Finance Ministry Government
-
వామ్మో! ఒకటో తారీఖు!!
-
కేంద్ర నిధుల్లో కోత
- పన్నుల వాటాలో 60% విడుదల - వినియోగ పత్రాలు ఇవ్వనందునే ఇబ్బందులు అంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా 1వ తేదీన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రాకపోవడంపై ఆర్థికశాఖ విస్మయం వ్యక్తం చేస్తోంది. ప్రతినెలా రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో రూ.1,760 కోట్ల నిధులు వస్తాయి. అలాగే రెవెన్యూ లోటు భర్తీ కింద మరో రూ.450 కోట్లు వస్తాయి. ప్రతి నెలా కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆధారపడే ఉద్యోగులకు జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే ఈ నెల 1న పన్నుల వాటా రూపంలో రావాల్సిన నిధుల్లో కేవలం 60 శాతమే వచ్చాయి. రూ.1,760 కోట్లకు గాను కేవలం రూ.977 కోట్లే విడుదల చేసింది. పన్నుల వాటా నిధులు ఇలా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా నిలిపివేయడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఉండగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా 1న రెవెన్యూ లోటు భర్తీ కింద విడుదల చేస్తున్న రూ.450 కోట్లను కూడా కేంద్రం ఈ నెల విడుదల చేయలేదు. ఆగస్టులో పైసా రాలేదు ఇలా ఉండగా గత ఆగస్టు 17న రాజధానిలో భవనాల నిర్మాణం కోసం, ఏడు వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకాభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధుల్లో ఇప్పటివరకు పైసా రాలేదని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో రాజధానిలో భవనాల నిర్మాణాల నిమిత్తం ఇచ్చిన రూ.1,050 కోట్లకు రాష్ట్రం ఇప్పటివరకు వినియోగ పత్రాలను సమర్పించలేదని, దీంతో ఆగస్టులో మంజూరు చేసిన నిధుల్లో పైసా కూడా కేంద్రం విడుదల చేయలేదని సమాచారం. ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చిన రూ.700 కోట్లకు వినియోగ పత్రాలు సమర్పిస్తే గానీ ఆందుకు మంజూరు చేసిన రూ.350 కోట్లు వచ్చే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
‘పోలవరం’లో మరో దోపిడీ!
-
‘పోలవరం’లో మరో దోపిడీ!
- పురుషోత్తపట్నం ఎత్తిపోతల వ్యయం 71.7 శాతం పెంపు - రూ.946 కోట్ల నుంచి రూ.1638 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం - జలవనరుల ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు వరప్రసాదియైన పోలవరం ప్రాజెక్టులో ‘పట్టిసీమ’ తరహా మరో దోపిడీకి ప్రభుత్వం తెరలేపింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ. 954 కోట్ల నుంచి ఏకంగా రూ.1638 కోట్లకు పెంచింది. రూ.1638 కోట్లతో పోలవరం ఎడమవైపున సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనామోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం కుడికాలువపై పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.1600 కోట్లకు పైగా విడుదల చేసి దోచుకున్న ప్రభుత్వ పెద్దలు ఇదే తరహాలో దండుకునేందుకు ఎడమ కాలువలో పురుషోత్తపట్నం ఎత్తిపోతలు -1, 2కు ఆమోదముద్ర వేశారని అధికార వర్గాలు అంటున్నాయి. ఎప్పుడేమి చేయాలో? ఎలా చేయాలో ప్రభుత్వ పెద్దలకే స్పష్టత లేదని, ఒకటి చెప్పి తర్వాత మరికొంత దోచుకునేందుకు మరొకటి ప్రతిపాదిస్తున్నారని అధికారులు అంటున్నారు. ‘పట్టిసీమ’ టెండరు నిబంధనలు మార్పు, టెండర్లు పిలిచిన తర్వాత అధిక చెల్లింపులకు ఆమోదం, తాజాగా పురుషోత్తపురం ఎత్తిపోతల స్వరూపం మార్పులే ఇందుకు నిదర్శనాలని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.ఈ ఫైలుపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపినా సీఎం ప్రత్యేక చొరవతో దీనిని చేపట్టడానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించారు. -
ఇకపై ఏడాదికి ఒకేసారి ‘ఆసరా’!
బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీ చేయనున్న ఆర్థికశాఖ సాక్షి, హైదరాబాద్: పింఛన్ల పంపిణీలో ఏర్పడుతున్న తీవ్ర జాప్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాది కాలానికి సంబంధించిన పింఛన్ల మొత్తానికి ఒకేసారి బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వు(బీఆర్వో)లను జారీ చేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు రేపో మాపో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం మేరకు మే నుంచి ప్రతినెలా పింఛన్లను 10వ తేదీలోగానే పంపిణీ చేసేందుకు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి మార్చి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఏప్రిల్ నెల సగమైపోయినా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీని ప్రారంభించాలంటే, అంతకు ముందు నెలలో కనీసం 20 లోగానే బీఆర్వోలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ, పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో పింఛన్‌దారులకు అవస్థలు తప్పడం లేదు. -
బడ్జెట్ నిధుల విడుదలకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలలకోసారి నాలుగు విడతలుగా నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం నిధుల్లో 25 శాతం ఏప్రిల్‌లో, రెండో విడతలో మరో 25 శాతం నిధులను జూలైలో విడుదల చేయనున్నారు. మూడో విడత నిధులు అక్టోబరులో విడుదల చేయనున్నారు. అయితే మొదటి విడత నిధులు ఆగస్టు నెలాఖరులోగా 90 శాతం ఖర్చు చేస్తేనే మూడో విడత కింద విడుదల చేయనున్నట్లు కొత్త నిబంధన విధించారు. నవంబర్ ఆఖరుకు తొలి రెండు విడతల్లోని నిధులు 90 శాతం వినియోగించిన విభాగాలకు మాత్రమే నాలుగో విడత నిధులు కేటాయించనున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాకే బీఆర్వోలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. గతేడాది కేంద్ర పథకాలకు సంబంధించి వివిధ శాఖలకు విడుదలైన నిధులు వాస్తవ కేటాయింపులకు మించి అదనంగా ఉన్నట్లయితే వాటిని 2016-17 ఆర్థిక సంవత్సరపు రాష్ట్ర కోటాగా పరిగణించి సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల పారితోషికంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను మూడు నెలలకోసారి చెల్లించనున్నట్లు పేర్కొంది.