Fastest speed
-
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు నమోదు
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాను వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 14వ ఓవర్) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు. టీమిండియా చోటు దక్కించుకున్నప్పటి నుంచి నిలకడైన వేగంతో బంతులు సంధిస్తున్న ఉమ్రాన్.. ఈ సిరీస్‌కు ముందు లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఉమ్రాన్.. ఐపీఎల్లో సైతం టీమిండియా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ 157 కిమీ వేగంతో బంతిని విసిరాడు. భారత్ తరఫున ఐపీఎల్లో ఉమ్రాన్‌దే రికార్డు. కాగా, లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 29 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు
తొలిసారి నిర్వహించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ విజేతగా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆసియా లయన్స్ గట్టిపోటీ ఇచ్చినప్పటికి పరాజయం పాలైంది. ఆట సంగతి ఎలా ఉన్నా.. మాజీ క్రికెటర్లంతా ఒక దగ్గరికి చేరి టోర్నీ ఆడడం అభిమానులకు మాత్రం సంతోషాన్ని పంచింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ బౌలర్ మోర్నీ మోర్కెల్ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. 37 ఏళ్ల మోర్కెల్ మంచి ఫాస్ట్ బౌలర్ అన్న సంగతి తెలిసిందే. ప్రొటీస్‌కు క్రికెట్ ఆడిన రోజుల్లో ఎన్నోసార్లు వేగవంతమైన బంతులు విసిరాడు. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లో తిలకరత్నే దిల్షాన్‌కు వేసిన ఒక బంతి గంటకు 138 కిమీవేగంతో వెళ్లింది. మంచి పేస్‌తో.. బౌన్స్‌తో వచ్చిన బంతిని దిల్షాన్ ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే బంతి విసిరిన తర్వాత పట్టుతప్పిన మోర్కెల్ క్రీజులోనే కిందపడ్డాడు. అతను పడ్డ విధానం చూసి గాయమైందనే అనుకున్నారు. కానీ అదృష్టం బాగుండడంతో మోర్కెల్‌కు ఎలాంటి గాయం కాలేదు. ఇదే మ్యాచ్‌లో తన సోదరుడు అల్బీ మోర్కెల్ మూడు వికెట్లతో రాణించాడు. కాగా మోర్నీ మోర్కెల్ దిల్షాన్‌ను తన తర్వాతి ఓవర్లో స్లో డెలివరీ వేసి బోల్తా కొట్టించాడు. pic.twitter.com/RYsGz7ju8t — Sports Hustle (@SportsHustle3) January 29, 2022 -
ఈ గద్దకు చూపెక్కువ!
లండన్: ‘పెరెగ్రిన్ ఫాల్కన్’అనే గద్ద పక్షి జాతిలోనే అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒక సెకనుకు దాదాపు 130 ఫ్రేమ్‌లను తన కళ్లతో బంధిస్తుందని తెలిసింది. దీంతో ఈ పక్షులు ఎక్కువ వేగంతో ఎగిరేటప్పుడు నేలపై ఉండే తన ఆహారాన్ని వేగంగా గుర్తించి, స్పందించే వీలు కలుగుతుందన్న మాట. స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధన ప్రకారం మానవుడి కళ్లు ఒక సెకనులో 50 నుంచి 60 ఫ్రేమ్‌లను మాత్రమే బంధించగలుగుతాయి. ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం సరైన వెలుతురు ఉన్న వాతావరణంలో పెరెగ్రిన్ ఫాల్కన్ సెకనుకు 129 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలదని తెలిసింది. సేకర్ ఫాల్కన్ అనే గద్ద సెకనుకు 102, హారిస్ హాక్ డేగ 77 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలవని తెలిపింది. వేటాడే పక్షుల దృష్టిపై తొలిసారిగా అధ్యయనం చేసి, ఎదురుగా కనిపించే దానికి ఎలా స్పందిస్తుందనే విషయం తెలుసుకున్నట్లు లుండ్ వర్సిటీకి చెందిన అల్ముట్ కెల్బర్ తెలిపారు. సేకర్ ఫాల్కన్, హారిస్ హాక్ డేగలు నేలపై మెల్లగా కదిలే క్షీరదాలను మాత్రమే వేటాడుతుంటాయని, అందుకే వాటికి తక్కువ దూరదృష్టి ఉంటుందని వివరించారు. అదే పెరెగ్రిన్ ఫాల్కన్ మాత్రం తన ఆహారాన్ని చూసిన వెంటనే ఆకాశం నుంచి దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగి చటుక్కున నోట్లో వేసుకుంటుందని చెప్పారు. -
ప్రాణం తీసిన అతివేగం
కట్టంగూర్ : అతివేగం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. కట్టంగూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగాటి నారాయణ తన భార్య అమృత(52)తో కలిసి వోక్స్ వ్యాగన్ కారులో హైదరాబాదు నుంచి తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం పెద్దబీరవెల్లికి ఆదివారం ఉదయం బయలుదేరారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు కట్టంగూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్ మీదుగా కుడివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాదు వైపు వెళ్తున్న లారీ కారును వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న నారాయణ కారులో ఇరుక్కుపోగా ఆయన భార్య అమృత కారులోంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అమృత మృతి చెందారు. నారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. సీటుబెల్టు పెట్టుకొని ఉంటే కారు స్వయంగా నడిపిస్తున్న నాగాటి నారాయణతోపాటు ఆయన భార్య కూడా సీటు బెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది. దీంతో వారి కారు ప్రమాదానికి గురైనప్పుడు నారాయణ భార్య కారులోంచి ఎగిరి కింద పడ్డారు. ఒకవేళ సీటుబెల్టు పెట్టుకొని ఉంటే ప్రాణం పోయే పరిస్థితి ఉండక పోయేదని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కారును లారీ వెనకనుంచి ఢీకొనడంతో ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకోలేదు. సకాలంలో రాని అంబులెన్స్‌లు స్థానికులు ఫోన్ చేసినా ప్రమాదం జరిగిన అరగంట తర్వాత 108 వాహనం వచ్చింది. సిబ్బంది కూడా అమృత చనిపోయిందని నిర్ధారించి కేవలం నారాయణను మాత్రమే నార్కట్‌పల్లి సమీపంలోని కామినే ని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన హైవే అంబులెన్స్ సిబ్బంది కూడా అమృత చనిపోయిందంటూ ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించారు. స్థానికుల ఒత్తిడి మేరకు ఆమెను నకిరేకల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆమె బతికే ఉన్నట్లు నిర్థారించుకొని హుటాహుటినా నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. 108 సిబ్బంది గానీ, హైవే అంబులెన్స్ సిబ్బంది గానీ అమృత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని గమనించక ఆస్పత్రికి తరలించడం ఆలస్యం చేయడం వల్లే ఆమె మృతి చెందిందని, ఒకవేళ నారాయణతో పాటే ఆమెను కూడా ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేదని స్థానికులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో హైదరాబాదు వెళ్తుతున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.