shahabuddin
-
రిపబ్లిక్ టీవీ: లాలూకు ఆడియో టేపు షాక్
తన చానెల్ రిపబ్లిక్ టీవీని శనివారం ప్రారంభించిన అర్ణబ్ గోస్వామి బాంబు పేల్చారు. రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తీహార్ జైల్లో జీవితఖైదులో అనుభవిస్తున్న షహబుద్దీన్‌తో మాట్లాడుతున్న ఆడియో టేప్‌ను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. జైలు నుంచి లాలూకు, షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్లు అందులో ఉంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు పాట్నాలో ఓ పెట్రోల్ పంపును 2011లో అక్రమంగా కేటాయించారని బీహార్‌కు చెందిన బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో విపక్షాలు లాలూ, అధికార బీజేడీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. క్లిప్పింగ్‌పై మాట్లాడిన సుశీల్.. లాలూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. క్లిప్పింగ్‌పై మాట్లాడిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆడియో టేపును విన్న దేశం నివ్వెరవపోయిందని అన్నారు. ప్రారంభంతోనే నాయకుల అక్రమాలను బయటపెట్టడం మొదలుపెట్టిన అర్ణబ్‌ను పలువురు నాయకులు ప్రశంసించారు. కాగా, ఆడియో క్లిప్పింగ్‌పై ఆర్జేడీగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఇంకా స్పందించలేదు. -
జైలులో దర్జాగా సెల్ఫీ దిగిన మాజీ ఎంపీ!
సివాన్/పట్నా: జైలులో ఉన్న ఆర్జేడీ ఎమ్మెల్యే మహమ్మద్ షాబుద్దీన్ తన సెల్లో దర్జాగా సెల్పీ దిగి మరోసారి వివాదాన్ని రేపారు. ఖైదీ తరహాలో కాకుండా సరికొత్త లుక్‌తో జీన్స్ ప్యాంటు, కోటు వేసుకొని ఆయన దిగిన సెల్ఫీలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సివాన్ జైలులో ఉన్న ఖైదీకి ఇలాంటి విలాసాలు ఎలా వచ్చాయని ప్రజలు విస్తుపోయారు. దీంతో సివాన్ జిల్లా అధికారులు జైలులో శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్‌కార్డులు లభించినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే షాబుద్దీన్ దగ్గర ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అన్నది వారు తెలుపలేదు. ప్రధాన సాక్షిని హత్యకేసులో పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో షాబుద్దీన్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. కరుడుగట్టిన రాజకీయ నేరస్తుడిగా పేరొందిన షాబుద్దీన్ దాదాపు 36 కేసులను ఎదుర్కొంటున్నారు. -
ఖల్ నాయక్
-
షహబుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ షహబుద్దీన్‌కు బెయిల్ మంజూరు అయినా చిక్కులు తప్పడం లేదు. ఆయనకు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..ఈ కేసులో షహబుద్దీన్ వాదనలు కూడా వినాలంటూ ఈ మేరకు సోమవారం నోటీసులు ఇచ్చింది. అయితే షహబుద్దీన్ బెయిల్‌పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (సెప్టెంబర్ 26) వాయిదా వేసింది. షాబుద్దీన్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవ రాయ్ ధర్మాసనం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహబుద్దీన్‌కు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2004లో గిరీశ్ రాజ్, సతీష్ రాజ్ అనే సోదరులను అపహరించుకుపోయి, యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే నిర్థారణతో అతడికికు జైలు శిక్ష పడింది. అయితే పదకొండేళ్ల తర్వాత షహబుద్దీన్‌కు పట్నా కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో బెయిల్‌ను సవాల్ చేస్తూ బిహార్ సర్కార్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. మరోవైపు షహబుద్దీన్‌కు బెయిలు మంజూరు చేయడంపై సివాన్ వాసి చంద్రకేశ్వర్ ప్రసాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన ముగ్గురు కుమారులను షహబుద్దీన్ హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆ గ్యాంగ్‌స్టర్‌ని మళ్లీ జైలుకు పంపండి!
