flood loss
-
వరద బాధితులకు సహాయం ప్రకటించిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
-
ఎకరానికి రూ.10 వేలు: సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ /కిర్లంపూడి, సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరదలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున నష్ట పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వరద ప్రాంతాల సందర్శన సందర్భంగా బుధవారం ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఏలూరులో తమ్మిలేరు కాల్వను బ్రిడ్జి నుంచి పరిశీలించిన అనంతరం సీఆర్ రెడ్డి ఆడిటోరియంలో ఎంపిక చేసిన వరద బాధితులను కలిశారు. ఏలేరు వరదతో ముంపునకు గురైన వరి పొలాలు, నీట మునిగిన ఇళ్లను కిర్లంపూడి మండలం రాజుపాలెంలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని చెప్పారు. వరదల్లో దెబ్బతిన్న ఒక్కో వాహనానికి రూ.10 వేలు, దుస్తులు, ఇంటి సామాన్ల కోసం ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. పైసా ఖర్చు కూడా లేకుండా తోపుడు బళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, పిఠాపురం ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఏలేరు వరదతో జిల్లాలో 65 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. 17వ తేదీలోపు అన్ని నష్టాలను అంచనా వేసి నష్టపరిహారాన్ని అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు ఆధునికీకరణ కోసం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. బుడమేరుపై ఆర్మీ వాళ్లే చేతులెత్తేస్తే తాము విజయవంతంగా గండ్లు పూడ్చామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లన్నీ వైఎస్సార్ సీపీకి చెందినవారివేనని, దొంగ ఇసుక వ్యాపారం చేయడానికి వాటిని వినియోగించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక పనికి మాలిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ ఫోన్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని సంప్రదించేలా ఒక యాప్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.ఏలూరు అష్ట దిగ్బంధంముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు పర్యటన సందర్భంగా నగరమంతా అష్ట దిగ్బంధంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడో సీఆర్ రెడ్డి కళాశాల దగ్గర కాగా ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఆంక్షలు విధించారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, వృద్ధులు నానా అగచాట్లు పడ్డారు. ప్రతి రోడ్డుపై బ్యారికేడ్లు పెట్టారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ప్రయాణికులు బస్సులు లేక ప్లాట్‌ఫామ్‌లపై పడిగాపులు కాశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏలూరులో ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. -
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్‌కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
తిన లేని విధంగా ఆహారం..
-
వరద నీటిలో ఏపీ రాజధాని అమరావతి
-
వయనాడ్‌లో వరద బీభత్సం.. కొనసాగుతున్న సహాయక చర్యలు (ఫొటోలు)
-
ఏడాది వర్షం ఒకే రోజు.. దుబాయ్ అతలాకుతలం.. 18 మంది మృతి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ భారీ వర్షాలకు తల్లడిల్లిపోయింది. ఎడతెగని వర్షాలు వీధులు, ఇళ్లు, మాల్స్‌ను జలమయం చేశాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. Everything Problem has a Solution, But...#Dubai #dubairain #DubaiStorm #dubairains #meme #Dubaifloods pic.twitter.com/IqoiuElg3J — Ashique Hussain / عاشق حسين (@47aq_) April 17, 2024 ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది. బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Easy guys @LarryMadowo @kipmurkomen #DubaiMetro pic.twitter.com/sPyy97EMBK — EVOLUTION EXPRESS LOGISTICS (@LetsGoEvolution) April 16, 2024 జాతీయ వాతావరణ కేంద్రం నిపుణుడు అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించారు. This is the Dubai airport after the biggest flood of history. pic.twitter.com/Kv2Hgam9jM — Baba Banaras™ (@RealBababanaras) April 17, 2024 దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ తుఫాను కారణంగా మంగళవారం మధ్యాహ్నం 25 నిమిషాల పాటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశామని, ఆ తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 🚨🇦🇪 Severe weather today in Dubai#برشلونه_باريس #TSTTPD #bbtvi #Dubai #dubairain #dubairains pic.twitter.com/n426GYnZX7 — Imranzeemi (@imranzeemi) April 17, 2024 వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల (3.2 అంగుళాలు) కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది. దుబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక రోజులో దాదాపు 1.5 సంవత్సరాల సగటు వర్షపాతం. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 తుఫాను కారణంగా పలు పాఠశాలలను మూసివేయగా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ భారీ వర్షాలు దాదాపు అన్ని అరబ్ దేశాలలో విపత్తుకు కారణంగా నిలిచాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షపాతం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్త అహ్మద్ హబీబ్ తెలిపిన వివరాల ప్రకారం క్లౌడ్ ఫార్మేషన్ల నుంచి ప్రయోజనాన్ని పొందడానికి గల్ఫ్ స్టేట్‌లోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అల్ ఐన్ విమానాశ్రయం నుండి సీడింగ్ విమానాలను పంపింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనూ భారీ వర్షాలు పడ్డాయి. 🚨 UAE🇦🇪 View of Dubai Airport after heavy Rain pic.twitter.com/wY2ALp35A8 — Izlamic Terrorist (@raviagrawal3) April 16, 2024 -
భారీ వర్షాలతో తమిళనాడు విలవిల (ఫొటోలు)
-
తుపాను తాకిడి ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ టూర్లు
-
కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్‌పూర్
నాగ్‌పూర్: కుండపోత వర్షంతో నాగ్‌పూర్ నీటమునిగింది. శుక్రవారం ఒక్కరాత్రిలోనే 106 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 'అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో నాగ్‌పూర్‌లోని అంబజారీ సరస్సు పొంగిపొర్లింది. సమీప ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.' అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. వర్షంలో నీటమునిగిన ప్రాంతాలకు సహాయక బృందాలను ప్రభుత్వం పంపింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను అప్రమత్తం చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు నాగ్‌పూర్ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో నగరంలో రోడ్లు కొట్టుకుపోయాయి. నాలాలు దెబ్బతిన్నాయి. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న డెంగీ -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
వరంగల్ : వరద ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటన (ఫొటోలు)
-
బాధితులకు నిత్యావసర సరుకులు అందించిన మంత్రి చెల్లుబోయిన
-
గొందూరులో నీట మునిగిన గండి పొసమ్మ ఆలయం
-
హైదరాబాద్ వరద సాయం.. భారీగా క్యూ
-
వరద సాయానికి బ్రేక్..!
-
డామిట్ కథ అడ్డం తిరిగింది: సాయం ఆగింది
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలోని వరద బాధితులకు ఇంటికి రూ.10వేల వంతున అందిస్తున్న వరదసాయాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా సాయం అందక.. శుక్రవారం సెలవు కావడంతో శనివారం అందుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నవారికి నిరాశే మిగలనుంది. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల కనుగుణంగా శుక్రవారం జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్ల సమావేశం జరిగింది. సర్కిళ్ల వారీగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన నిధులు పోను మిగిలిన నిధుల్ని జోనల్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులకు శనివారం మధ్యాహ్నం అందజేయాల్సిందిగా సూచించారు. వీటిని స్వచ్ఛ హైదరాబాద్ ఖాతాలో జమచేయాలని కూడా పేర్కొన్నారు. అనంతరం, లెక్కల స్టేట్మెంట్లు కూడా తయారు చేయాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఇక ఎలక్షన్ పనులు.. నగదు పంపిణీని ముగించడంతో పాటు ఇక వెంటనే ఎన్నికల పనుల్లో నిమగ్నం కావాల్సిందిగా కూడా ఆదేశించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, డీఆర్సీ సెంటర్ల ఏర్పాటు, ఆర్ఓలు, ఏఆర్ఓలకు పనుల అప్పగింత తదితర పనులు చేయాల్సిందిగా ఆదేశించడంతో జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఇక ఆ పనుల్లో నిమగ్నం కానున్నారు. పంపిణీ రూ. 