Fourth position
-
నాలుగో స్థానంలో ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా ఎగుమతులు భారత్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 11.9 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.1 శాతం అధికం. ఎగుమతుల పరంగా జెమ్స్–జువెల్లరీ, కెమికల్స్ విభాగాలను దాటి ఫార్మా రంగం నాల్గవ స్థానంలో నిలిచింది. 2023లో ఫార్మా రంగం ఆరవ స్థానంలో ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 8–10% ఆదాయ వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అమె రికా, యూరప్ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్లకు బలమైన ఎగుమతులు, ఆఫ్రికా, ఆసియాతో సహా సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లలో రికవరీ, అలాగే స్థిరమైన దేశీయ డిమాండ్‌తో 2024–25లో ఈ స్థాయి ఆదాయ వృద్ధిని సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. స్థిర నగదు ప్రవాహాలు.. 2023–24లో భారత ఔషధ పరిశ్రమ సుమారు 10 శాతం వృద్ధిని సాధించింది. యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నిర్వహణ వ్యయాలు మెరుగవడం.. వెరశి ఆపరేటింగ్ మార్జిన్లు 70–80 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 22.5 శాతానికి చేరే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు సముచిత చికిత్సా విభాగాల్లో కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ.. స్థిర నగదు ప్రవాహాలు, తక్కువ ఆర్థిక పరపతి నుండి కూడా ఈ రంగం ప్రయోజనం పొందుతుందని అంచనా. గత ఏడాది రూ.4.1 లక్షల కోట్ల మార్కెట్లో సగానికి బాధ్యత వహించే 190 ఔషధ తయారీ కంపెనీల ఆదాయాల ఆధారంగా క్రిసిల్ నివేదిక రూపొందించింది. ఆదాయం దాదాపు సమానం.. దేశీయ విక్రయాలు, ఎగుమతుల మధ్య ఆదాయం దాదాపు సమానంగా ఉందని క్రిసిల్ వెల్లడించింది. దేశీయ ఆదాయంలో అధికంగా దీర్ఘకాలిక, తీవ్ర చికిత్సా విభాగాల ద్వారా సమకూరుతోంది. ఎగుమతుల ఆదాయం ప్రధానంగా ఫార్ములేషన్స్ 80 శాతం, బల్క్ డ్రగ్స్ 20 శాతం నమోదవుతోంది. 2024–25లో ఫార్ములేషన్ ఎగుమతులు రూపాయి పరంగా 12–14 శాతం పెరుగుతాయని అంచనా. యూఎస్, యూరప్ వంటి నియంత్రిత మార్కెట్లు 13–15 శాతం వృద్ధిని సాధిస్తాయి. కొనసాగుతున్న ఔషధాల కొరత, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఉత్పత్తుల వైపు మళ్లడం ఇందుకు కారణం. సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లకు ఎగుమతులు 8–10 శాతం పెరగవచ్చు. విదేశీ మారక నిల్వలను మెరుగవడం, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో కరెన్సీల స్థిరీకరణ ఇందుకు సహాయపడుతుంది. దేశీయంగా మార్కెట్ ఇలా.. ఫార్మా పరిశ్రమ ఆదాయం దేశీయంగా 7–9 శాతం పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం) ఉత్పత్తులలో ధరల పెరుగుదల ఇందుకు దోహదం చేయనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీలో జరిగిన కొద్దిపాటి మార్పుల కారణంగా ఎన్ఎల్ఈఎం పోర్ట్‌ఫోలియో వృద్ధి తగ్గుతూనే ఉంటుంది. పెరుగుతున్న జీవనశైలి సంబంధిత వ్యాధులు, మహమ్మారి అనంతర ఆరోగ్య అవగాహన అధికం కావడం వంటి కారణంగా దీర్ఘకాలిక చికిత్సల విభాగం దేశీయ ఆదాయ వృద్ధికి కీలకంగా దోహదపడుతుందని క్రిసిల్ భావిస్తోంది. -
తిలక్ వర్మ... పేరు గుర్తుంచుకోండి!