ఒకప్పటి గ్యాంగ్‌స్టర్, వివాదాస్పద ఆర్జేడీ నేత షాహబుద్దీన్‌ను మళ్లీ జైలుకు పంపడమే మంచిదని సివాన్ జిల్లా అధికార యంత్రాంగం నితీశ్‌కుమార్ ప్రభుత్వానికి నివేదించింది. మాజీ ఎంపీ అయిన షాహబుద్దీన్ ఇటీవల జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాహబుద్దీన్‌ను విడుదల చేయడంతో అతని స్వస్థలం సివాన్‌లో భయాందోళన నెలకొందని, స్థానిక ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని, ముఖ్యంగా వ్యాపారులు మళ్లీ బెదిరింపులు ఉంటాయని భయపడుతున్నారని అధికార యంత్రాంగ తమ నివేదికలో తెలిపింది. షాహబుద్దీన్ భయంతో చాలామంది వ్యాపారులు తమ దుఖాణాలు తెరువడం లేదని వెల్లడించింది. షాహబుద్దీన్ బెయిల్‌పై విడుదల కావడంతో నితీశ్ సర్కారుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. బిహార్‌లో 'సుపరిపాలన' పోయి మళ్లీ ఆటవిక రాజ్యం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని, నేరచరితుడైన షాహబుద్దీన్‌ను మళ్లీ జైలుకు పంపాల్సిందేనని బీజేపీ నితీశ్ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది. -
షహబుద్దీన్ విడుదల సమయంలో వాళ్లిద్దరూ..
జర్నలిస్టు రంజన్ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆర్జేడీ మాజీ నేత షహబుద్దీన్ విడుదల సమయంలో జైలుకు రావడం ఇప్పుడు బీహార్ లో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందుస్తాన్ జర్నలిస్టు రంజన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహమ్మద్ కైఫ్ అలియాస్ బంటి, మహమ్మద్ జావేద్ లు పరారీలో ఉన్నారు. షహబుద్దీన్ విడుదల సందర్భంగా ఆయన పక్కనే నిందితులు ఇద్దరూ ఉన్నట్లు మీడియా చానెళ్లలో కనిపించిన విజువల్స్ షాక్ కు గురిచేస్తున్నాయి. స్థానిక రాజకీయ నాయకులు చేస్తున్న అరాచకాలను జర్నలిస్టు రంజన్ ఎండగట్టినట్లు సమాచారం. దీంతో సంఘ విద్రోహశక్తులు ఆయన్ను బెదిరించాయని, మాట వినకపోవడంతో ఈ ఏడాది మేలో ఆయన్ను చంపేసినట్లు తెలిసింది. షహబుద్దీన్ కు పట్టుకలిగిన ప్రాంతమైన శివన్ లో జరుగుతున్న అరాచకాలపై కూడా రంజన్ ఆర్టికల్స్ రాసినట్లు తెలిసింది. షహబుద్దీన్ పై 40 క్రిమినల్ కేసులున్నాయి. దశాబ్దం కాలంగా జైలు జీవితం అనుభవించిన షహబుద్దీన్ పాట్నా హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో గత శనివారం బయటకు వచ్చారు. కైఫ్, జావేద్ లకు సంబంధించిన ఫోటో గ్రాఫ్, వీడియోలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టినట్లు చెప్పారు. విడుదల సమయంలో కైఫ్, జావేద్ లు జైలుకు రావడంపై షహబుద్దీన్ ను విచారిస్తామని శివన్ ఎస్పీ తెలిపారు. తన భర్తను చంపిన వ్యక్తి విజువల్స్ మీడియాలో రావడంపై రంజన్ భార్య స్పందించారు. షహబుద్దీన్ తో బంటి కనిపించడం కన్నా ఆధారాలు మరేం కావాలని పోలీసులను ప్రశ్నించారు?. తాను ఇప్పటికే భయాందోళనల్లో బతుకుతున్నానని, ఇప్పుడు తన పిల్లలకు ఎలాంటి హాని జరుగుతుందేమోనని భయంగా ఉందని వాపోయారు. -
