Fashion show
-
అమ్మతనం ఆటకు అడ్డుకాలేదు
సంకల్పమే సగం విజయమన్నారు పెద్దలు.. కృషితో ఉన్నత శిఖరాలను చేరుకొన్న కొంత మంది మహిళలను ఆదర్శంగా తీసుకున్న ఆమె లేటు వయస్సులో టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని పక్కన పెట్టి భర్త ప్రోత్సాహంతో కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. దాంతో సంతృప్తి చెందకుండా నేను సైతం అంటూ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన బోయలపల్లి రేఖ. అర్వపల్లి: హైదరాబాద్‌లో రేఖ ఎంబీఏ చదువుతుండగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఆల్బమ్ చిత్రీకరణ పనిలో ఉన్న సినీ దర్శకుడు అగస్త్య హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన రేఖను ఎంపిక చేశాడు. కానీ, రేఖను ఆల్బమ్‌లో నటింపజేసేందుకు కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు పెళ్లి చేసుకుని ల్యాంకోహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ఇరుగుపొరుగు మహిళలతో కలిసి జిమ్ చేయడంతో పాటు టెన్నిస్ ఆడేవారు. అప్పుడే ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకున్నారు.ముంబైలో కోచింగ్..తన భర్త అగస్త్య.. హిందీ సినిమాల్లో పనిచేసేందుకు ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. భర్తతోపాటు రేఖ కూడా తన ఇద్దరు పిల్లలను వెళ్లారు. అప్పుడు రేఖ ముంబైలోని ‘ప్రాక్ టెన్నిస్’ అనే అకాడమీలో చేరి కఠోర సాధన చేశారు. ఉదయం 5 గంటలకే గ్రౌండ్లో ఉండేవారు. 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేసి 7.30 గంటలకు ఇంటికి వెళ్లి పిల్లలను రెడీచేసి స్కూల్‌కు పంపించేవారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు అకాడవీుకి వెళ్లి ముందుగా జిమ్ చేసి ఒక గంటపాటు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు.సింగిల్స్‌గానే..రేఖ మొదట ఏఐటి(ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్)లో రేఖకు మొదట సింగిల్స్ ఆడే అవకాశం వచ్చింది.. తన వ్యక్తిగత కారణాల వల్ల డబుల్స్ ఆడలేదు. ఐటీఎఫ్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్)లో ఆడారు. ఆ తర్వాత థాయిలాండ్‌తో పాటు వివిధ దేశాల్లో ఆడారు. స్పెయిన్‌కు పయనంజాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలంటే.. ముంబైలో ప్రాక్టీస్ సరిపోదని, విదేశాలకు వెళ్లాలని రేఖకు తన భర్త అగస్త్యతో పాటు పలువువరు సలహా ఇచ్చారు. దాంతో ఆమె యూరప్‌లోని స్పెయిన్‌కు వెళ్లి అక్కడ ‘మున్డో’ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. భర్త, పిల్లలు ముంబైలోనే ఉంచి ఆమె ఒక్కరే స్పెయిన్ వెళ్లి రెండు నెలలపాటు స్పెయిన్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆమెకు ఎవరూ స్పాన్సర్షిప్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్పెయిన్ వెళ్లారు.ఆటకు ‘లాక్డౌన్’రేఖ వివిధ దేశాల్లో ఆడుతూ బిజీ అవుతున్న సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌తో ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో ఆమె హైదరాబాద్‌లోని ల్యాంకోహిల్స్‌లో ఉన్నారు. తాను ఉంటున్న అపార్ట్మెంట్ల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వేల మంది తిండికి ఇబ్బంది పడడం రేఖ చూసి చలించిపోయారు. ఆ కూలీలకు ఆమె స్వయంగా అన్నం వండిపెట్టారు. అప్పుడే తనకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ‘రేఖా చారిటబుల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ నుంచి కరోనా సమయంలో రోజుకు 2వేల మందికి భోజనం వండిపెట్టారు. వివిధ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారు. ఆ సమయంలో రేఖకు సేవా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా రాష్ట్రాల సీఎంల నుంచి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా ‘రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్’ను కూడా స్థాపించి క్రీడాకారులను ఆమె ప్రోత్సహిస్తున్నారు.సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలురేఖ తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో ముమ్మరం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ విద్యా సంవత్సరం 30 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. క్రీడా దుస్తులు ఇచ్చారు. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్రీడా సామగ్రి అందజేశారు. తాను చదువుకున్న అడివెంల గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలతో మరమ్మతులు చేయించి క్రీడా సామగ్రి, ఆరో ప్లాంట్ పెట్టించారు. తాను చేసే సేవ రాజకీయాల కోసం కాదని, కేవలం సేవా దృక్పథంతోనేనని రేఖ చెబుతున్నారు. -
సబ్యసాచి ఫ్యాషన్ షోలో మెరిసిన సుకుమార్ భార్య తబిత (పోటోలు)
-
జూబ్లీహిల్స్ క్లబ్లో ఫ్యాషన్ షో..ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫోటోలు)
-
ఉత్సాహంగా ఎఫ్–టామ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో..
