five star
-
క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్సీఏపీ, గ్లోబల్-ఎన్సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.'భారత్-ఎన్సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్డేటెడ్ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు. -
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
-
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి భారతి సిమెంట్ సంస్థకు మరో గౌరవం దక్కింది. తాజాగా ఫైవ్ స్టార్ రేటింగ్ జాతీయ అవార్డు ప్రకటించింది కేంద్రం. గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ భారతి సిమెంట్‌కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2021-22 గనుల నిర్వహణలో 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది వెయ్యికి పైగా గనులు పోటీ పడగా.. అందులో ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకున్నవి కేవలం 40 మాత్రమే కావడం విశేషం. -
5 స్టార్ జస్ట్ మిస్!
సాక్షి, విశాఖపట్నం: చెత్త రహిత నగరాల జాబితాలో కేవలం 16 పాయింట్ల తేడాతో విశాఖ నగరం 5 స్టార్ రేటింగ్ కోల్పోయింది. సవరించిన గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్ జాబితాలో సింగిల్ స్టార్ నుంచి త్రీస్టార్ రేటింగ్ సాధించిన విశాఖ నగరం.. తృటిలో 5 స్టార్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మొత్తం మూడు విభాగాల్లో కలిపి 225 పాయింట్లు రావాల్సి ఉండగా.. విశాఖ నగరం 209 పాయింట్లకే పరిమితమైంది. దీంతో త్రీస్టార్ రేటింగ్‌కే పరిమితమైపోయింది. మాండేటరీ విభాగంలో 85 పాయింట్లకు గాను 84, ఎసెన్షియల్‌లో 80కి 70, డిజైరబుల్ విభాగంలో 60 పాయింట్లు రావాల్సి ఉండగా 55 పాయింట్లు విశాఖ నగరానికి దక్కాయి. దీంతో 5 స్టార్ రేటింగ్ రానప్పటికీ 3 స్టార్ సాధించిన నగరాల జాబితాలో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 72 నగరాలు 3 స్టార్ సాధించగా.. విశాఖ మొదటి స్థానంలో, తిరుపతి, విజయవాడ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తిరుపతి నగరానికి విశాఖ కంటే 4 పాయింట్లు ఎక్కువ వచ్చినప్పటికీ.. కీలక విభాగాల్లో జీవీఎంసీ మెరుగైన స్థానంలో నిలవడంతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కొన్ని విభాగాల్లో 50 పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ ర్యాంకింగ్ కోల్పోయినట్లు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు, సీఎంహెచ్వో డా.కేఎల్ఎస్జీ శాస్త్రి తెలిపారు. గ్రీవెన్స్ పరిష్కారం, ప్లాస్టిక్ నిషేధం, కాల్వల స్రీ్కనింగ్, తడిచెత్త ప్రాసెసింగ్, డంప్‌సైట్ రెమిడియేషన్ పద్ధతుల్లో 50 చొప్పున పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ రేటింగ్ సాధించుకోవడంలో విఫలమయ్యామని కమిషనర్ వివరించారు. అయితే తొలి జాబితాలో సింగిల్ స్టార్‌కు పరిమితమైన సమయంలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విభాగంలో సున్నా మార్కులు వేశారని.. తాజాగా సవరించిన మార్కుల జాబితాలో 100 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కచ్చితంగా 5 స్టార్ రేటింగ్ సాధిస్తామని సృజన దీమా వ్యక్తం చేశారు. -
‘ఫైవ్‌స్టార్’ వివాదం!