షహబుద్దీన్ ను మళ్లీ జైలుకు పంపాలని యోచన!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ నేత షహబుద్దీన్ తిరిగి జైలుకు పంపేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. సాక్ష్యులను ప్రభావితం చేసే అంశం మీద షహబుద్దీన్ పై క్రైమ్ కంట్రోల్ యాక్ట్(సీసీఏ)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. 2004 ఇద్దరు సోదరులను హత్య చేసిన కేసులో షహబుద్దీన్ 11 ఏళ్ల జైలు శిక్ష అనంతరం గత వారమే బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. షహబుద్దీన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆర్జేడీ నేతలు తనపై చేసిన విమర్శలను నితీశ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ నేతలు చేసిన కామెంట్లు కూటమిలో అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయని జేడీ(యూ) మంత్రి బిజేంద్ర యాదవ్ అన్నారు. ఈ విషయంలో లాలూ జోక్యం అవసరమని, ఆర్జేడీ నేతలపై జేడీ(యూ) నేతలు ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పారు. -
బెయిల్‌పై బయటికొచ్చి చట్టానికి తూట్లు
న్యూఢిల్లీ: యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ 11 ఏళ్ల తర్వాత బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చిన మాజీ ఆర్జేడీ ఎంపీ షహబుద్దీన్, చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆయన విడుదల నితీష్ కుమార్ ప్రభుత్వానికి రోజుకో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. బగల్పూర్ జైలు నుంచి శివాన్ వెళ్లే మార్గంలో షహబుద్దీన్ కాన్వాయ్‌తో పాటు 200 కార్లు ముజఫర్‌పూర్ టూల్ బూత్ దగ్గర అసలు టోల్ ఫీజు కట్టలేదని వెల్లడైంది. టూల్ బూత్ ఉద్యోగాలు ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ ఎంపీ షహబుద్దీన్ కాన్వాయ్‌తో పాటు, 200 పైగా కార్లకు టోల్ ఫీజు సేకరించవద్దని ఆర్డర్లు ప్రభుత్వం నుంచి వచ్చాయని ముజఫర్‌పూర్ టోల్ ప్లాజా మేనేజర్ దీపక్ చౌబే తెలిపారు. ఈ విషయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జంగల్ రాజ్ మళ్లీ బిహార్‌కి వచ్చాడంటూ.. ఈ విషయంపై నితీష్ మౌనవ్యూహం పాటిస్తున్నాడంటూ బీజేపీ నేత నళిని కోహ్లి ఆరోపిస్తున్నారు. షహబుద్దీన్ విడుదల లా అండ్ ఆర్డర్ విషయంలో బిహార్ ముఖ్యమంత్రికి తీవ్ర పరీక్షలు ఎదురుకాబోతున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకవేళ టోల్ ఫీజు చెల్లించలేదనే ఆరోపణలు రుజువైతే నితీష్ ప్రభుత్వం కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వస్తుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే బిహార్ ప్రభుత్వానికి షహబుద్దీన్ విడుదలకు ఎలాంటి సంబంధం లేదని జేడీయూ వివరణ ఇస్తోంది. 2014లో ముగ్గురు సోదరులు సతీష్, గిరీష్, రాజీవ్ రోషన్‌లను అపహరించుకుని పోయి, ఇద్దరు సోదరులపై యాసిడ్ పోసి మరీ హత్య చేశారనే కేసులో షహబుద్దీన్ హస్తమున్నట్టు వెల్లడైన నేపథ్యంలో ఆయనకు యావజ్జీవ శిక్ష ఖరారైంది. ఈ కేసుకు ప్రధాన సాక్షిగా ఉన్నాడంటూ మూడో సోదరుడు రాకేశ్ రోషన్‌కు కూడా వాళ్లు హతమార్చారు. 11 ఏళ్ల అనంతరం ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు.