Flood lights
-
‘సెంచరీ పూర్తికాకుండా కుట్ర చేశారు!’
కరాచీ: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఓ అవమానకరమైన సంఘటను ఎదుర్కొంది. కరాచీ వేదికగా పాక్-శ్రీలంక మధ్య మంగళవారం రాత్రి రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. పదేళ్ల తరువాత పాక్ గడ్డపై మ్యాచ్ ఆడుతుండటం విశేషం. అయితే శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పలుమార్లు ఫ్లడ్‌లైట్లు మొరాయించాయి. దీంతో పలుమార్లు ఆటకు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో స్టేడియంలో పవర్ కట్ అయ్యిందంటూ నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు. సిటి ఆఫ్ లైట్స్‌గా పేరొందిన కరాచీలో కూడా విద్యుత్ సమస్య ఉందంటూ మరికొంత మంది సెటైర్ వేశారు. లంక ఆటగాడు షేహాన్ జయసూర్య సరిగ్గా 96 పరుగుల వద్ద అవుట్ కావడంతో.. ఫ్లడ్‌లైట్ల కుట్ర కారణంగానే అతను తొలి సెంచరీ కోల్పోయాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ పరిణామం లంక ఆటగాళ్లని తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. 2009లో ఆటగాళ్లపై దాడి అనంతరం తొలిసారి వన్డే సిరీస్ జరుగుతుండంతో పాక్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. -
గాలివాన బీభత్సం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ గాలులకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ప్రజలు గడగడలాడి పోయారు. కురిసింది కొద్ది సేపయినా నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఇంటి పైకప్పులు గాల్లో ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ అతలాకుతలం.. జడివాన గ్రేటర్ హైదరాబాద్‌ను గజగజలాడించింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి అంధకారం అలుముకుంది. భారీ వృక్షాలు విరిగిపడటంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. వర్షం 2 సెంటీమీటర్ల లోపే కురిసినా.. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు చేరాయి. దీంతో ఆ ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. సికింద్రాబాద్, చార్మినార్‌లో విద్యుత్ తీగలు తెగిపడటంతో కొద్ది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎల్బీనగర్, మారేడ్‌పల్లి, అంబర్పేట్, రామకృష్ణమఠం, ఉప్పల్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. మల్కాజ్‌గిరిలో వరదనీరు పోటెత్తింది. ఎన్టీఆర్ స్టేడియంలో పలు షెడ్లు, హోర్డింగ్‌లు కుప్పకూలాయి. ఈదురుగాలుల బీభత్సంతో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుల్తాన్‌షాహీ ప్రాంతంలో ఇంటిపై కప్పు రేకులు కొట్టుకుపోయాయి. అల్వాల్‌లో చెట్లు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కుప్పకూలింది. ఫ్లడ్ లైట్ కూలి ఒకరు.. ఈదురు గాలుల తీవ్రతకు ఎల్బీ స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైటు టవర్ కుప్పకూలింది. అదే సమయంలో విధులు ముగించుకుని మెట్రో రైలు ఎక్కేందుకు స్టేడియం మీదుగా వెళ్తున్న జీఎస్టీ ఉద్యోగి సుబ్రమణ్యం (55) టవర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న తోటి ఉద్యోగి రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, పోలీసు అధికారులు సందర్శించి సహాయచర్యలు చేపట్టారు. కాగా, సాధారణ రోజుల్లో సాయంత్రం సగటు విద్యుత్ వినియోగం 2,700 మెగావాట్లు నమోదు కావాల్సి ఉండగా, సోమవారం రాత్రి అనూహ్యంగా 1,400 మెగావాట్లకు పడిపోయింది. డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అప్రమత్తమై ఆయా డివిజన్ల పరిధిలోని ఇంజనీర్లను రంగంలోకి దింపారు. గాల్లో కలిసిన బాలుడి ప్రాణం.. గాలి దుమారం ముక్కుపచ్చలారని బాలుడిని మింగేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామానికి చెందిన ఎల్లేశ్ ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్, హౌజింగ్‌బోర్డు కాలనీలో నివసిస్తున్నాడు. అతని కుమారుడు నవనీతరాజు (7) శ్రీ సాయి గ్రామర్ స్కూల్లో 1వతరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవురోజు కావడంతో ఇంటిపక్కనే