Fibrinogen
-
నో ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్!
జీవితంలో ఫ్రెండ్స్ లేకపోవడం అన్నది పొగతాగే అలవాటు అంతటి ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు. ఒంటరి జీవితానికీ ఫైబ్రినోజిన్ అనే రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉపయోగపడే ప్రోటీన్‌కు సంబంధం ఉంటుందంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఒంటరి జీవితాన్ని గడిపేవాళ్లలో ఫైబ్రినోజెన్ తగ్గుతుంది. దాంతో జీవితంలో ఒత్తిళ్లు ఏర్పడినప్పుడు ‘ఫైట్ లేదా ఫ్లైట్’ ఎదుర్కోవడం లేదా పారిపోవడం జరిగినప్పుడు రక్తస్రావం అతిగా జరగకుండా రక్తం గడ్డకట్టడానికి నిరోధించడానికి ఉపయోగపడేదే ఈ ఫైబ్రినోజెన్. అయితే మరీ ఫ్రెండ్స్ ఎక్కువగా పెరిగినా అది ఈ ఫైబ్రినోజెన్ను మరింత పెరిగేలా చూస్తుంది. దాంతో రక్తంలోని గడ్డకట్టే అంశాలూ పెరిగి రక్తనాళాల్లో పూడికలూ అడ్డంకులూ రావచ్చంటున్నారు నిపుణులు. సోషల్నెట్వర్క్ ద్వారా అతిగా ఫ్రెండ్స్‌ను రూపొందించుకునే వారిలోనూ ఫైబ్రినోజిన్ పెరిగి అది గుండెజబ్బులంత ప్రమాదకరంగా మారవచ్చునంటున్నారు. అందుకే ఆరోగ్యకరమైన ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన రీతిలో ఫ్రెండ్షిప్ ఉండాలంటున్నారు హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నిపుణులు డాక్టర్ డేవిడ్ కిమ్. -
ఆరోగ్యంతో ‘దోస్తీ’ చేద్దాం
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడో కవి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. మంచి మిత్రుడు తోడుంటే ఆ ధైర్యమే వేరు. జీవితంలో మిత్రులు లేకున్నా .. ధూమపానం చేసినా శరీరానికి ఒకే రకమైన హాని కలుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరిగి రక్తంలో ఫైబ్రోనోజిన్ ప్రోటీన్ స్థాయి పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రోటీన్ రక్తంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండెపోటుతో పాటు తదితర వ్యాధులు వస్తాయి. కుటుంబంలోని వ్యక్తులు, వారికున్న స్నేహితులను బట్టి వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయిలకు ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐదుగురు స్నేహితులు ఉన్న వారి రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి 10 మంది స్నేహితులు ఉండే వారి కన్నా 20 శాతం అధికంగా ఉంది. ఐదుగురి కన్నా తక్కువ మంది స్నేహితులు ఉన్న వారిలో ధూమపానం చేస్తే పెరిగే స్థాయిలో రక్తంలో ఫైబ్రోనోజిన్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అన్నారు. సమాజంతో మనకున్న సంబంధాలు రక్తంలో ఫైబ్రోనోజిన్ స్థాయి పెరుగుదలకు మధ్య సంబంధాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం ఫలితాలను విడుదల చేశారు.