fisherman families
-
ఐదేళ్ళ లో అంచెలంచెలుగా ఎదిగిన మత్స్యకారులు
-
మత్స్యకారులను ఆదుకుంటున్నాం.. 'అండగా ఉన్నాం'
మనకన్నా ముందు చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు పాలన చేసినా కూడా కనీసం జీఎస్పీసీ పరిహారం ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలోచన కూడా చేయలేకపోయింది. ఈ డబ్బులు పడకపోతే ఆ మత్స్యకార కుటుంబాలు ఏ రకంగా బతకగలుగుతాయి? వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ఆలోచన కూడా గతంలో జరగలేదు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుంది. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. అడుగడుగునా వారికి అండగా నిలిచాం. ఈ నాలుగున్నర ఏళ్లలో వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఎన్నో చేశాం.. మరెన్నో చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఓఎన్జీసీ సంస్థ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ. 11,500 వంతున 6 నెలలకుగానూ రూ. 69 వేల చొప్పున రూ. 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఆర్థిక సాయం పంపిణీ ఆగకూడదనే.. ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపు కోవాలని అనుకున్నాం. వర్షాల వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. అయితే మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారంలో పూడిక తీసి పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. వీలును బట్టి ఈ కార్యక్రమాన్ని నెలాఖరులోనో లేదా వచ్చే నెలలోనో చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పించాలన్న మనసు ఉండాలి కదా కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 2012లో జీఎస్పీసీ ఇదే రకమైన కార్యక్రమం చేయడం వలన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగింది. రూ. 78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు తొలుత ప్రభుత్వం నుంచి మనమే ఇచ్చేశాం. ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ డబ్బును వెనక్కి రప్పించుకోగలిగాం. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుందనడానికి జీఎస్పీసీ పరిహారం చెల్లింపు ఉదంతమే నిదర్శనం. ఇవాళ కూడా ఉభయగోదావరి జిల్లాల్లో ఓఎన్జీసీ పైప్‌లైన్ పనుల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. క్రమం తప్పకుండా ఏటా నష్టపరిహారం వచ్చేటట్టుగా అడుగులు వేస్తున్నాం. వేగంగా స్పందించడంలో విశాఖ హార్బర్ ఘటనే ఉదాహరణ ఇవాళ మత్స్యకారుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో? ఎంత వేగంగా స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందో చెప్పడానికి నిన్న విశాఖపట్నం హార్బర్ ప్రమాద ఘటనే ఉదాహరణ. 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వచ్చిన మరుక్షణమే వాళ్లను ఆదుకోవాలని తపన, తాపత్రయం పడ్డాం. వాటికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అని విచారణ చేశాం. ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదని.. వాళ్లకు మేలు చేయాలని సంకల్పించాం. ప్రతి బోటు విలువ లెక్కగట్టమని చెప్పాం. ఆ బోటుకు సంబంధించి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేశాం. ఆ చెక్కులు ఈరోజే (మంగళవారం) పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. ఓఎన్జీసీ పైప్‌లైన్ బాధిత మత్స్యకారులకు నాలుగో విడత పరిహారం పంపిణీలో సహకరించిన, తోడుగా ఉన్న ఓఎన్జీసీ అధికారులకు మనస్ఫూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాలుగు విడతల్లో రూ. 485.58 కోట్ల పరిహారం ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం కోసం జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7,050 మంది కలిపి ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. నెలకు రూ. 11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడి, వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మత్స్యకారుల తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 విడతల్లో ఇప్పటికే రూ. 323.72 కోట్ల నష్టపరిహారం ఇప్పించాం. ఈ రోజు 4వ విడతగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 6 నెలలకు సంబంధించి రూ. 161.86 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోంది. నాలుగో విడతలో ఇవాళ మనం ఇస్తున్న రూ. 161.86 కోట్లు కలుపుకొంటే మొత్తంగా రూ. 