first notification
-
ఏపీపీఎస్సీ తొలి ప్రకటన
-
ఏపీపీఎస్సీ తొలి ప్రకటన
♦ 748 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ ♦ ఆన్లైన్లో నియామక ప్రక్రియ ♦ ఫీజు చెల్లింపు, దరఖాస్తులకు గడువు సెప్టెంబర్ 21 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని 748 ఇంజనీరింగ్ సర్వీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామక ప్రక్రియను ఆన్లైన్ లో చేపట్టనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు, దరఖాస్తులకు గడువు సెప్టెంబర్ 21. గడువు చివరి రోజు రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్లైన్లో ఫీజులు, దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ముందుగా తమ బయోడేటా, ఇతర సమాచారాన్ని ఒన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(ఓటీపీఆర్) ద్వారా అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. అనంతరం అభ్యర్థుల మొబైల్ నంబరు, ఈ మెయిల్‌కు యూజర్ ఐడీ అందుతుంది. ఈ యూజర్ ఐడీ ద్వారా ఆయా పోస్టులకు కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష నవంబర్ 3-5 తేదీల మధ్య జరిగే అవకాశముంది. పరీక్షకు వారం ముందు హాల్ టిక్కెట్లను జారీచేస్తారు. 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు వారు ఈ పోస్టులకు అర్హులు. పోస్టులు, ప్రభుత్వ సడలింపులు అనుసరించి వయోపరిమితిలో మార్పులున్నాయి. ఆయా పోస్టులకు అర్హతలు, సిలబస్ తదితరాలను నోటిఫికేషన్లో సవివరంగా పొందుపరిచారు. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, తెల్లకార్డు ఉన్న ఏపీ అభ్యర్థులు, 18-40 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగులకు రూ.120 పరీక్ష ఫీజు నుంచి మినహాయించారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు(దివ్యాంగులు, మాజీ సైనికులు మినహా) ఈ మినహాయింపు వర్తించదు. ఫీజులను నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, లేదా ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఆన్లైన్లోనే చెల్లించాలి. పరీక్ష విధానంపై అవగాహనకు మాక్ టెస్టులు ఈ పోస్టులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.ఈ విధానంపై అభ్యర్థులు అవగాహన, తర్ఫీదు పొందేందుకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ మెయిన్ పేజీలో ‘మాక్ టెస్టు’లను అందుబాటులో ఉంచుతున్నారు. నాలుగు జోన్లే.. ఈ పోస్టులకు వయోపరిమితి 18-34 ఏళ్లు కాగా ప్రభుత్వం ఆరేళ్లు పెంచడంతో 40 ఏళ్ల లోపు వారూ అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, ఎన్సీసీ, మాజీ సైనికుల తదితర కేటగిరీల వారీ వయోపరిమితి మినహాయిం పులను నోటిఫికేషన్లో పొందుపర్చారు. స్థానిక కోటాకు సంబంధించి అభ్యర్థులు నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ, ఎస్సెస్సీ ధ్రువపత్రాలు పొందుపర్చాలి. స్కూలులో చదవని అభ్యర్థులు సంబంధిత అధికారి ఇచ్చిన సర్టిఫికెట్లు సమర్పించాలి. రాష్ట్ర విభజన జరిగినందున 13 జిల్లాల ఏపీని నాలుగు జోన్లుగా పేర్కొన్నారు. ఒకటో జోన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రెండు లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృ ష్ణా, మూడులో గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, నాలుగో జోన్లో చిత్తూ రు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలను చేర్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలను ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఏర్పాటుచేయనున్నారు. అభ్యర్థులు ప్రాధాన్యతలు అనుసరించి మూడు కేంద్రాలను ఎంపికచేసుకోవచ్చు. కేంద్రాల కేటాయింపు అధికారం కమిషన్‌దే. -
ఉద్యోగాల గంట మోగింది
-
ఉద్యోగాల గంట మోగింది
► 770 సివిల్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్ ► వచ్చే నెల 20న ఆన్లైన్ పరీక్ష, ►25న ఫలితాలు, మెరిట్ జాబితాలు ► 3,783 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం ►నెలాఖరులో మెకానికల్ ఇంజనీర్ పోస్టులకు ►వచ్చే నెలలో వ్యవసాయ, రవాణాశాఖల్లో.. ►అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్లో గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ►వీటికి నెలాఖరులోగా పూర్తిస్థాయి సిలబస్ ►టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) తొలి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ శాఖల్లో 770 సివిల్ ఇంజనీర్ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పోస్టుల భర్తీ కోసం బుధవారం దీనిని జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీలోగా వీటికి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 20న రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్ www.tspsc.gov.in లో పొందవచ్చు. ఇక మరిన్ని శాఖల్లో పలు పోస్టులకు ఈ నెలాఖరులోగా, అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్లో గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్‌తో కలసి చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ వివరాలను వెల్లడించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంతో మంది ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను అక్టోబర్‌లో జారీ చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను డిసెంబర్ నాటికి జారీచేస్తామన్నారు. వివిధ శాఖల నుంచి రోస్టర్, రిజర్వేషన్ల వివరాలు రాగానే మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. మొత్తంగా కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సిన 3,783 పోస్టులకు డిసెంబర్ నాటికి జారీ చేస్తామని తెలిపారు. చక్రపాణి వెల్లడించిన మరిన్ని అంశాలు ‘‘గ్రూప్ పోస్టులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ తదితర కేటగిరీల పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపకల్పన జరుగుతోంది. దీనిని ఈ నెలాఖరులోగా వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తాం. 