సంపాదకీయం ఏడాదికోసారి జరిగే ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జాతీయ సదస్సులో ఎన్నో ముఖ్యాంశాలు చర్చకొస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి అసంఖ్యాకంగా పేరుకుపోతున్న వ్యాజ్యాలు అందులో ఒకటి. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా పెండింగ్ కేసుల వ్యవహారం మాత్రం ఎప్పటికీ పరిష్కారం కాదు. మళ్లీ మరో జాతీయ సదస్సు వరకూ ఆ సమస్య ఎవరికీ గుర్తుండదు. ఆదివారం జరిగిన జాతీయ సదస్సులోనూ యథాప్రకారం పెండింగ్ కేసుల ప్రస్తావన వచ్చింది. అయితే, అంతకన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టీ పడింది. న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై ఆయన నిశిత వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే న్యాయవ్యవస్థ నిర్భయంగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. రాజ్యాంగానికీ, చట్టానికీ అనుగుణంగా న్యాయాన్ని కలగజేసే దైవ సమానమైన విధి నిర్వహణలో తలమునకలయ్యే న్యాయమూర్తులు ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలుర’ స్పందనలకు భయపడాల్సిన పనిలేదని కూడా మోదీ చెప్పారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు న్యాయవ్యవస్థ భయపడుతున్నదనడమే కాదు... ఎవరి కారణంగా వారిలో ఆ భయం ఉన్నదో చెప్పడం అసాధారణమైన విషయం. తాము ఎప్పటిలా నిర్భయంగానే వ్యవహరిస్తున్నామని ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్. ఎల్. దత్తు జవాబిచ్చారు. మోదీ చెబుతున్న ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలురు’ చేపట్టే సమస్యలు సామాన్యులకు సంబంధించినవి. న్యాయస్థానాల్లోనూ, వెలుపలా ఆ సమస్యలపై పోరాడటం వారికి నిత్యకృత్యం. ఆ సమస్యలకు వారు చూపుతున్న పరిష్కారాలపై ఎవరికైనా అభ్యంతరాలుండొచ్చు. కానీ వారి చిత్తశుద్ధిని శంకించలేం. ఉదాహరణకు గుజ రాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలగుండా ప్రవహించే నర్మదా నదిపై నిర్మించతలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యాంకు వ్యతిరేకంగా మేథాపాట్కర్, బాబా ఆమ్టే తదితరులు ఉద్యమించారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేశారు. భారీ డ్యాంల నిర్మాణంవల్ల అడవులు నాశనమై పర్యావరణం దెబ్బతింటున్నదని, లక్షలాదిమంది ఆదివాసీలు నిరాశ్రయులై జీవిక కోల్పోతున్నారని ఆ సంస్థ వాదించగా...కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే మంచి ప్రాజెక్టును అడ్డుకుంటున్నా రని మరికొందరు విమర్శించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ సంస్థ ఆరోపిస్తున్నది. వాటిని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నది. అలాగే ఒడిశాలో బాక్సైట్ నిక్షేపాల వెలికితీత కోసం బహుళజాతి సంస్థలకు ఇచ్చిన అనుమతులను వెనక్కు తీసుకోవాలని ఉద్యమాలు సాగుతున్నాయి. దేశంలో భారీ కర్మాగారాలు నెలకొల్పకపోతే ఉపాధి, ఆర్థికాభి వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించేవారూ ఉన్నారు. నోరులేని ఆదివాసీల తరఫున, సామాన్యుల తరఫున పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలకు ఉద్దేశాలు ఆపాదించే బదులు వారు లేవనెత్తే అంశాల్లోని సహేతుకతపైనా...వారు సూచిస్తున్న పరిష్కా రాల్లోని సాధ్యాసాధ్యాలపైనా చర్చించడం అవసరం. అప్పుడు దేశానికి ఏది మంచో ప్రజలే నిర్ణయిస్తారు. ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలురు’ లేకపోతే 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, బొగ్గు స్కాం వంటివి బయటికొచ్చేవి కాదన్నది నిజం. లక్షల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఈ స్కాంలను సామాన్యులెవరైనా బయట పెట్టడం అసాధ్యం. అయితే, మోదీ అభ్యంతరం వీటికి సంబంధించి కాదని స్పష్టం గానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వరసబెట్టి బయటపడ్డాక కాంగ్రెస్ అన్ని విధాలా భ్రష్టుపట్టడం...