485.58 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం. దశాబ్దాల కల కార్యరూపం దాల్చుతోంది పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం పునరుద్ధరణ అనేది ఈ ప్రాంత మత్స్యకారుల దశాబ్దాల కల. ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. మీ దయతో అది జరుగుతోంది. లోకేశ్ ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేవు. కానీ మీరు వస్తున్నారనడంతో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. సీఎం గారు మీకు ధన్యవాదాలు. – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే మా జీవితాల్లో వెలుగులొచ్చాయి ఈరోజు మాకు పండుగ రోజు. నష్టపరిహారం డబ్బులు వస్తాయా? రావా? అనుకున్నాం కానీ, ఈ ప్రభుత్వం వచ్చాక వరుస గా నాలుగో విడత అందుకుంటున్నాం. పరిహారం నేరుగా మా అకౌంట్లో వేస్తున్నారు. మీరు దేవుడిలా మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు డీజిల్ సబ్సిడీ రూ.9 వస్తోంది. ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారులకు బీమా కింద గతంలో మృతదేహం కనిపిస్తేనే రూ.5 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు మృతదేహంతో సంబంధం లేకుండా రూ. 10 లక్షలు ఖాతాలో జమచేస్తున్నారు. మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మేం గతంలో ఇలా లబ్ధిపొందలేదు. – చినబోతు భైరవస్వామి, లబ్ధిదారుడు, మట్లపాలెం, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా మమ్మల్ని గుర్తించింది మీరే.. మమ్మల్ని గుర్తించింది మీరే అన్నా. గతంలో మత్స్యకారులు ఎక్కడున్నారో తెలిసేది కాదు. వైఎస్సార్ హయాంలో మాకు ఎంతో లబ్ధి జరిగింది. తర్వాత మమ్మల్ని ఆదుకున్న వాళ్లు లేరు. మీరు పాదయాత్రలో మాట ఇచ్చారు. సీఎం అవగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. మీరు మాకు పరిహారం ఇప్పిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం చేస్తున్నారు. డీజిల్ మీద సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా ఇలా చాలా సాయం చేస్తున్నారు. మాకు తెలియని పథకాలు కూడా పెట్టి మమ్మల్ని ఆదుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీకు రుణపడి ఉంటామన్నా. – పల్లెపు రాంబాబు, ముమ్మిడివరం మండలం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
మా కష్టాల కంటే మత్స్యకారుల కష్టాలే పెద్దవి
ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండింగ్ కేంద్రానికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు కానుంది. మూడేళ్లలో ఈ తొమ్మిదింటి నిర్మాణం పూర్తి చేసి.. ఎన్నికలకు వెళ్తాం. మొన్న పాకిస్థాన్ నుంచి, నిన్న గుజరాత్ నుంచి చిక్కుకుపోయిన వారిని రప్పించాం. మత్స్యకారులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలు శాశ్వత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: కరోనాతో పోరాడుతున్న సమయంలో మా కష్టాల కంటే మత్స్యకారుల కష్టాలే పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 1,09,231 మత్స్యకార కుటుంబాలకు పది వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార సోదరులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. దాదాపు 6 నెలల ముందుగానే.. ► కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే.. మనకున్న కష్టాలకన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నాం. ► గతంలో చేపల వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4 వేలు ఇచ్చేవారు. అది కూడా అందరికీ ఇచ్చే వారు కాదు. ప్రతి మత్స్యకారుడిలో వెలుగులు కనిపించని పరిస్థితి ఉండేది. వారి బతుకులు మారాలని ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. ► గతేడాది మే 30న అధికారంలోకి వచ్చాం. అప్పటికే వేట నిషేధ సమయం ముగియడంతో ఆర్థిక సహాయం చేయకపోయినా పర్వాలేదన్న సలహాలు వచ్చాయి. అయినా గతేడాది నవంబర్‌లో మత్స్యకార దినోత్సవం రోజున ‘మత్స్యకార భరోసా’కు శ్రీకారం చుట్టాం. ముమ్మడివరంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. తమ ఖాతాల్లో రూ.10,000 జమ అయ్యాయంటూ ఫోన్లలో వచ్చిన మెసేజ్‌లు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రకాశం జిల్లా కొత్తపట్నం మత్స్యకారులు ఆ డబ్బు ఇప్పటికీ ప్రభుత్వానికి రాలేదు ► అప్పట్లో నేను అదే (ముమ్మడివరం) నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మత్స్యకారులు వారి బాధలు