాలిన్లు కప్పి కొందరు పంటలు కాపాడుకున్నప్పటికీ, మరి కొందరు రైతులకు చెందిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కల్గింది.