ఉన్న పెద్దమ్మ వాళ్ల ఇంటికి ఆడుకోవడానికి వచ్చాడు. రేకుల ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ముంచెత్తిన గాలి దుమారం ధాటికి ఆ ఇంటిపై రేకులు ఎగిరి నవనీతరాజుపై పడ్డాయి. ఒక్కసారిగా రెండు రేకులు పడటంతో నవనీత రాజు వాటి మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మహబూబ్‌నగర్‌లో ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, వడగండ్లు పంటలకు తీవ్రనష్టం మిగిల్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తికి చెందిన గొల్లగోపి (35) అనే వ్యక్తి పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాడు. కాగా, వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం ఖానాపూర్‌లో వందేళ్లనాటి రావిచెట్టు కూలిపోయింది. మెదక్ జిల్లాలో.. మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. చేగుంట, తూప్రాన్, రామాయంపేట, నిజాంపేట, టేక్మాల్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వర్షం అతలాకుతలం చేసింది. ఈదురు గాలులతో ఇళ్ల రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం వానకు తడిసి ముద్దయింది. నిజాంపేట మండలం కె.వెంకటాపూర్‌లో ఓ కోళ్లఫారం నేలమట్టమైంది. వైరా, కొణిజర్ల మండలాల్లో వర్షం కురిసింది. వైరాలోని మార్కెట్లో యార్డులో దాదాపు 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది. ఇల్లెందు పట్టణంలో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రాష్ట్రంపై ఉపరితల ద్రోణి.. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటలలో ఇది వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు ప్రాంతం మీదుగా వాయవ్య దిశగా తమిళనాడు వైపుకు ప్రయాణించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీంతో మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బుధవారం పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో నల్లగొండ జిల్లా మర్రిగూడ, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లెలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు సోమవారం ఆదిలాబాద్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం.. ప్రాంతం నమోదైన వర్షపాతం (సెంటీమీటర్లలో) కుత్బుల్లాపూర్ 1.5 ముషీరాబాద్ 1.3 మోండామార్కెట్ 1.3 నారాయణగూడ 1.0 వెస్ట్‌మారేడ్‌పల్లి 1.5 అంబర్పేట్ 1.0 -
తమిళనాడులో విషాదం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పాఠశాల వార్షికోత్సవ ఫ్లడ్‌లైట్ల వెలుగులు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాల్లో చీకట్లు నింపాయి. కళ్లను ఏమాత్రం తెరవలేని స్థితిలో 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు సహా 96 మంది కంటి ఆస్పత్రి పాలయ్యారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా ఏర్వాడి పొత్తయడిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువులు చెప్పే ఎస్వీ హిందూ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతిఏటా పాఠశాల మైదానంలో నిర్వహించే వార్షికోత్సవాన్ని ఈసారి ఇరుకైన ఒక తరగతి గదిలో జరిపారు. వార్షికోత్సవ అలంకారం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు వీలుగా ఇరుకైన ఆ తరగతి గదిలో కళ్లు మిరుమిట్లు గొలిపే పెద్ద పెద్ద లైట్లను అమర్చారు. ఈ లైట్ల నుంచి వెలువడుతున్న కాంతులు విపరీతంగా ఉండడంతో అందరికీ కళ్లు మంటలు పుడుతుండగా నలుపుకుంటూనే కార్యక్రమాలను వీక్షించారు. ఇళ్లకు వెళ్లిన తరువాత అందరికీ కళ్లమంటలు అధికమై కనురెప్పలు తెరవలేని స్థితికి చేరుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ బాలసుబ్రమణియన్‌కు శుక్రవారం రాత్రి నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతో శనివారం ఉదయం ఒక వ్యాన్‌లో బాధితులను ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు, ఐదుగురు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ బాలసుబ్రమణియన్ సహా మొత్తం 96 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కిక్కు.. ఎవరికి దక్కు?