చెప్పుకున్నారు. గతంలో జీఎస్పీసీ డ్రిల్లింగ్ వల్ల 13 నెలలు ఉపాధి లేక నష్టపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదని చెప్పారు. వారికిచ్చిన మాట ప్రకారం గత నవంబర్‌లో రూ.70.53 కోట్లు వారికి పరిహారం చెల్లించాం. ఇప్పటికీ ఆ డబ్బు రాలేదు. ► ఆ డబ్బు కోసం ఎదురు చూడకుండా ఈలోగా మనం చేయాల్సిన మేలు చేశాం. మత్స్యకారులకు మంచి జరగాలన్న ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం. మొన్న పాకిస్తాన్, నిన్న గుజరాత్ నుంచి రప్పించాం ► పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారని, మన వాళ్లను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పాదయాత్రలో నాకు చెప్పారు. మనం అధికారంలోకి వచ్చాక మన ఎంపీ లతో ఒత్తిడి తీసుకువచ్చి వారిని విడుదల చేయించాం. ► వారు జీవనం కొనసాగించడానికి వీలుగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాం. ఇలా ప్రతి విషయంలో కూడా మత్స్యకారులకు మంచి చేయడానికి ప్రయత్నాలు చేశాం. ► మొన్న కరోనా కారణంగా గుజరాత్లో 4,500 మందికి పైగా మత్స్యకారులు చిక్కుకుపోతే, వారి ఇబ్బందులు తెలిసిన వెంటనే స్పందించాం. వారికి తోడుగా ఉండడానికి గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రులతో మాట్లాడి.. రూ.3 కోట్ల మేర ఖర్చు చేసి, వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చాం. వారందరికీ పరీక్షలు చేసి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశాం. ► ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటపై ఉండే నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ ఇచ్చే వారు కాదు. ఇచ్చినా అరకొరగా ఇచ్చే వారు. అది కూడా అందరికీ ఇచ్చే వారు కాదు. కరోనా కష్టాలు ఉన్నా కూడా, ఇవాళ మనం 1,09,231 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం. డీజిల్ సబ్సిడీ ► డీజిల్ సబ్సిడీ ఎప్పు డు వస్తుందో తెలియ దని మత్స్యకారులు నా పాద యాత్రలో చెప్పారు. దీంతో డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచాం. డీజిల్ పట్టుకున్నప్పుడే సబ్సిడీ వచ్చేలా చేశాం. ► మెకనైజ్డ్ బోట్‌కు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్ బోటుకు నెలకు 300 లీటర్లు ఇస్తున్నాం. ► మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే ఇచ్చే పరిహారం రూ.5 లక్షలు సరిపోదని.. రూ.10 లక్షలు ఇస్తున్నాం. దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం. శాశ్వత చర్యలు ► మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని, గుజరాత్ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని.. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మంత్రి మోపిదేవి ఎంతో కృషి చేసి పలు నిర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు కట్టబోతున్నాం. ► గుజరాత్‌కు వలస పోవడమన్నది దశాబ్దాలుగా జరుగుతోంది. ఇకపై మత్స్యకారుల జీవితంలో మార్పు రావాలని, శాశ్వతంగా మంచి చేయాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ► గత ప్రభుత్వంలో మూడు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల కోసం కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ► ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, మత్స్యకారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గంగమ్మ తల్లి తర్వాత మీరే.. గత ప్రభుత్వ హయాంలో వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బు అరకొరగా కొందరికే ఇచ్చే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. వైఎస్సార్ దూరం అయ్యాక మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారులను మరిచిపోయింది. ఇప్పుడు అందరికీ సంతృప్తికర స్థాయిలో అన్నీ వస్తున్నాయి. గంగమ్మతల్లి తర్వాత మీరే మాకు దేవుడిలా నిల్చారు. – ధనరాజ్, నెల్లూరు జిల్లా ఈ రీతిలో ఎవరూ మమ్మల్ని ఆదుకోలేదు మాకు గతంలో ఎప్పుడూ సరైన సమయానికి సహాయం అందలేదు. మీరు వచ్చాక పార్టీ అని చూడకుండా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. నేను 1977 నాటి తుపాన్‌ను చూశాను. అప్పటి నుంచి చేపల వేటపైనే ఆధారపడ్డాను. ఏనాడూ ఏ ప్రభుత్వం కూడా ఈ రీతిలో మమ్మల్ని ఆదుకోలేదు. రాజకీయంగా కూడా మా వాళ్లకు గుర్తింపునిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంను కచ్చితంగా అమలు చేయండి. – బలగం వీరరాఘవయ్య, కృష్ణా జిల్లా -
ఎన్నాళ్లుగా ఎదురు చూసినా...
సాక్షి, విజయనగరం : సముద్రంలో వేటంటేనే ప్రాణాలతో చెలగాటం. అయినా బతుకు తెరువుకోసం దానిని వదులుకోవడం లేదు. ఉన్న ఊళ్లో అవకాశాలు లేకున్నా... అదే వృత్తిని వెదుక్కుంటూ వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారు. అక్కడి నుంచి గమ్యం లేని వారి ప్రయాణంలో చిక్కులు ఎదురవుతున్నాయి. విదేశీ జలాల్లోకి ప్రవేశించి... అక్కడివారి బందీలుగా మారాల్సి వస్తోంది. రెండేళ్లలో శ్రీలంక... పాక్... బంగ్లా... దేశ రక్షక దళాల బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారులు ఇప్పటికీ స్వగ్రామం చేరలేక నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 22 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో వివిధ కారణాలవల్ల సుమారు 2 వేల మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికే వలస వెళ్లారు. తీరప్రాంత గ్రామాల్లో పనిచేయలేని వారు, వృద్ధాప్యంలో వున్న వారు మాత్రమే గ్రామాల్లో వున్నారు. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి, పతివాడ బర్రిపేట, కోనాడ, భోగాపురం మండలంలో ముక్కాం, చేపలు కంచేరు, కొండ్రాజుపాలెం తదితర గ్రామాలు నుంచి వలసలు ఎక్కువగా వున్నాయి. వీరిలో అత్యధికంగా విశాఖపట్నం, మంగమారిపేట, గుజరాత్‌లోని సూరత్, వీరావల్ ప్రాంతాల్లో దినసరి వేట కూలీలుగా చేరుతున్నారు. ఇక్కడి తీర ప్రాంతాలు కాలుష్యంతో మత్స్య సంపద కాస్తా కనుమరుగైపోవడంతో వలసలు వీరికి తప్పడం లేదు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామం నుంచే సుమారు వెయ్యిమంది వరకు మత్స్యకారులు వలస పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా ఎంతోమంది బోటు ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది విదేశీ రక్షకదళాలకు చిక్కి అక్కడ బందీలవుతున్నారు. గతేడాది పాక్... నేడు బంగ్లా... గతేడాది నవంబర్ 8వ తేదీన పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్క నరిసింగు, నక్క ధనరాజు, భోగాపురం మండలం ముక్కాంనకు చెందిన మైలపల్లి గురువులు వీరావల్ నుంచి వేటకు బయలుదేరి పాక్ జలాల్లో పొరపాటున ప్రవేశిం చి అక్కడి రక్షణ దళాలకు బందీలుగా చిక్కారు. తాజాగా అక్టోబర్ 2వ తేదీన అదే గ్రామానికి చెందిన మారుపల్లి నరిసింహులు, వాసుపల్లి అప్పన్న, బర్రి రాము, వాసుపల్లి కాములు, రాయితి రాము, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న బంగ్లాదేశ్ సముద్రజలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడ బందీలుగా చిక్కారు. పాక్ అదుపులో వున్న ఐదుగురు మ త్స్యకారుల కుటుంబాలు తమవారి కోసం సు మారు 11 నెలలుగా ఎదురుచూస్తున్నా ఫలితంలేకపోయింది. ఇప్పుడు ఎనిమిది మంది మళ్లీ బంగ్లాలో చిక్కుకున్నారు. వీరి క్షేమసమాచారం కూడా తమకు తెలియడం లేదనీ, విడుదలకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. -
కన్నీటి బతుకులకు ఊరట
సాక్షి, శ్రీకాకుళం : ఏడు నెలలు గడిచాయి.. అయినా వారికి న్యాయం జరగలేదు. ఇంటి యజమానులు పాకిస్థాన్ చెరలో ఉన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలకు చదువులు లేవు. వృద్ధులకు, మహిళలకు ఆసరా కరువు. అసలు తమవారు తిరిగొస్తారో లేదోనన్న ఆవేదన. ప్రభుత్వం తమ మొర ఆలకిస్తుందో లేదోనన్న ఆందోళన. అర్ధ సంవత్సరం దాటినా పాత ప్రభుత్వం పట్టించుకోలేదు.. కొత్త సర్కారైనా మొర వింటుందన్న ఆశతో ‘స్పందన’కు హాజరయ్యారు.. తమ కన్నీళ్లను కాగితంపై పెట్టి కలెక్టర్‌కు అందించారు. ఆశ్చర్యం.. నాలుగు రోజుల్లోనే అధికారులు స్పందించారు. నెలకు రూ.4,500 వంతున ఏడు నెలలకు రావాల్సిన పింఛన్ మొత్తం రూ.31,500 ఒకేసారి అందించారు. ఇలా బాధిత 12 కుటుంబాల వారికి సాయం అందింది. పాకిస్థాన్ చెర నుంచి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను విడిపించడానికి కేంద్ర ప్రభుతానికి లేఖ రాశామని కలెక్టర్ నివాస్ తెలిపారు. గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఎచ్చెర్ల మండలంలోని కె.