ఆ ఉద్యోగానికి డాక్టరేట్లు,ఇంజినీర్ల క్యూ!
భోపాల్: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య తీవ్రతకు ఈ ఘటన అద్దం పడుతోంది. మధ్యప్రదేశ్ లోని పదవ తరగతి అర్హత గల నాల్గవ తరగతి గ్రేడ్ ఉద్యోగానికి 34 మంది పీహెచ్డీ ,12 వేల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తాను అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిరుద్యోగ నిర్మూలనకు తీసుకున్న చర్యలు శూన్యమని, ఉపాధి కల్పనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది.
కాగా మహారాష్ట్రలో ఐదు హమాలీ (పోర్టర్) ఉద్యోగాలకు 2,500 మంది దరఖాస్తు చేశారు. నాలుగో తరగతి పాసైతే సరిపోయే ఈ పరీక్ష కోసం ఏకంగా 984 మంది గ్రాడ్యుయేట్లు, 253 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, ఐదుగురు ఎంఫిల్ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేశారు.