హంతకులను పట్టుకునేందుకు ఐదు బృందాలు
పార్వతీపురం టౌన్: పట్టణంలో సంచలనం సృష్టిం చిన సుమిత్రా కలెక్షన్స్ వ్యాపార భాగస్వామి పట్నాన మురళీకృష్ణ హత్య కేసు విషయంలో హంతకులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పా టు చేసినట్టు ఎస్పీ పాలరాజు చెప్పా రు. హత్యకు సంబంధించి దర్యాప్తును పరిశీలించేందుకు ఆయన ఆదివారం ఇక్కడకు వచ్చారు. హత్యకు సంబం ధించిన ఆధారాలను, ఇరుగుపొరుగు వారు అందించిన సమాచారం తెలుసుకున్నారు. అనంతరం ఏఎస్పీ బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. మురళీకృష్ణది హత్యేనని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఐదడుగుల దూరంలో నుంచి కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. కాల్పులకు పాల్పడింది ప్రొఫెషనల్ హంతకులని తెలిపారు.
పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి షూట్ చేసేంత నైపుణ్యం కలిగిన హంతకులుగా ఆయన తెలిపారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ లభ్యమైన కోకా(తూటా తొడుగు)ను బట్టి తూటా 7.65 పిస్టల్గా గుర్తించామన్నారు. వీటిని అద్దెకు తెచ్చుకొని ఇటువంటి నేరాలకు పాల్పడతారని చెప్పారు. ఒడిశాలో ఇ టువంటివి జరుగుతుంటాయని హం తకులు అక్కడి నుంచే వచ్చి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. ఆన్సర్వీసు పిస్టల్గా కోకాను బట్టి చెప్పవచ్చన్నా రు. హంతకులిద్దరూ తలకు హెల్మెట్లు ధరించి మాటు వేసి షూట్ చేసినట్టు ప్రాథమిక సమాచారం లభించిందని చెప్పారు. మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టంకు తరలించామని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరింత వేగవంతంగా దర్యాప్తు జరిగే అవకాశం ఉందన్నారు.
పోలీసుల అదుపులో సహ వ్యాపార భాగస్వాములు
ఈ కేసు విషయంతో మురళీకృష్ణకు వ్యాపార భాగస్వాములుగా ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వారం రోజలుగా వీరి మధ్య వ్యాపార లావాదేవీలు తీవ్రంగా చర్చ కు వచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు. మురళీకృష్ణను తమ వ్యాపార లావాదేవీల నుంచి తప్పించి అతనికి ఇవ్వాల్సిన వాటాను(నగదు) ఇచ్చి వ్యాపారం నుంచి తొలగించాలని మిగిలిన వారు నిర్ణయించినట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు.
పోలీసుల అదుపులో ఉన్న వారిలో బీజేపీ జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న కొత్తకోట ప్రసాద్ ఉరఫ్ గుడ్ల ప్రసాద్, బుడంకాయల శ్రీనివాసప్రసాద్, కోరాడ కుమార్రాజు, కొత్తకోట సాయిష్ ఉన్నా రు. వీరిని విచారిస్తున్నారు. వీరి వాణిజ్య సముదాయాలను మూ సివేసి అందులో సీసీ రికార్డింగ్ పుటేజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరి సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆర్థిక లావాదేవీలపై ఆరా..
మురళీకృష్ణ వ్యాపార భాగస్వాముల గత చరిత్రను, వారి ఆర్థిక లా వాదేవీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు ఎస్పీ పాలరాజు తెలిపారు. వీరిలో కొంతమంది ఫేక్ కరెన్సీ నోట్లు చెలామణి చేసినట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు.
ఐదు బృందాలు..
హంతకులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఆర్థిక లావాదేవీల పరంగా విచారించడానికి ఒక బృందం, టెక్నికల్‌గా విచారించడానికి ఒక బృందం, ట్రెడిషనల్ సెర్చింగ్‌లో భాగంగా ఒక బృందం, లోకల్ పోలీసులు రెండు బృందాలు విచారణ ప్రారంభించి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.ఆగస్టు –1 నుంచి అన్ని పట్టణాల్లో సీసీ కెమెరాలను ఏపీ ఫైబర్ గ్రిడ్ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పని లేదని ఎస్పీ చెప్పారు. ఆయన వెంట డీఎస్పీలు త్రినాధరావు, సౌమ్యలత, సీసీఎస్ డీఎస్పీ చక్రవర్తి, పార్వతీపురం సీఐ రాంబాబు, ఎస్ఐలు రాజేష్, రమణ ఉన్నారు.