మత్స్యలేశం, డి.మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ తదితర గ్రామాలకు చెందిన 12 కుటుంబాలలోని 15 మంది మత్స్యకారులు పాకిస్థానీ సైనికులకు చిక్కారు. వీరిలో ముగ్గురు బోటు డ్రైవర్లు కాగా మిగిలిన వారు కళాసీలుగా పనిచేసేవారు. వారిని విడిపించేందుకు గత ప్రభుత్వం చొరవ చూపలేదు. బాధితులు అప్పటి నాయకులకు ఆశ్రయించినా కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. కనీసం పింఛను కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీవెన్స్ సెల్‌ను చిత్తశుద్ధితో నిర్వహించాలని, తక్షణం స్పందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో వారిలో చిన్న ఆశ కలిగింది. ఈనెల ఒకటో తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమానికి హాజరై పాకిస్థాన్ చెరలో ఉన్న వారిని విడిపించాలని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. దీనికి వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు శుక్రవారం బాధిత కుటుంబాలకు పింఛను అందజేశారు. 12 మత్య్సకార కుటుంబాలకు చెక్కుల పంపిణీ పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నెలవారీ పింఛన్ల చెక్కులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మత్స్యకార కుటుంబాలకు నెలకు రూ.4,500ల వంతున రాష్ట్ర ప్రభుత్వం పింఛనును ప్రకటించింది. అందులో భాగంగా 7 నెలలకు రూ. 31,500 వంతున 12 కుటుంబాలకు రూ.3,78,000ల విలువ గల చెక్కులను అందించారు. ప్రభుత్వం నుంచి పింఛను సొమ్ము రావడంలో జాప్యం కావడంతో జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులను జిల్లా కలెక్టర్ సర్దుబాటు చేశారు. చెక్కులు అందుకున్న వారిలో వాసుపల్లి శామ్యూల్, కేసము యర్రయ్య, బాడి అప్పన్న, సూరాడ అప్పారావు, కోనాడ వెంకటేష్, దుండంగి సూర్యనారాయణ, కేసము రాజు, గనగళ్ల రామారావు, చీకటి గురుమూర్తి, మైలపల్లి సన్యాసిరావు, పెంట మణి, షకియా సుమంత్‌ల కుటుంబాలు ఉన్నాయి. వారితోపాటు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు వీవీ కష్ణమూర్తి, సంఘ నాయకులు మూగి శ్రీరాములు, వారది యర్రయ్య, మైలపల్లి పోలీసు, మూగి గురుమూర్తి, చింతపల్లి సూర్యనారాయణ, సూరాడ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుతానికి లేఖ: కలెక్టర్ నివాస్ పాకిస్థాన్ చెరలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకారుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని కలెక్టర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న మత్స్యకారుల విడుదలకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ‘స్పందన’ కార్యక్రమంలో అందిన అర్జీ ఆధారంగా మత్స్యకారుల కుటుంబాలకు పింఛన్లు వెంటనే చెల్లించామని కలెక్టర్ తెలిపారు. మత్య్సకారులుకు వలలు, ఇతర వసతులు కల్పించి కుటుంబాలను ఆదుకొంటామని తెలిపారు. నా కుటుంబం నుంచి ముగ్గురు.. పాకిస్థాన్ చెరలో మా కుటుంబం నుంచి ముగ్గురు బందీలుగా ఉన్నారు. వారు లేక పూర్తిగా మా కుటుంబం రోడ్డున పడింది. ఏడు నెలలు గడిచాయి. పలుసార్లు అధికారులను, నాయకులను కలసి మా గోడు వినిపించుకొన్నాం. అయినా పరిష్కారం లేదు. భర్త, పిల్లలు లేక దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాను. –సూరాడ ముగతమ్మ ఉత్తరాలు కూడా రావడం లేదు పాకిస్థాన్ చెరలో చిక్కిన తరువాత కొన్ని నెలలు ఉత్తరాలు వచ్చేవి. ఇటీవల వారి నుంచి సమాచారం కూడా కరువైయింది. వారి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తెలుస్తోంది. వారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. వారు లేక మేం ఇక్కడ నిరాశ్రయులుగా మారాం. ప్రభుత్వం ఆదుకోవాలి. –గనగళ్ల నూకమ్మ -
వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తాం..
సాక్షి, నల్లగొండ : మత్స్యకారుల కుటుంబాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం జిల్లాలోని డిండిలో సమావేశమయ్యారు. అంతేకాక చేపల పెంపకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులవృత్తులు గ్రామాల్లో సంతోషంగా జీవిస్తారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అందరికి ప్రోత్సహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం విజయవంతం అయిందని తెలిపారు. వచ్చే వానకాలంలో మళ్ళీ గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలుపెడుతామని మంత్రి చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యారు. వొచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ వారు పుట్టగతులు లేకుండా పోతారని జోస్యం మంత్రి తలసాని జోస్యం చెప్పారు. -
వేదనాంధకారంలో వేగుచుక్కలా..కలతలో కంటిరెప్పలా..
♦ జిల్లాలో రెండోరోజు సాగిన జగన్ పర్యటన ♦ బాధిత మత్స్యకార, గిరిజన కుటుంబాలకు ఓదార్పు ♦ పార్టీ తరఫున ఆదుకుంటామని అభయం ♦ ఆయనపై అడుగడుగునా ఉప్పొంగిన అభిమానం కల్లోలితమైన కడలికి బలైన మత్స్యకారుల కుటుంబాల్లో కన్నీటి సంద్రాలే ఎగసిపడుతున్న వేళ.. పెళ్లి ముచ్చట్లను నెమరేసుకుంటూ వెళుతున్న వారిని వెన్నాడిన మృత్యువు సృష్టించిన విషాదం గుండెల్లో పుండై సలుపుతున్న వేళ.. ఓ ఆత్మీయ స్పర్శ వారికి ఉపశమనమైంది. అరుునవారిని పోగొట్టుకున్న దుఃఖం కుంగదీస్తున్న వేళ ఓ అభయం వారికి భరోసానిచ్చింది. వాయుగుండం వేళ సముద్రంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలను, గతనెల 4న రంపచోడవరం వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ దుర్ఘటనలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధినేత జగన్ అక్కున చేర్చుకుని ఓదార్చారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడుస్తూ..జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ రోజు పర్యటన శుక్రవారం కొనసాగింది. ఉదయం కాకినాడలో నిర్మల్ జైన్ నివాసం నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఏజెన్సీలో పర్యటన ముగిసే వరకు జగన్‌ను పలకరించేందుకు తరలివచ్చిన వారితో దారులు జనయేరులయ్యూరుు. మత్స్యకార ప్రాంతాలైన పర్లోపేట, పగడాలపేట, ఉప్పలంకల్లో మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించేందుకు పోటీ పడ్డారు. అడుగడుగునా ఉప్పొంగిన జనాభిమానానికి అభివందనం చేస్తూ బాధిత కుటుంబాలను జగన్ అక్కున చేర్చుకున్నారు. అలుపెరగని బాటసారిలా ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడా విశ్రమించకుండా బాధిత కుటుంబాలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ఎక్కడికక్కడ వెల్లువెత్తిన జనాభిమానంతో జగన్ రాక ఆలస్యమైనా నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా అభిమాన నేత కోసం దారికిరువైపులా గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాలతోపాటు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ జగన్ పర్యటించారు. ఉదయం కాకినాడలోని నిర్మల్ జైన్ నివాసం నుంచి పర్యటన ప్రారంభమైంది. తొలుత జైన దేవాలయాన్ని జగన్ సందర్శించారు. మార్వాడీలు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇటీవల సముద్రంపై వేటకు వెళ్లి వాయుగుండం ప్రభావంతో మృతిచెందిన తొమ్మిదిమంది మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చారు. పర్లోపేటకు చెందిన కంచుమట్ల వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లేదారిలో అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ అభిమాన నేతను స్వాగతించారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను సాధకబాధకాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. నాగబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాకినాడ రూరల్‌నియోజకవర్గ పరిధిలోని పగడాలపేట, ఉప్పలంక ప్రాంతాల్లో మత్స్యకార బాధిత కుటుంబాల ప్రతి ఇంటికీ వెళ్లి వారిని ఓదార్చారు. జీవనాధారమైన వేటే అయినవాళ్లను దూరం చేసి అనాథల్ని చేసిందంటూ శోకసంద్రంలో మునిగిన బాధితులను అక్కున చేర్చుకుని ఓదార్చారు. సర్కారు మెడలు వంచైనా సాయం అందిస్తాం.. ప్రతి ఇంటి వద్దా జగన్ దాదాపు అరగంట సమయం బాధిత కుటుంబాలతో గడిపి కష్టసుఖాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వాధినేత చంద్రబాబు స్పందించకపోవడాన్ని జగన్ ఎండగట్టారు. గల్లంతైనవారి ఆచూకీ కనుకొనడంలోగానీ, మృతుల కుటుంబాలకు సాయం అందించడంలో అలసత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సాయం అందేలా