బెయిల్పై బయటికొచ్చి చట్టానికి తూట్లు
బెయిల్పై బయటికొచ్చి చట్టానికి తూట్లు
Published Mon, Sep 12 2016 11:42 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
న్యూఢిల్లీ: యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ 11 ఏళ్ల తర్వాత బెయిల్పై జైలు నుంచి బయటికొచ్చిన మాజీ ఆర్జేడీ ఎంపీ షహబుద్దీన్, చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆయన విడుదల నితీష్ కుమార్ ప్రభుత్వానికి రోజుకో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. బగల్పూర్ జైలు నుంచి శివాన్ వెళ్లే మార్గంలో షహబుద్దీన్ కాన్వాయ్తో పాటు 200 కార్లు ముజఫర్పూర్ టూల్ బూత్ దగ్గర అసలు టోల్ ఫీజు కట్టలేదని వెల్లడైంది. టూల్ బూత్ ఉద్యోగాలు ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ ఎంపీ షహబుద్దీన్ కాన్వాయ్తో పాటు, 200 పైగా కార్లకు టోల్ ఫీజు సేకరించవద్దని ఆర్డర్లు ప్రభుత్వం నుంచి వచ్చాయని ముజఫర్పూర్ టోల్ ప్లాజా మేనేజర్ దీపక్ చౌబే తెలిపారు. ఈ విషయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
జంగల్ రాజ్ మళ్లీ బిహార్కి వచ్చాడంటూ.. ఈ విషయంపై నితీష్ మౌనవ్యూహం పాటిస్తున్నాడంటూ బీజేపీ నేత నళిని కోహ్లి ఆరోపిస్తున్నారు. షహబుద్దీన్ విడుదల లా అండ్ ఆర్డర్ విషయంలో బిహార్ ముఖ్యమంత్రికి తీవ్ర పరీక్షలు ఎదురుకాబోతున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకవేళ టోల్ ఫీజు చెల్లించలేదనే ఆరోపణలు రుజువైతే నితీష్ ప్రభుత్వం కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వస్తుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే బిహార్ ప్రభుత్వానికి షహబుద్దీన్ విడుదలకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ వివరణ ఇస్తోంది.
2014లో ముగ్గురు సోదరులు సతీష్, గిరీష్, రాజీవ్ రోషన్లను అపహరించుకుని పోయి, ఇద్దరు సోదరులపై యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే కేసులో షహబుద్దీన్ హస్తమున్నట్టు వెల్లడైన నేపథ్యంలో ఆయనకు యావజ్జీవ శిక్ష ఖరారైంది. ఈ కేసుకు ప్రధాన సాక్షిగా ఉన్నాడంటూ మూడో సోదరుడు రాకేశ్ రోషన్కు కూడా వాళ్లు హతమార్చారు. 11 ఏళ్ల అనంతరం ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటికొచ్చారు.
Advertisement