నో ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్!
జీవితంలో ఫ్రెండ్స్ లేకపోవడం అన్నది పొగతాగే అలవాటు అంతటి ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు. ఒంటరి జీవితానికీ ఫైబ్రినోజిన్ అనే రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉపయోగపడే ప్రోటీన్‌కు సంబంధం ఉంటుందంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఒంటరి జీవితాన్ని గడిపేవాళ్లలో ఫైబ్రినోజెన్ తగ్గుతుంది. దాంతో జీవితంలో ఒత్తిళ్లు ఏర్పడినప్పుడు ‘ఫైట్ లేదా ఫ్లైట్’ ఎదుర్కోవడం లేదా పారిపోవడం జరిగినప్పుడు రక్తస్రావం అతిగా జరగకుండా రక్తం గడ్డకట్టడానికి నిరోధించడానికి ఉపయోగపడేదే ఈ ఫైబ్రినోజెన్. అయితే మరీ ఫ్రెండ్స్ ఎక్కువగా పెరిగినా అది ఈ ఫైబ్రినోజెన్‌ను మరింత పెరిగేలా చూస్తుంది.
దాంతో రక్తంలోని గడ్డకట్టే అంశాలూ పెరిగి రక్తనాళాల్లో పూడికలూ అడ్డంకులూ రావచ్చంటున్నారు నిపుణులు. సోషల్‌నెట్‌వర్క్ ద్వారా అతిగా ఫ్రెండ్స్‌ను రూపొందించుకునే వారిలోనూ ఫైబ్రినోజిన్ పెరిగి అది గుండెజబ్బులంత ప్రమాదకరంగా మారవచ్చునంటున్నారు. అందుకే ఆరోగ్యకరమైన ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన రీతిలో ఫ్రెండ్‌షిప్ ఉండాలంటున్నారు హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నిపుణులు డాక్టర్ డేవిడ్ కిమ్.