చేస్తానని, పార్టీ తరఫున అండగా ఉంటానని బాధితులకు భరోసానిచ్చారు. సాయంత్రం ఏజెన్సీ పర్యటనకు బయలుదేరిన జగన్‌ను గ్రామగ్రామాన ప్రజలు ఘనంగా స్వాగతించారు. సామర్లకోట, పెద్దాపురంలలో పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో, జగ్గంపేట, మల్లిసాల వద్ద జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో, ఏజెన్సీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్‌ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. గిరిజనుల ఆదరణకు చలించిన జగన్ పర్యటన సాగిన గ్రామాల పొడవునా జనం జగన్‌ను చూసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకే జగన్ ఏజెన్సీకి వెళ్లాల్సి ఉండగా చేరుకునే సరికి అర్ధరాత్రి 12 అయింది. అయినా గిరిజనులు అభిమానంతో నిరీక్షిస్తూ ఉండిపోయారు. జగన్ కూడా మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏజెన్సీలో రాత్రి పర్యటన క్షేమం కాదని పోలీసులు అన్నా గిరిజనుల అభిమానానికి స్పందించి పర్యటన కొనసాగించారు. ఎదురు చూసిన వారిని పేరుపేరునా పలకరించడం వారిలో ఉత్సాహాన్ని నింపింది. తొలుత కొత్తాడ, సూరంపాలెం గ్రామాల్లో వ్యాన్ బోల్తా దుర్ఘటనలో మరణించిన తొమ్మిది మంది కుటుంబాలను పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, రాజమండ్రి ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రాజు, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, సంగిశెట్టి అశోక్, కర్రి నారాయణరావు, జి.వి.రమణ, వట్టికూటి సూర్యచంద్రశేఖర్, దంగేటి రాంబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, ఎం.ఎస్.రాజు, బొబ్బిలి గోవింద్, లింగం రవి, సంయుక్త కార్యదర్శులు పెంకే వెంకట్రావు, యువజన విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర కన్వీనర్ ఆర్.జె.వి.కుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు కొల్లి నిర్మల కుమారి, రావిపాటి రామచంద్రరావు, శిరిపురపు శ్రీనివాసరావు, డాక్టర్ యనమదల గీతా మురళీకృష్ణ, జున్నూరి వెంకటేశ్వరరావు, పెట్టా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, అల్లి రాజబాబు, రాజమండ్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మానే దొరబాబు, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి జమీల్ తదితరులు జగన్ వెంట ఉతన్నారు. బాబులాంటి దగా నేతను జీవితంలో చూడలేదు నెల్లిపూడి సభలో జగన్ ధ్వజం సాక్షి ప్రతినిధి, రంపచోడవరం : ప్రజల్ని దగా చేసి గద్దెనెక్కిన చంద్రబాబులాంటి నాయకుడిని జీవితంలో ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ధ్వజమెత్తారు. మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచే వారిని దేవుడుపై నుంచి చూస్తూనే ఉన్నాడని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఏజెన్సీలో గంగవరం మండలం నెల్లిపూడిలో వైఎస్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జగన్ శుక్రవారం రాత్రి 12 గంటలకుగిరిజనులనుద్దేశించి మాట్లాడారు. పట్టపగలు దొంగతనం చేసి పట్టుబడ్డా వీడియో ఎందుకు తీశారని ప్రశ్నించడం చంద్రబాబు నైజానికి అద్ధం పడుతుందన్నారు. అధికారంలోకి రాక ముందు అందరికీ ఇళ్లు కట్టిస్తానని నమ్మించిన బాబు అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. విభజన అనంతరం ఖమ్మం నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో విలీనమైన మండలాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గిరిజనుల అవసరాలను తీర్చలేక సర్కారు చేతులెత్తేసిందన్నారు. రంపచోడవరంలో తమ పార్టీని ఆదరించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ అష్టకష్టాల పాలన చేస్తున్నారన్నారు. ఈ కష్టాలు ఎంతోకాలం ఉండవని, రెండేళ్లలో ఈ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ఇక్కడి గిరిజనులు ప్రమాదంలో మృతిచెందితే అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం పలకరించిన పాపానపోలేదని, జగన్ వస్తున్నాడని తెలిసి హడావిడిగా దొంగచాటున రూ.2లక్షల చెక్కులు ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని చంద్రబాబు సెక్యూరిటీ లేకుండా బయట తిరిగితే యువకులు రాళ్లతో కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఇక్కడ వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యేను చేసిన అనంత ఉదయభాస్కర్‌ను పోలీసులు రాజకీయ కుతంత్రాలతో కుట్రలు పన్ని కేసులు పెడుతున్నారని, అదే అనంతబాబుకు పోలీసులతోనే శాల్యూట్ కొట్టించే రోజులు తీసుకువస్తానని అన్నారు. -
ఆవగింజంతైనా శ్రద్ధ లేదు!