కర్నూలు : మద్యం దుకాణాల కోసం ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు. జిల్లాలోని 175 మద్యం దుకాణాలకు శనివారం నాటికి సుమారు 5,781 పైగా దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 194 మద్యం దుకాణాలు ఉండగా, అందులో పది శాతం 19 దుకాణాలు ప్రభుత్వమే ప్రారంభించింది. నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు సాయంత్రం 5 గంటల వరకే అయినప్పటికీ క్యూలో నిల్చున్న ప్రతి టెండర్దారున్ని చివరిరోజు అనుమతించారు. రాత్రివేళలో అసౌకర్యానికి గురికాకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయం పరిసరాల్లో కూడా సందడి కనిపించింది. జిల్లాలో 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్ల వారీగా టెండర్ బాక్సులు ఏర్పాటు చేయడంతో సులువుగా దరఖాస్తు చేయగలిగారు. చివరిరోజు కూడా మహిళలు భారీగా తరలివచ్చి టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 300 మందికి పైగా దరఖాస్తులు దాఖలు చేసి మహిళామణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నిబంధనలకు తూట్లు... దరఖాస్తుతో పాటు రూ.5 లక్షలకు తగ్గకుండా ఈఎండీ చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే అందుకు తూట్లు పొడుస్తూ కొంతమంది వ్యాపారులు బినామీలతో భారీ ఎత్తున దరఖాస్తులు వేయించారు. గూడూరు మద్యం దుకాణానికి(గెజిట్ నెం.63) ఒక పేరుతో తీసిన ఈఎండీని మరో పది మందికి కలర్ జిరాక్స్‌లు పంపిణీ చేసి దరఖాస్తులు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలులో కూడా పదుల సంఖ్యలో దుకాణాలకు ఇదే తరహాలో దరఖాస్తులు చేసినట్లు సమాచారం. గత ఏడాది అత్యధికంగా ఒక దుకాణానికి 41 దరఖాస్తులు దాఖలు కాగా ఈ ఏడాది పదుల సంఖ్యలో దుకాణాలకు 100 నుంచి 150 దాకా దరఖాస్తులు దాఖలయ్యాయి. గత ఏడాది 28 దుకాణాలకు సింగిల్ టెండర్ దాఖలు కాగా ఈ ఏడాది ప్రతి దుకాణానికి ఏడుకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. గత సంవత్సరం 14 దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో మూడు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాల్సి వచ్చింది. ఈసారి మొత్తం 175 దుకాణాలకు కూడా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేడు లక్కీడిప్... లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం జిల్లాపరిషత్ సమావేశ భవన్లో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ విజయమోహన్ హాజరై లక్కీ డిప్‌ను ప్రారంభించనున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ హాల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సరిహద్దు వెలుగురేఖ
రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఓ రేఖ ఉంటుంది. ప్రత్యేకించి వేరుపడాలనే తీవ్రమైన కాంక్షతో వేరుపడిన దేశాల మధ్య సరిహద్దు రేఖ ఇంకా బలంగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఇండియా- పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు మాత్రం ఇంకా తీక్షణంగా విద్యుత్తు వెలుగులతో కాంతులీనుతోంది. అంతరిక్షం నుంచి తీసిన ఛాయాచిత్రాల్లో నారింజరంగులో వెలుగు రేఖ కనిపించింది. ఇదేంటబ్బా! అని పరిశీలిస్తే భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖకు ఈవల (భారత్‌వైపు) ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల వరుస. ఇది ఎంతదూరం ఉందో తెలుసా? పంజాబ్, రాజస్థాన్, జమ్ము ఇంటర్నేషనల్ బోర్డర్, గుజరాత్‌లతో కలిపి మొత్తం పద్ధెనిమిది వందల అరవై కిలోమీటర్ల దూరం విస్తరించింది. సరిహద్దును సూచిస్తూ కంచె, దానికి పహారా కాస్తూ సైనికులు ఉండగా కొత్తగా ఈ ఫ్లడ్‌లైట్ల బారులు ఎందుకంటే... మనుషులు- వస్తువుల అక్రమరవాణా, ఆయుధాల సరఫరాను నిరోధించడం కోసం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశం వెలుపలి నుంచి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించి, దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం. అందుకోసం మొత్తం రెండువేల కిలోమీటర్ల దూరం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలనేది భారత్ ప్రభుత్వ ఆలోచన. ఈ ఛాయాచిత్రాన్ని 28వ అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్ ఎక్స్‌పెడిషన్‌లో (ఈ ఏడాది అక్టోబర్ 28) ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ ‘నాసా’ అధికారిక వెబ్సైట్ నాసా.జిఓవిలో వెల్లడించింది.