కనుల పండువగా సాయి పల్లకిసేవ
మిర్యాలగూడ అర్బన్: సాయి పల్లకి సేవను దత్తా ఆశ్రమ స్వాములు శనివారం రాత్రి కన్నుల పండువగా నిర్వహించారు. పొలిశెట్టి వెంకటేశ్వర్లు, సక్కుబాయి ఇంటి నుంచి ప్రారంభమైన సంతోష్‌నగర్ మీదుగా కొనసాగింది. దీనిలో భాగంగా కాలనీ మహిళలు వేసిన కోలాట ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని సాయి పల్లకిని మోశారు.