క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఐదుగురు ఎంపిక
జేఎన్టీయూ : అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్‌బాబు తెలిపారు. అమెరికన్ స్టాఫింగ్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించిందని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అనంతరాముడు, డైరెక్టర్ ఎం.రమేష్ నాయుడు అభినందనలు తెలిపారు.