అచ్యుతాపురం, న్యూస్‌లైన్: కొండకర్ల ఆవలోని నీటి నిల్వలపై 3 వేల ఎకరాల ఆయకట్టు రైతులు, 200 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆవను అభివృద్ధి చేస్తామని పదేళ్లుగా ప్రజాప్రతినిధులు చెబుతూనే ఉన్నా, కార్యాచరణ లేకపోవడంపై రైతులు, మత్స్యకారులు నిరాశ చెందుతున్నారు. అడుగడుగునా ఆక్రమణలు కొండకర్ల ఆవ 2400 ఎకరాల్లో విస్తరించి వుంది. ఆక్రమణలతో 14వందల ఎకరాలకు కుదించుకుపోయింది. ప్రస్తుతం సర్వే నిర్వహిస్తే వెయ్యి ఎకరాలు కూడా ఉండకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఆవ గర్భంలో సుమారు మూడడుగుల ఎత్తు పూడిక పేరుకు పోయింది. దీంతో గతం కంటే నీటినిల్వలు తగ్గాయి. దీనిపై ఆధారపడి ఎగువ దిగువ ఆయకట్టు రైతులు రబీ, ఖరీఫ్ సాగు చేస్తున్నారు. చీమలాపల్లి, వాడ్రాపల్లిలో రెండు ఎత్తిపోతల పథకాలతో నీటిని వినియోగిస్తున్నారు. సాగునీటి వినియోగం పెరగడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్యకారులు ఆవలో ఏటా రూ.2 లక్షల విలువైన చేప పిల్లలను పెంచుతారు. వర్షాకాలంలో నీరు చేరినప్పుడు చేప పిల్లల్ని వేస్తారు. ఆరునెలల పాటు పర్యాటకుల్ని దోనె షికారు చేయించి ఆదాయం పొందుతారు. ఆ తరువాత చేపల వేట మొదలుపెడతారు. ఆరునెలల పాటు చేపలవేట సాగించి ఉపాధి పొందుతారు. ఆవ పరిసరాల్లో సౌకర్యాలు లేకపోవడం, సరస్సును చేరుకునేందుకు రోడ్డు నిర్మించకపోవడంతో ఏటా పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. హరిపాలెం, కొండకర్ల, వాడ్రాపల్లి గ్రామాలను కలుపుకొంటూ ఆవ చుట్టూ రహదారి, జట్టీలు, సేద దీరడానికి వ్యూపాయింట్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి మత్స్యకారులు ఉపాధి పొందే అవకాశం ఉంది. గత ఏడాది ఆవ అభివృద్ధికి రూ.16 కోట్లతో అధికారులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అభివృద్ధి చేయకపోవడంతో మత్స్యకారులకు మొదటి ఆరునెలల ఆదాయానికి గండి పడింది. నీటినిల్వలు తగ్గుముఖం పట్టగానే వేట మొదలు పెడతారు. ఫిబ్రవరి నెల నుంచి జూలై నెల వరకూ వేట సాగిస్తారు. రబీ సాగుకు రైతులు ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించడంతో మూడు నెలల్లోనే నీటి నిల్వలు తగ్గిపోతాయి. చేపలవేట సాగించే మత్స్యకారులకు నియమ నిబంధనలుండవు. ఎవరికి వారు తమకి దొరికినన్ని చేపల్ని పట్టుకోవచ్చు. నీటినిల్వలు తగ్గిపోవడంతో చేపల వేట జోరుగా సాగుతుంది. మూడు నెలల్లోనే చేపలవేట ముగిసిపోతుంది. ఈ సమయంలో ఎక్కువ సంఖ్యలో చేపల్ని మార్కెట్‌కి తరలించడం వల్ల గిట్టుబాటు ధర రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.