Federal group
-
ఇథియోపియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం..
అడిస్ అబాబా: ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఎమర్జెన్సీని ప్రకటించింది. గత కొంతకాలంగా ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక ఇదే వారంలో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఫానో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. పొరుగున ఉన్న టైగ్రే ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు చెబుతోంది ఇథియోపియా ప్రభుత్వం. సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ప్రభుత్వం తరపున ఆర్డర్‌ను తిరిగి అమలు చేయాల్సిందిగా ఫెడరల్ అధికారుల సాయం కోరామని అయినా కూడా ఘర్షణలను నియంత్రించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ప్రకటించింది. ఎమర్జన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభలను నిషేధం.. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఏ ప్రకటనలో పేర్కొంది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ విధించదానికి కూడా వెనుకాడమని ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. -
‘ఫెడరల్ ఫ్రంట్’పై మమతతో బాబు చర్చలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సమాఖ్య కూటమి(ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. సెక్రటేరియట్లో మమతతో సమావేశమైన ఆయన తమ భేటీ సానుకూలంగా సాగిందని తర్వాత విలేకర్లతో అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఆ ఫ్రంట్‌కు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఫెడరల్ ఫ్రంట్‌లో ఏ పార్టీలు ఉంటాయన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ పై స్పందించాలని కోరగా దానికి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం కోసం కాంగ్రెసేతర,బీజేపీయేతర పార్టీలు చేతులు కలపాలని మమత పిలుపునివ్వడం తెలిసిందే. ‘మూడో కూటమి’ ఏర్పాటుపై జేడీయూ నేత నితీశ్, వామపక్షాల, ఇతర పార్టీల నేతలు ఢిల్లీలో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ ఇంట్లో అనధికారికంగా సమావేశమై చర్చిం చిన నేపథ్యంలో బాబు మమతతో భేటీ అయ్యారు.