Fools
-
పోటెత్తిన కృష్ణమ్మ
విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద దిగువకు ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి సాగర్ జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.శ్రీశైలం జలాశయం నుంచి ఆదివారం సాయంత్రం 10 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,06,242 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,063 క్యూసెక్కులు కలిపి 4,74,205 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 4,20,280 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,97,524 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 12,261 క్యూసెక్కులు కలిపి దిగువ కృష్ణాలోకి 5,09,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లాంచీలు నిలిపివేతఎగువ నుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులకు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో నాగార్జున కొండకు వెళ్లే లాంచీలను శని, ఆదివారాలు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశకు గురయ్యారు. వరద ఉధృతి తగ్గి, గాలులు తగ్గితే లాంచీలను నడుపుతామని, పర్యాటకుల భద్రత దృష్ట్యా లాంచీలను నిలిపి వేసినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు.పులిచింతలకు భారీగా వరద నీరుఎగువ నుంచి 6,36,945 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 6.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 24 క్రస్ట్ గేట్లు ఉండగా 21 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 5,69,744 క్యూసెక్కులను దిగువ ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఏడీఈ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెయిల్ పాండ్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా ఆదివారం విడుదల చేసిన 5,69,744 క్యూసెక్కుల వరద నీరే అత్యధికం. నీటిమట్టం 73.55 మీటర్లకు చేరుకోవడంతో టెయిల్ పాండ్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేతరెండో ప్రమాద హెచ్చరిక జారీతాడేపల్లి రూరల్/అమరావతి: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి 11 గంటలకు 10,25,776 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. మొత్తం గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని గెస్ట్హౌస్లలోకి వరదనీరు చొచ్చుకువచ్చింది.ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎక్స్క్లూయిస్ వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో మత్స్యకారులు తమ పడవలను రేవుపై వరద నీటిలోనే భద్రపర్చుకున్నారు. దిగువ ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతి పెరగడంతో మత్స్యకారులు తమ పడవలను పుష్కరఘాట్లపైనే వదిలేశారు. మహానాడు మసీదు రోడ్డులో కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఇన్చార్జి తహశీల్దార్ సతీష్‌కుమార్ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ.. గుండిమెడ నుంచి కృష్ణా నది కరకట్టవైపు ప్రయాణించడంతో పొలాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది. వరద ఉధృతి పెరిగితే ప్రాతూరు, గుండిమెడ పొలాలు నీట మునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది లంక పొలాల్లో పశువుల కాపరులు తమ పశువులను బయటకు తీసుకువచ్చారు. మంగళగిరి మండలం రామచంద్రాపురం, దుగ్గిరాల మండల పరిధిలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు తదితర ప్రాంతాల్లో కృష్ణా నది పొంగిపొర్లడంతో కరకట్ట లోపల వున్న పంట పొలాలు మునిగిపోయాయి. పుట్టలమ్మ తల్లి ఆలయం చుట్టూ వరద నీరు చేరడంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. -
మూర్ఖులు అర్థం చేసుకోలేరు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తనకు ఎంతో గౌరవముందని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇది అర్థం చేసుకోలేని వారంతా మూర్ఖులు అని, వారి అభిప్రాయాన్ని తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తామిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ సోషల్ మీడియా, మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ‘శాస్త్రి–గంగూలీకి చెందిన ఏ విషయమైనా మీడియాకు మాంచి మసాలాతో కూడిన భేల్పూరి, చాట్‌లాంటి వార్తలా అనిపిస్తోంది. మాపై వచ్చే ఊహాగానాలకు మీడియా విపరీతంగా స్పందిస్తూ ఉంటుంది. పని పాట లేనివారే సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఇందులో వాస్తవం లేదు.గంగూలీ క్రికెట్‌కు ఎంతో చేశాడు. అతనంటే నాకు చాలా గౌరవం. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో గంగూలీ మళ్లీ భారత క్రికెట్లో పునరుజ్జీవం నింపాడు. మా ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉంది. ఈ విషయం అర్థం చేసుకోలేని మూర్ఖుల గురించి నేను ఆలోచించను’ అని రవిశాస్త్రి వివరించారు. వారం క్రితం గంగూలీ కూడా ఇదే అంశంపై స్పష్టతనిచ్చాడు. ఊహాగానాలు, కల్పిత వార్తలు నమ్మొద్దని తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా ఎన్నికవడం పట్ల రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశారు. భారత కోచ్ పదవి ఒత్తిడితో కూడినదని అన్నారు. ప్రారంభంలో భారత జట్టు నంబర్‌వన్‌గా ఎదుగుతుందని తానంటే అందరూ వింతగా చూశారని, కానీ ఇప్పుడు అదే నిజమైంది అని కోచ్‌గా తన పనితీరుని విమర్శిస్తున్న వారికి సమాధానంగా చెప్పారు. టి20 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్‌తో పాటు కేఎల్ రాహుల్‌ను కూడా వికెట్ కీపర్‌గా పరీక్షిస్తామని అన్నారు. -
'ఫూల్స్ డే' సినీ సందడి!