అది సహజంగానే బీజేపీకి లాభించడం కాదనలేని సత్యం. అయితే ఇటీవలికాలంలో న్యాయస్థానాలిచ్చిన రెండు కీలక తీర్పులు పాలకులను ఇరకాటంలోకి నెట్టాయి. గ్రీన్‌పీస్ ఉద్యమ కార్యకర్త ప్రియాపిళ్లై మొన్న జనవరిలో లండన్ వెళ్లబోతుండగా విమానంలోనుంచి ఆమెను బలవంతంగా దింపేయడం... అనంతరం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యను న్యాయస్థానం తప్పుబట్టడం అందరికీ తెలుసు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో విమర్శలను నియంత్రించేందుకు ప్రభుత్వాలకు విశేషాధికారాలిస్తున్న ఐటీ చట్టం లోని సెక్షన్ 66 ఏ ఉంచడం అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదించగా సుప్రీంకోర్టు ఆ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని తీర్పు నిచ్చింది. ఇలాంటి తీర్పులు రావడంపై మోదీ కినుక వహించారని కొందరంటున్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. 1979 ప్రాంతంలో జైళ్లలో విచారణ లేకుండా మగ్గిపోతున్న ఖైదీల స్థితిగతులపై మీడియా కథనాలనే సుప్రీంకోర్టు పిటిషన్‌గా స్వీకరించడంతో మన దేశంలో ‘న్యాయవ్యవస్థ క్రియాశీలత’ ప్రారంభమైంది. అటు తర్వాత ఆగ్రాలోని నారీ సంర క్షణ కేంద్రంలో అమానవీయ పరిస్థితులు, ఆసియాడ్ నిర్మాణపనుల కార్మికులకు అత్యల్ప వేతనాలివ్వడం, క్వారీల్లో వెట్టిచాకిరీ వంటి అనేకానేక అంశాల్లో న్యాయ స్థానాలు విలువైన తీర్పులిచ్చాయి. అనంతరకాలంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) ఉద్దేశమే దెబ్బతింటున్నదని, పాలనా వ్యవహారాల్లో సైతం న్యాయ స్థానాలు తలదూర్చి నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శలు రావడం మొదలైంది. ఆ విమర్శల ప్రభావంవల్లనే కావొచ్చు... గతంతో పోలిస్తే న్యాయస్థానాలు పిల్స్ విష యంలో పరిమితంగానే వ్యవహరిస్తున్నాయి. నరేంద్ర మోదీకి వక్తగా పేరుంది. అందరినీ ఆకట్టుకునేలా చెప్పగలరు. అయితే న్యాయవ్యవస్థ ఎవరికో భయపడి తీర్పులిస్తున్నదని ధ్వనించడం, సమస్యలను లేవనెత్తేవారిని ‘ఫైవ్‌స్టార్ క్రియా శీలుర’ని ఎద్దేవా చేయడం బహిరంగ సభావేదికలపై ఏమోగానీ... జాతీయ న్యాయ సదస్సు వంటిచోట అతకదు. దీనికి బదులు ఆయా సమస్యలపైనా, న్యాయస్థానాల పనితీరుపైనా నిర్దిష్టమైన చర్చకు అంకురార్పణ చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
తమిళ దర్శకులకు పరిపక్వత లేదు
తమిళ దర్శకులకు పరిపక్వత లేదని మలయాళ నటి కనిక విరుచుకుపడ్డారు. పెళ్లరుున తరువాత కూడా అశ్లీలంగా నటించమని అడుగుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ భామ తమిళంలో ఫైవ్ స్టార్, ఆటోగ్రాఫ్, వరలారు తదితర చిత్రాల్లో నటించారు. మలయాళంలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన ఈ అమ్మడు ఆ మధ్య వివాహం చేసుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా వున్నా ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. తమిళంలో కొన్ని అవకాశాలు వచ్చినా అంగీకరించలేని పరిస్థితి అంటున్నారు. దాని గురించి కనిక మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో సంచలన నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశించేదానన్నారు. అయితే ఇప్పుడలాంటి కోరిక లేదన్నారు. పేరు కోసం చిత్రాలు చేయాలనే అవసరం లేదని పేర్కొన్నారు. మంచి వైవిధ్యభరిత పాత్రలు అనిపిస్తేనే నటించాలని నిర్ణయించుకున్నానన్నారు. తన కుటుంబ సభ్యుల ఆదరణ తనకెప్పుడూ ఉంటుందని తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమ విషయానికొస్తే వివాహం అయిన హీరోయిన్లను పక్కన పెట్టేస్తున్నారని తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా పెళ్లరుుందన్న ఆలోచన కూడా లేకుండా అరకొర దుస్తులు ధరించమని అడుగుతున్నారని ఆరోపించారు. చీర ధరించి నటిస్తానంటే వారి నుంచి బదులే లేదని చెప్పారు. అయితే మలయాళంలో అలాంటి పరిస్థితి లేదని అక్కడ వయసు మళ్లిన నటీమణులైనా కథానారుుకగా అవకాశాలిస్తారని తెలిపారు. మలయాళ దర్శకుల్లో పరిపక్వత ఉండటమే ఇందుకు కారణం అంటున్నారు నటి కనిక.