ముంబై సెంట్రల్: ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో బుధవారం థాణేలో తెలుగువారి కోసం ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఎఫ్–టామ్ ఫ్యాషన్ విభాగం బాధ్యురాలు మచ్చ అంజలి నేతృత్వంలో ఠాణేలోని కాశీనాథ్ ఘాణేకర్ సభాప్రాంగణంలో నిర్వహించిన తెలుగువారి ‘సాంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో, అవార్డు ప్రదానోత్సవ’కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నటి మీనాక్షీ గడేకర్, నగల వ్యాపారి సుహాస్ మాలవీయ, టీవీ నటీమణి సష్టి సింగ్, నటుడు సిద్ధాంత్ దాండే, సెలబ్రిటీ ఆర్గనైజర్ ప్రమోద్ సింగ్, మోడల్ వల్లకాటి జ్యోతి, మేకప్ ఆర్టిస్ట్ మానసి తదితరులు హాజరయ్యారు. ఫ్యాషన్ దివా, ‘బెస్ట్’విజేతల ఎంపిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడి సునీత, వేముల వాణికి బెస్ట్ స్మైల్, ఇవటూరి కిరణ్మయికి బెస్ట్ వాక్, మామిడాల హరిత రావుకు బెస్ట్ కాని్ఫడెన్స్, నారయ్య నీరజకు బెస్ట్ ఆటిట్యూడ్, జోషి ప్రియాంకకు బెస్ట్ బ్యూటిఫుల్, అనుపమకు బెస్ట్ గ్రేస్‌ఫుల్, కూన లక్ష్మీప్రసన్నకు బెస్ట్ అటైర్, పారసు నివేదితకు బెస్ట్ ఫోజ్, పోలు నూతన్‌కు బెస్ట్ ఐస్, సూర భాగ్యశ్రీకి బెస్ట్ డ్యాన్స్ స్టెప్స్ అవార్డులు లభించాయి. ఉత్తమ ఫ్యాషన్ దివా అవార్డుల ప్రథమ విజేతగా ఉబాలే సరోజ్, రెండవ విజేతగా జోషి ప్రియాంక, మూడవ విజేతగా కూన లక్ష్మీప్రసన్న ఎన్నికయ్యారు. అన్నిరంగాల్లో ‘తెలుగు’ముద్ర అవసరం: గంజి జగన్‌బాబు ‘‘వేగంగా మారుతున్న ప్రపంచంలో తెలుగు యువత కూడా అన్ని రంగాల్లో ముందంజ వేయాలనీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఫ్యాషన్ రంగంలో కూడా తమదైన ముద్రను ఏర్పాటు చేసుకోవాలనీ, అప్పుడే తెలుగు అనే భావన, గర్వం అందరిలో కలుగుతుందని’ఎఫ్–టామ్ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు అభిప్రాయపడ్డారు. ముంబైలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఫ్యాషన్ రంగానికి చెందిన పూర్తిస్థాయి కార్యక్రమంగా ఫ్యాషన్ షో నిలిచిందని అన్నారు -
ధర్మాటిక్ ఫ్యాషన్ ఫండ్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
విజయవాడ : సిద్ధార్థ ఫెట్ –2024.. ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎత్నిక్ ఫ్యాషన్ షోలో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఆధ్వరియా సిల్క్స్ ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
రూ.1.43 కోట్ల డ్రెస్‌లో అదరగొట్టిన వ్యాపారవేత్త, మోడల్ మోనా పటేల్
ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త మోనా పటేల్ మరోసారి తన ఫ్యాషన్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి హాజరైన మోలా పటేల్ వింటేజ్ సిల్వర్ కలర్ కార్సెట్‌ను ధరించింది. అంతేకాదు ఈ డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చింది మోనా పటేల్. ఈ సందర్బంగా తనదైన ఐకానిక్ స్టైల్లో, వింటేజ్ స్కర్ట్‌లో దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. క్రిస్టియన్ లాక్రోయిక్స్ హాట్ కోచర్ కలెక్షన్లోనిది ఈ డ్రెస్. దీన్ని వేలంలో సుమారు రూ. 1.43కోట్లు (169,828.65డాలర్లు) మోనాగానీ, ఆమె స్టైలిస్ట్ గానీ కార్సెట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అంచనా. దీన్ని చేతితో దయారు చేశారు. దీనికి చక్కని ఎంబ్రాయిడరీని కూడా జతచేశారు. వేలకొద్దీ చేతితో కుట్టిన స్ఫటికాలు, భుజంపై ఉన్న సున్నితమైన సిల్క్ ఆర్గాన్జా పూసల సీతాకోకచిలుక, స్వరోవ్స్కీ పూసలు, స్ఫటికాలుతో తీర్చి దిద్దారు.మోనా 3డీ సీతాకోక చిలుకలను కైనెటిక్ మోషన్ ఆర్టిస్ట్ కేసీ కుర్రాన్ సహాయంతో స్వయంగా డిజైన్ చేసిందట. ఈ ఏడాది ప్రారంభంలో మెట్ గాలాలో తొలిసారి పాల్గొన్న మోనా పటేల్ ఐరిస్ వాన్ హెర్పెన్ కోచర్ బటర్ ఫ్లై మోడల్ డ్రెస్‌లో అందర్నీ కట్టిపడేసిన సంగతి తెలిసిందే. -
ఫ్యాషన్ షోలో మురిపించిన ముద్దుగుమ్మలు! (ఫొటోలు)
-
విజయవాడ : అదరహో.. మిస్ బ్లాక్ షో, ర్యాంప్ వాక్‌తో సందడి (ఫొటోలు)
-
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికితా పోర్వాల్ (ఫొటోలు)
-
పెళ్లికొడుకు గెటప్‌లో రణబీర్ కపూర్ సందడి (ఫొటోలు)
-
Fashion: ఫ్యాషన్ ఇలాకా.. ట్రిపుల్ ధమాకా..
సాక్షి, సిటీబ్యూరో: ఒకేరోజున ముగ్గురు ఆల్ ఇండియా టాప్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్లు తమ డిజైన్లతో నగరాన్ని పలకరించారు. తమదైన శైలికి చెందిన అంతర్జాతీయ దుస్తుల శ్రేణిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే అగ్రగామి డిజైనర్లుగా పేరొందిన ఢిల్లీకి చెందిన అబ్రహమ్, ఠాకూర్ ద్వయంతో పాటు రాహుల్ మిశ్రాలు హాజరయ్యారు.అదే విధంగా ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్ సత్యపాల్.. బంజారాహిల్స్ రోడ్ నెం1లో ఉన్న సత్వా సిగ్నేచర్ టవర్‌లో వరుసగా తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఒకేరోజున వాటిని ప్రారంభించారు. సిటీ ఫ్యాషన్ సర్కిల్లో సందడి నింపిన ఈ అత్యాధునిక దుస్తుల స్టోర్ల ప్రారం¿ోత్సవం, లాంచింగ్ పారీ్టలకు సినీనటులు తమన్నా, నిహారికా, శోభితా దూళిపాళ్ల, సిరత్ కపూర్‌తో పాటు నగరంలోని పలువురు సెలబ్రిటీలు హాజరై డిజైనర్లకు అభినంధనలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులతో డిజైనర్లు తమ కలెక్షన్స్ గురించిన విశేషాలను పంచుకున్నారు. -
తారల తలుక్కు..మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