342 కోట్లు.. గ్రేటర్ పరిధిలో వరదబాధిత కుటుంబాలు దాదాపు 4 లక్షలు ఉంటాయని భావించి అందుకనుగుణంగా రూ.400 కోట్లు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి జీహెచ్ంఎసీకి పంపిణీ చేశారు. వీటిల్లో దాదాపు రూ.342 కోట్లు పంపిణీ అయ్యాయి. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు చూస్తే దాదాపు 6 లక్షల కుటుంబాలున్నట్లు అంచనా. అయితే అధికార వర్గాల సమచారం ప్రకారం.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పంపిణీ మార్గదర్శకాలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. బాధలు ఎందరివో.. బావుకున్నది కొందరు.. వరదబాధితులకు సహాయం అనగానే రాజకీయ జోక్యం తీవ్ర గందరగోళం సృష్టించింది. తమ అనుయాయులు, తమకు తెలిసిన కుటుంబాలకే పూర్తిసాయం అందేలా స్థానిక రాజకీయనేతలు వ్యవహరించారని నగరవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వరదల సమయంలో కనీసం చూడటానికి కూడా రాని వారు.. నగదు పంపిణీ అనగానే ఒక్క కుటుంబానికి నగదు పంపిణీ చేస్తూ.. పదిమంది ఫొటోకు ఫోజులిచ్చారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలకు బ్యాంకు ఖాతాల ద్వారా కానీ, మరేదైనా మార్గంలో కానీ కాకుండా నేరుగా నగదు కావడంతో పలు ప్రాంతాల్లో నిధులు సక్రమంగా పంపిణీ జరగలేదని, పది వేలివ్వకుండా రూ. 2వేల నుంచి మొదలుపెట్టి రూ.8వేల వరకు పంపిణీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలకు దిగడం తెలిసిందే. నిజమైన బాధితులకు చాలా చోట్ల అందకపోగా,కొన్ని చోట్ల అనర్హులకు కూడా అందాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొన్ని చోట్ల ఇళ్ల యజమానులకే పంపిణీ చేయడంతో వరదల్లో సమస్తం కోల్పోయి, కట్టుబట్టలతో మాత్రమే మిగిలిన వారికి కూడా కిరాయిదారులకు సాయమందకుండా పోయిందనే వేదనలు వ్యక్తమయ్యాయి. డామిట్.. కథ అడ్డం తిరిగింది.. ఈ పంపిణీని ఆసరా చేసుకొని త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందాలనుకుంటే.. పరిస్థితి అందుకు భిన్నంగా మారడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులు గడిచాక తిరిగి నిజమైన అర్హులకు మరోమారు వరద సహాయం అందజేస్తారా.. లేదా అనే అంశంలో స్పష్టతనిచ్చేవారు కరువయ్యారు. ఎన్నికల తరుణంలో జరిగిన ఈ పంపిణీ వరద సహాయంలా కనిపించలేదనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి. వరద సాయంలో చేతివాటం జూబ్లీహిల్స్: వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 వేల ఆర్థిక సాయం అక్రమార్కుల పంట పండిస్తున్నది. పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు అందిందే అదనుగా దండుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజవకర్గ వ్యాప్తంగా అర్హులు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీలో భారీగా అక్రమాలు జరగుతున్నాయని, నిబంధనలు తుంగలోకి తొక్కి ఒక పద్ధతి ప్రకారం టీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావాల్సిన వారికే డబ్బులు అందేలా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ఆరోపణలు.. తమకు కావాల్సిన వారి లిస్ట్‌ను తయారు చేసి అధికారులకు అందిస్తున్నారు. పంపిణీ పూర్తికాగానే గద్దల్లా వాలిపోయి సగం డబ్బును కమిషన్ రూపంలో వెనక్కి తీçసుకుంటున్నారు. యూసుఫ్‌గూడకు చెందిన ఓ అధికార పార్టీ నేత తమ కుటుంబంలోని ముగ్గురి పేర్లు రాయించుకొని రూ.30 వేల రూపాయలు తీసుకున్నాడు. మూడో అంతస్తులో ఉంటున్న వారికి కూడా వరద బాధితుల కింద రాయించి డబ్బులు తీసుకుంటున్నారు. ఎత్తు ప్రాంతంలో ఉన్న యూసుఫ్‌గూడ వెంకటగిరిలో వరద సమస్యే లేదు. కానీ బాధితుల పేరుచెప్పి దండుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రూ.10 వేలు ఇచ్చి అధికారులు వెళ్లిపోగానే రంగప్రవేశం చేస్తున్న అధికార పార్టీ నేతలు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కమీషన్ కింద తీసుకుంటున్నారు. అక్రమాలపై పూర్తి సమాచారం ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ప్రతి డివిజన్లో అధికార పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడి ఏరియాలను పంచుకుంటున్నారు. యూసుఫ్‌గూడలో నగదు పంపిణీలో గోల్మాల్ చేస్తున్న కొందరు కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో స్థానికులు ఫిర్యాదు చేశారు. రహమత్‌నగర్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లోని గోడ కూలి పోయిందని ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా తనకు నష్ట పరిహారం అందలేదని దళిత నాయకుడు సాయి మాదిగ వాపోయారు. కొన్ని చోట్ల భార్యాభర్తలు విడిగా రెండు గదుల్లో ఉన్నట్లు చూపించి ఇద్దరూ పరిహారం పొందుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతా ఎమ్మెల్యే ఇష్ట ప్రకారమే సాయం పంపిణీ జరుగుతోందని తమ పాత్ర ఏమీ లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు. -
చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయనను కొత్తగా ముంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో బాబు కుటుంబం మొత్తం మునిగిపోయిందని, ఇప్పుడు వరదల్లో ఏకంగా ఆయన నివాసం మునిగిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా బాధ్యత కలిగిన వ్యక్తిగా కృష్ణా నదీ గర్భంలోని అక్రమ కట్టడం నుంచి ఖాళీ చేసి వెళ్లడం మంచిదని హితవు పలికారు. అంబటి శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎం అయిన వేళా విశేషంతో రాష్ట్రానికి జలకళ వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... టీడీపీ నేతలవి చౌకబారు ప్రకటనలు ‘‘రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం తన ఇల్లు ముంచేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు. వరదలపై టీడీపీ నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిం చినట్లుగా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంటే ఆయన హైదరాబాద్‌లో ఉండి ట్వీట్లు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఫ్లడ్ లెవల్ 22.6 మీటర్లు ఉంటుంది. చంద్రబాబు నివాసం 19 మీటర్ల లోపే ఉంది. నీటిమట్టం మరింత పెరిగితే ఆయన నివాసం మునిగిపోయే అవకాశం ఉంది. నదిలో వరద ఉధృతిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తే అందులో కుట్ర ఏముంది? బ్యారేజీ గేట్లకు పడవలు అడ్డం పెట్టారని అనడం చంద్రబాబు స్థాయికి తగినది కాదు. బాబుకు అమరావతిపై నమ్మకం లేదా? వరద తీవ్రత పెరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అందులో భాగంగానే చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇచ్చారు. చట్టప్రకారం వీఆర్ఓ నోటీసు ఇవ్వడానికి వెళితే లోనికి రానివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. గతంలో సీఎంగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి చెప్పే సమాధానం ఇదేనా? హై సెక్యూరిటీ జోన్లో ఉండే వ్యక్తి మునిగే ప్రాంతంలో నివాసం ఉండటం ఏంటి? చంద్రబాబు అద్భుతంగా అమరావతిని నిర్మిస్తున్నానని చెప్పారే గానీ ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకోలేదు. బాబుకు అమరావతిపై నమ్మకం లేదా? ఇక్కడ ఉండాలనే కోరిక లేదా? అమరావతిలో ఉండకుండా వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఇల్లు నిర్మించుకోలేదని భావిస్తున్నాం’ అని అంబటి పేర్కొన్నారు. -
ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
పంట మునిగిందని రైతు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం : మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరధిలోని ర్యాలీగఢ్‌పూర్ గ్రామంలోని బాబానగర్‌కు చెందిన చిప్పకుర్తి రాజయ్య (55) శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలి.. ఇటీవల మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో ర్యాలీవాగు సమీపంలో ఉన్న రాజయ్య పత్తి సేను పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. రాజయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
వర్షాలతో రూ.2,200 కోట్ల నష్టం!
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు రాష్ట్రం నివేదిక సాక్షి, న్యూఢిల్లీ: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రులకు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారమిక్కడ రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు సంభవించిన నష్టంపై నివేదిక అందించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ‘‘మా విజ్ఞప్తిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపి, నష్టాన్ని అంచనా వేసి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు’’ అని మహమూద్ అలీ చెప్పారు. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఆ మేరకు రూపొందించిన ప్రాథమిక అంచనా నివేదికను రాజ్‌నాథ్‌కు అందజేశామని మంత్రి ఈటల తెలిపారు. ఇటీవలి వర్షాలతో హైదరాబాద్‌కు రూ.1,157 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూ.463 కోట్ల మేర ఆర్అండ్బీ, రూ.298 కోట్ల మేరకు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మిడ్ మానేరుతో సహా 671 చెరువులకు గండి పడిందనివివరించారు. వర్షాలతో 46 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.