శుక్రవారాలు, పండుగలు, వేసవి సెలవులు, పబ్లిక్ హాలీడేస్ వంటి వాటినే సినిమా రిలీజ్ కు ముహూర్తాలుగా భావించే సినీ నిర్మాతలు... ఇటీవల ఫూల్స్ డేను కూడ మంచి ముహూర్తంగా ఎంచుకున్నారు. మార్చి నెలతో దాదాపుగా విద్యార్థుల పరీక్షలు పూర్తయి, ఏప్రిల్ నెల నుంచి వేసవి సెలవులు ఇస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చే ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే ను కూడా సినిమాల విడుదలకు వాడేసుకుంటున్నారు. ఈసారి ఫూల్స్ డే స్సెషల్ సినిమాల సందడి ఏమిటో ఓసారి చూద్దాం. వేసవి సెలవుల్లో సినీస్టార్లు, యంగ్ హీరోలు తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ ఫస్ట్ నాడు ఆరు తెలుగు సినిమాలు, మూడు తమిళ్ డబ్బింగ్ సినిమాలు, రెండు హిందీ, రెండు ఇంగ్లీష్ సినిమాలతో అభిమానులను అమితంగా అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్ నటించిన 'సావిత్రి', మంచు మనోజ్ 'అటాక్', '7టు4', ఆర్తీ ఆగర్వాల్ చివరి సినిమా 'ఆమె ఎవరు?', 'పిడుగు', 'రహదారి' మొదలైన ఆరు తెలుగు సినిమాలు, శర్వానంద్ నటించిన రాజాధిరాజ, నాగార్జున హిట్ టైటిల్ తో ధనుష్ హీరోగా 'మాస్', నన్ను వదిలి నీవు పోలేవు వంటి తమిళ డబ్బింగ్ సినిమాలు, కీ అండ్ కా, మా పాస్ హిందీ చిత్రాలు, కుంగ్ ఫూ పాండా 3, ది డైవర్జెంట్ సిరీస్ లోని అలెజియంట్ ఇంగ్లీష్ సినిమాలు ఫూల్స్ డే కి రిలీజ్ కాబోతున్నాయి. క్లాస్ టచ్ ఉన్న టైటిల్ సావిత్రి తోపాటు ఆకట్టుకునే పోస్టర్లు, ఆనందింపజేస్తున్న ట్రైలర్ తో దర్శకుడు పవన్ సాదినేని సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా... రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వస్తున్న అటాక్ కూడ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఆర్తీ అగర్వాల్ చివరి సినిమా మార్కుతో వస్తున ఆమె ఎవరు?, తమిళంలో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ధనుష్ సినిమా మాస్ (మారి), మాస్ ప్రేక్షకులను, పెద్దలను కూడ ఆకట్టుకునే నన్ను వదిలి నీవు పోలేవులే సినిమాలు ఏప్రిల్ ఫస్ట్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గత కొంతకాలంగా యంగ్ హీరోల సినిమాలు హిట్ కొట్టి, మంచి లాభాలు తెచ్చిపెడుతున్న నేపథ్యంలో శర్వానంద్ రాజాధిరాజా తమిళ్ వర్షన్ ను డైరెక్ట్ డీవీడీలుగా థియేటర్లలో ప్రత్యేకంగా రిలీజ్ చేసేందుకు తెలుగు పంపిణీదారులు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇకపోతే మరిన్ని తెలుగు సినిమాలు ఇదే వారంలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతుండగా ఇటీవల ప్రేక్షకులను మెప్పించిన నాగార్జున 'ఊపిరి'కి వీటిలో ఏదైనా పోటీ పడతాయా లేవా అన్నది మాత్రం అభిమానులు నిర్ణయించాల్సిందే.