Hyderabad: రాకింగ్ ర్యాంప్ వాక్..! టాప్ మోడల్స్.. క్యాట్ వాక్!!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పార్క్ హోటల్ వేదికగా జరిగిన బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో టాప్ మోడల్స్ క్యాట్ వాక్ తో అలరించారు. ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో మోడల్స్ ర్యాంప్ పై సోమవారం సందడి చేశారు.లండన్‌లోని ప్రముఖ రేవన్స్ బోర్న్ యూనివర్సిటీ, సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఎంబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీకాం, బీఏ చేసిన వారికీ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, లగ్జరీ మేనేజ్మెంట్ వంటి కోర్సులను లాంచ్ చేశారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డెలిగేట్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాషన్ షో అలరించింది. ముఖ్య అతిథిగా రావెన్స్బోర్న్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆండీ కుక్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సైమన్ రాబర్ట్‌షా, యూనివర్సిటీ ప్రతినిధులు మోహిత్, గంభీర్ తదితర ప్రతినిధులు, ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. -
చేనేత దినోత్సవం.. విజయవాడ ఫ్యాషన్ షోలో మెరిసిన అమ్మాయిలు (ఫొటోలు)
-
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.. ఇండియా కౌచర్ వీక్ ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
మాదాపూర్ : సినీ తారల ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
దేశాధినేతల ర్యాంప్ వాక్! వైరల్ వీడియో
ఎప్పుడూ బిజీగా ఉండే దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? వారు ర్యాంప్ వాక్ చేయడమేంటి అనుకుంటున్నారా? ఇదంతా నిజంగా కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన చమత్కారం ఇది.భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లతో సహా పలు దేశాధినేతలు భవిష్యత్ దుస్తులలో ర్యాంప్‌పై నడుస్తున్నట్లు ఏఐ రూపొందించిన వీడియోను చూపిస్తూ టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఇది ఏఐ ఫ్యాషన్ షో సమయం" అంటూ ఈ వీడియోకు మస్క్ క్యాప్షన్ ఇచ్చారు. ఇది అత్యధికంగా 35 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.నిమిషానికి పైగా నిడివిగల ఈ వీడియోలో ప్రధాని మోదీ, కమలా హారిస్, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, టిమ్ కుక్, ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, నాన్సీ పెలోసి, జి జిన్‌పింగ్, జస్టిన్ ట్రూడో, బిల్, హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, బెర్నీ సాండర్స్, బిల్ గేట్స్, ఇలాన్ మస్క్ ర్యాంప్ మీద నడుస్తున్నట్లు కనిపిస్తారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని కూడా ఇందులో చమత్కారంగా ప్రస్తావించారు.High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu— Elon Musk (@elonmusk) July 22, 2024 -
తిరుపతి : అదిరే డ్రస్‌లతో అదరగొట్టిన విద్యార్థినులు (ఫోటోలు)
-
విజయవాడ : అదరహో అనిపించిన ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
విజయవాడ : ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా రూ. 300 కోట్ల డైమండ్ నెక్లెస్..
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పలు ఫ్యాషన్ వేడుకలకు తన డిజైనర్‌వేర్ డ్రెస్‌లతో మిస్మరైజ్ చేస్తుంది. అలానే రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరికొత్త హెయిర్ స్టైల్‌తో ప్రియాంక ప్రేక్షకులను అలరించింది. పైగా ఆ హెయిర్ స్టైల్‌కి తగ్గట్టు నలుపు, తెలపు కాంబినేషన్ గౌను, అందుకు తగ్గట్టు డైమండ్ నెక్లస్‌ని ధరించి అత్యద్భుతంగా కనిపించింది. నెక్కు కోట్లు ఖరీదు చేసే 200 క్యారెట డెమండ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బల్గేరి అటెర్నె బ్రాండ్‌కి చెందిన ఈ నెక్లెస్ అత్యంత లగ్జరియస్ జ్యువెలరీ. ఈ మేరకు ఈ విషయాన్ని బల్గారీ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫ్యాషన్, పాప్ సంస్కృతిని ఫాలో అయ్యే ఇన్‌స్టాగ్రామర్ డైట్ సబ్యా కూడా ఈ నెక్లెస్ మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నెక్లెస్ రూపొందిచడానికి దాదాపు 2,800 గంటలు శ్రమతో కూడిన నైపుణ్యం అవసమరమని, ఇది చాలా కఠినమైన వజ్రమని తెలిపారు. దీన్ని 140 క్యారెట్ల ఏడు పియర్ ఆకారపు చుక్కలుగా రూపొందించడానికే ఇంత సమయం తీసుకుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బ్రాండ్ చరిత్రలో ఇది అత్యద్భుతమైన నెక్లెస్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో ప్రియాంక ధరించిన కళ్లమిరుమిట్లు గొలిపే డైమండ్ నెక్లెస్ తోపాటు ఆమె కొత్త హెయిర్ స్టైల్ హైలెట్‌గా నిలిచింది. ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ. 300 కోట్ల పైనే ఉంటుందని సమాచారం.ఇక కనుబొమ్మలకు మెరిసే గోల్డెన్ ఐ షాడో, కనురెప్పలపై మస్కరా, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్, చెంపలపై గులాబీ రంగు బ్లష్ వంటివి హైలెట్‌గా నిలిచాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) (చదవండి: కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!) -
చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో!
సౌదీ అంటూ ఉలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు అందరూ అభిప్రాయం మార్చుకునేలా సరికొత్త సంస్కరణలకు. శ్రీకారం చుడుతోంది. అసలు సౌదీలో మహిళలు మొత్తం శరీరం అంతా కంపి ఉంచేలా బట్టలు ధరించాలి. అలాంటి సంప్రదాయవాద దేశంలో తొలిసారి స్విమ్‌సూట్ ఫ్యాషన్ షోని భారీ ఎత్తున నిర్వహించింది. ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొనవచ్చు. ఈ స్విమ్‌సూట్ ఫ్యాషన్ గత శుక్రవారమే సెయింట్ రెజిస్ రెడ్ సీ రిసార్ట్‌లోని రెడ్సీ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జరిగింది. ఈ షోలో మెరాకో డిజైనర్ యాస్మినా క్వాన్జల్ వన్ పీస్ ఎరుపు రంగు స్విమ్‌సూట్, నీలరంగులో స్వీమ్సూట్లలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న చాలా మోడల్‌లు భూజాలు బహిర్గతమయ్యేలా స్విమ్‌సూట్ ధరించారు. ఈ క్రమంలో డిజైనర్ క్వాన్జల్ మీడియాతో మాట్లాడుతూ.."ఈ దేశం చాలా సంప్రదాయవాదంగా ఉంది. కానీ తాము అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే సొగసైన స్విమ్‌సూట్‌లో కనిపించేందుకు యత్నం చేస్తున్నాం. ఇది తమ గౌరవంగా భావిస్తున్నాం." అని తెలిపింది క్వాన్జల్. అంతేగాదు నిజానికి సౌదీ అరేబియాలో స్విమ్‌సూట్ ఫ్యాషన్‌షో అనేది చరిత్రాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి షో నిర్వహించడం సౌదీలో ఇదే తొలిసారి. Red Sea Fashion Week లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్‌లో ఈ షో నిర్వహించారు. Red Sea Globalలో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్ సీ రిసార్ట్‌లో ఈ షో జరగడం మరింత ఆసక్తికరంగా మారింది. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్ని నిర్మించింది సౌదీ ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్ చేస్తోంది.ఎన్నో సంస్కరణలు..ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్‌లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్‌కి తీసుకెళ్లి మరీ బలంవంతంగా ప్రార్థన చేయించే వాళ్లు. ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్ వచ్చిన తర్వాత నుంచి ఈ నిర్బంధపు ప్రార్థనల్ని పక్కన పెట్టేశారు. అంతే కాదు సినిమా హాల్స్‌ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పురుషులు, మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్.2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ 12.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే..స్విమ్‌సూట్ ఫ్యాషన్ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని సల్మాన్ఎ దురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి.SAUDI ARABIA HOSTS A SWIMSUIT FASHION SHOW FOR THE FIRST TIME pic.twitter.com/eOcLRnv2K9— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 18, 2024 (చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..)