Former RJD MP
-
బెయిల్‌పై బయటికొచ్చి చట్టానికి తూట్లు
న్యూఢిల్లీ: యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ 11 ఏళ్ల తర్వాత బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చిన మాజీ ఆర్జేడీ ఎంపీ షహబుద్దీన్, చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆయన విడుదల నితీష్ కుమార్ ప్రభుత్వానికి రోజుకో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. బగల్పూర్ జైలు నుంచి శివాన్ వెళ్లే మార్గంలో షహబుద్దీన్ కాన్వాయ్‌తో పాటు 200 కార్లు ముజఫర్‌పూర్ టూల్ బూత్ దగ్గర అసలు టోల్ ఫీజు కట్టలేదని వెల్లడైంది. టూల్ బూత్ ఉద్యోగాలు ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ ఎంపీ షహబుద్దీన్ కాన్వాయ్‌తో పాటు, 200 పైగా కార్లకు టోల్ ఫీజు సేకరించవద్దని ఆర్డర్లు ప్రభుత్వం నుంచి వచ్చాయని ముజఫర్‌పూర్ టోల్ ప్లాజా మేనేజర్ దీపక్ చౌబే తెలిపారు. ఈ విషయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జంగల్ రాజ్ మళ్లీ బిహార్‌కి వచ్చాడంటూ.. ఈ విషయంపై నితీష్ మౌనవ్యూహం పాటిస్తున్నాడంటూ బీజేపీ నేత నళిని కోహ్లి ఆరోపిస్తున్నారు. షహబుద్దీన్ విడుదల లా అండ్ ఆర్డర్ విషయంలో బిహార్ ముఖ్యమంత్రికి తీవ్ర పరీక్షలు ఎదురుకాబోతున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకవేళ టోల్ ఫీజు చెల్లించలేదనే ఆరోపణలు రుజువైతే నితీష్ ప్రభుత్వం కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వస్తుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే బిహార్ ప్రభుత్వానికి షహబుద్దీన్ విడుదలకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ వివరణ ఇస్తోంది. 2014లో ముగ్గురు సోదరులు సతీష్, గిరీష్, రాజీవ్ రోషన్‌లను అపహరించుకుని పోయి, ఇద్దరు సోదరులపై యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే కేసులో షహబుద్దీన్ హస్తమున్నట్టు వెల్లడైన నేపథ్యంలో ఆయనకు యావజ్జీవ శిక్ష ఖరారైంది. ఈ కేసుకు ప్రధాన సాక్షిగా ఉన్నాడంటూ మూడో సోదరుడు రాకేశ్ రోషన్‌కు కూడా వాళ్లు హతమార్చారు. 11 ఏళ్ల అనంతరం ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. -
11ఏళ్ల తర్వాత మాజీ ఎంపీ విడుదల
బెంగళూరు : మాజీ ఆర్జేడీ ఎంపీ మొహమ్మద్ షహబుద్దీన్ 11 ఏళ్ల అనంతరం జైలు నుంచి బయటికొచ్చారు. రాజీవ్ రోషన్, ఇద్దరు సోదరుల మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడిన ఆర్జేడీ ఎంపీకి పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఆయన విడుదలయ్యారు. 2004లో గిరీశ్ రాజ్, సతీష్ రాజ్ అనే సోదరులను అపహరించుకుపోయి, యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే నిర్థారణతో షహబుద్దీన్‌కు జైలు శిక్ష పడింది. ఈ ఘటనపై మృతుల తల్లి కళావతి దేవీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు విచారణలో షహబుద్దీన్‌కు సోదరుల అపహరణతో సంబంధం ఉందని తేలడంతో ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. బెయిల్‌పై బయటికి వచ్చిన షషబుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తనను కావాలనే ఇరికించినట్టు ప్రతిఒక్కరికీ తెలిసని, జైలు శిక్ష విధించిన కోర్టే, తనను విడుదల చేసిందని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలతో తననేమి చేయలేరని, న్యాయస్థానాలకు తనకంటూ సొంత విధానాలు ఉంటాయని వెల్లడించారు. రాజకీయ కుట్రలకు తానెప్పుడూ పాల్పడలేదని చెప్పారు. 13 ఏళ్ల అనంతరం తన గ్రామానికి వెళ్తున్నట్టు, 26 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తనతో ఎలా మెలిగారో అలానే ఇప్పుడు కూడా ప్రజలు తనని అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా తను ఎవరిని కలవలేకపోవడంపై విచారణ వ్యక్తంచేశారు. 2004 ఆగస్టు పదహారో తేదీన గిరీశ్, సతీష్, రాజీవ్ అనే ముగ్గురు సోదరులు కిడ్నాప్‌కు గురయ్యారు. అనంతరం గిరీశ్, సతీష్‌లు హత్యకు గురవ్వగా రాజీవ్ రోషన్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. సోదరుల హత్య కేసుకు రాజీవ్ రోషన్ సాక్ష్యం చెప్పాడు. అనంతరం రాజీవ్ రోషన్‌ను కూడా షహబుద్దీన్ కుమారుడు ఓసామా హత్య చేశారు.