400కుపైగా గ్రూప్-2 పోస్టులకు అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. నవంబర్ లేదా డిసెంబర్లో రాతపరీక్ష నిర్వహిస్తాం. గ్రూప్-1 పోస్టులు ప్రస్తుతం 53 ఉన్నాయి. అందులో కొన్ని క్లియర్‌గా లేవు. డిసెంబర్లో వాటికి నోటిఫికేషన్ జారీచేస్తాం. కొత్త సిలబస్‌పై సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో గడువు ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నాం. దాంతోపాటు అప్పటిలోగా ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చి, మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రూప్-2లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ఏడాదికి గ్రూప్-2 ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. తెలంగాణలో అన్నింటికి బయోమెట్రిక్ విధానం అమలుచేస్తాం. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా చర్యలు చేపడుతున్నాం. గ్రూప్-1, 2లలో మాత్రం ఆన్లైన్ పరీక్ష ఉండదు. మిగతా వాటిల్లో అవసరమైన మేరకు, ఆన్లైన్ పరిజ్ఞానం అవసరమున్న పోస్టులకు ఆన్లైన్ పరీక్షలు పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. రవాణా శాఖలో ఏఎంవీఐలు పనిచేయాల్సింది కంప్యూటర్‌పైనే. కాబట్టి ఆ పోస్టులకు ఆన్లైన్ పరీక్షలే ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన పోస్టుల్లో దరఖాస్తుదారులు 30 వేలు దాటితే ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ నిర్వహిస్తాం. ముస్లిం రిజర్వేషన్ 4 శాతం అమలులో ఉంటుంది..’’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చక్రపాణి వెల్లడించారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని, వివాదాలకు చోటు లేకుండా చూస్తామని చెప్పారు. అభ్యర్థులు నమ్మకంతో ఉండాలని, ఉమ్మడి రాష్ట్రంలోని కమిషన్‌తో పోల్చవద్దని.. తమ పనితీరు చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ============ తొలి నోటిఫికేషన్ (సివిల్ ఇంజనీర్) పోస్టులు.. విభాగం పోస్టులు ఆర్డబ్ల్యూఎస్ 418 పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ 121 మున్సిపల్ , పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ 5 రోడ్లు భవనాల శాఖలో 83 నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో 143 మొత్తం 770 --------- - ఈ పోస్టులకు సివిల్ విభాగంలో బీటెక్/బీఈ చేసిన వారు అర్హులు. ఈ ఏడాది జూలై 1 నాటికి 44 ఏళ్లలోపు వయస్సు ఉండాలి (రిజర్వేషన్ మినహా). వేతన స్కేలు రూ.37,100-91,450. వచ్చే నెల 3వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 20న రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో (www.tspsc.gov.in) అందుబాటులో ఉంచిన నోటిఫికేషన్లో పొందవచ్చు. - 450 మార్కులకు ఆన్లైన్ పరీక్ష, 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయి. వచ్చే నెల 25వ తేదీ నాటికి ఫలితాలు, మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. తరువాత ఇంటర్వ్యూలు ఉంటాయి. - హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో రాతపరీక్ష నిర్వహిస్తారు. 40 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే అవకాశం. - కమిషన్ చేపట్టిన ప్రత్యేక విధానం వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో ఇప్పటికే 2.62 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రస్తుత పోస్టులకు అర్హులైన వారు 10వేల మంది వరకు ఉన్నారు. వీరంతా మూడు నిమిషాలు కేటాయించి వ్యాలిడేట్ చేస్తే చాలు. దరఖాస్తు చేసినట్లే. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓటీఆర్ చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. -
టీఎస్పీఎస్సీ తొలి ఉద్యోగ ప్రకటన నేడు
-
వచ్చే వారమే టీపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్
-
వచ్చే వారమే టీపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్
- వివిధ శాఖల్లో 1,998 ఇంజనీర్ పోస్టుల భర్తీ - త్వరలోనే మిగతా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు - కమిషన్ సమావేశంలో నిర్ణయం! - గ్రూప్స్ సిలబస్‌పైనా విస్తృత స్థాయిలో కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ వచ్చే వారమే జారీ కానుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. శుక్రవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి (ఐ అండ్ క్యాడ్), పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని పోస్టులను ఇంజనీరింగ్ సివిల్ అర్హతతో, కొన్నింటిని సివిల్ లేదా మెకానికల్ అర్హతలతో, మరికొన్నింటిని ఏఎంఐఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, డిప్లొమా అర్హతలతో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇండెంట్లు, రోస్టర్ కమ్ రిజర్వేషన్, అర్హతల వివరాలను టీఎస్పీఎస్సీ ఆయా శాఖల నుంచి తెప్పించుకుంది. నాలుగైదు రోజులపాటు కసరత్తు చేసి పరీక్షల విధానం, పూర్తిస్థాయి సిలబస్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. వీటన్నింటిపై మరోసారి పరిశీలన జరిపి వచ్చే వారంలో (20వ తేదీలోగా) నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో రెండు కేటగిరీలకు చెందిన 1,998 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనంతరం వివిధ కేటగిరీల్లోని చిన్న చిన్న పోస్టులు, పదోతరగతి, ఇంటర్, ఐటీఐ వంటి అర్హతలతో ఉండే ఇతర పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీచేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అలాగే గ్రూప్-1, 2, 3 పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి సిలబస్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిని త్వరలోనే పూర్తిచేసి, ఈ సిలబస్ ప్రకారం విద్యార్థులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా (ప్రిపేర్ అయ్యేలా) అవకాశం కల్పించనుంది. ఈ లెక్కన అక్టోబర్ నాటికి గ్రూప్-2, డిసెంబర్ నాటికి గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశముంది. అప్పటిలోగా కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తే... ఆయా కేటగిరీల్లో వచ్చే పోస్టులతో పాటు ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులను కలిపి భర్తీ చేయనున్నారు.