తిలక్ పేరులో ‘లక్’ ఉంది. ఈ ‘లక్’ చోటు వచ్చేందుకు పనికొస్తుందేమో కానీ... రాణించేందుకు ఏమాత్రం ఉపయోగపడదు. శక్తి, సామర్థ్యాలతో పాటు టెక్నిక్, వచి్చన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్న పట్టుదల, పాతుకుపోవాలన్న సంకల్పమే ఏ ఆటగాడినైనా నిలబెడతాయి. ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ కూడా అదే చేశాడు. కష్టపడే జట్టులోకి వచ్చాడు. వచ్చాక ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఈ నిలకడే భారత టీమ్ మేనేజ్మెంట్ కంట నాలుగో స్థానంపై ఆశాకిరణమయ్యేలా చేస్తోంది. ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో దంచేస్తుంటే అందరికి తెలిసొచి్చంది. కానీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) డివిజన్ లీగ్ క్రికెట్లోనే అతను వార్తల్లో వ్యక్తి అని చాలా మందికి తెలియదు. మూడు రోజుల ఆటలో జట్టును అర్ధ సెంచరీలతో ఆదుకున్నాడు. సెంచరీలతో గెలిపించాడు. ఐపీఎల్ వేలంలోకి వచ్చాక లీగ్‌లో మనోడున్నాడు అనిపించాడు. నిలకడైన ఆటతో మెల్లిగా ముంబై ఇండియన్స్ జట్టు మొనగాడయ్యాడు. ఇప్పుడు కరీబియన్‌కు తీసుకెళ్తే భారత ఆశాకిరణమయ్యాడు. అలా ఒక్కో మెట్టెక్కుతూ... కింది నుంచే పైకొచ్చాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తిలక్ ఆ సీజన్లో ముంబైని మురిపించాడు. షాట్ల ఎంపిక, బంతిని పంపిన ప్లేసింగ్ తీరు, ధాటిగా ఆడే నైపుణ్యం ఇవన్నీ గమనించిన ముంబై యాజమాన్యం అతనికి విరివిగా అవకాశాలిచి్చంది. అన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దింపింది. దాంతో 131.02 స్ట్రయిక్‌రేట్‌తో 397 పరుగులు చేశాడు. 36.09 సగటు నమోదు చేశాడు. ఈ సీజన్లోనూ 11 మ్యాచ్‌ల్లో ఆడిస్తే 164.11 స్ట్రయిక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు. సగటేమో 42.87! అంటే ఈ రెండేళ్లలో సగటు, స్ట్రయిక్‌రేట్ రెండు పెంచుకున్నాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ గణాంకాలతోనే తిలక్ వర్మ అదరగొట్టాడనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే ముంబై కష్టాల్లో ఉంటే ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే... అతను మాత్రం యథేచ్ఛగా ఆడిన తీరే అందరిమెప్పు పొందేలా చేసింది. క్రికెట్ విశ్లేషకులు, ప్రముఖ టీవీ వ్యాఖ్యా తలే కాదు... దిగ్గజ క్రికెటర్లు సైతం తిలక్ వర్మ ఆటకు, ఆడిన తీరుకు ముచ్చటపడ్డారు. ప్రశంసలు కురిపించారు. విండీస్‌లో సిక్సర్లతో... అతని ప్రతిభను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కూడా గుర్తించి కరీబియన్ పర్యటనకు పంపింది. కేవలం టి20ల్లో మాత్రమే అవకాశమిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అరుదుగా లభించిన ఈ సదవకాశాన్ని హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ వదులుకోలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెపె్టన్ హార్దిక్ పాండ్యాల గేమ్ ప్లాన్‌లో భాగమైన తిలక్... విండీస్ తురుపుముక్కలైన సీమర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు... కానీ అంతర్జాతీయ పరుగుల ప్రయాణాన్ని మాత్రం సిక్సర్లతో ప్రారంభించాడు. తొలి రెండు టి20ల్లో 39 పరుగులు, 51 పరుగులు అతనిదే టాప్ స్కోర్! తర్వాత మూడు మ్యాచ్‌ల్లో 49 నాటౌట్, 7 నాటౌట్, 27 పరుగులు... ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యత కనబరిచాడు. ఓవరాల్‌గా 173 పరుగులతో ఈ సిరీస్‌లో భారత టాప్ స్కోరర్‌గా అవతరించాడు. అందుకే భారత కెపె్టన్ రోహిత్ ఓ ఇంటర్యూలో హైదరాబాదీ ఆటగాడిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ప్రశంసించాడు. ఆసియా కప్, ప్రపంచకప్‌లపై... యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత బదులు తోచని ప్రశ్నగా మిగిలిపోయిన నాలుగో స్థానం ఇప్పుడు తిలక్‌ను ఊరిస్తోంది. ఆసియా కప్‌లో సెలక్టర్లు మాత్రం అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక అక్కడ కూడా మ్యాచ్ మ్యాచ్‌కు ఇలాంటి నిలకడ, ధాటైన జోరు కొనసాగిస్తే మాత్రం స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం అతని పేరును పరిశీలించడం, చోటివ్వడం ఖాయమవుతుందేమో చూడాలి. –సాక్షి క్రీడా విభాగం -
ఏటా వెయ్యి మంది కొత్త సంపన్నులు
⇒ భారత్‌లో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య ⇒ దేశీయంగా నాలుగో స్థానంలో హైదరాబాద్ ⇒ నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: దేశీయంగా మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాబోయే దశాబ్దంలో ఏటా వెయ్యి మంది సంపన్నులు కొత్తగా మిలియనీర్ల జాబితాలో చేరనున్నారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ రూపొందించిన వెల్త్ రిపోర్ట్‌లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.36 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా.. అందులో రెండు శాతం మంది భారత్‌లో ఉన్నారు. అలాగే, 2,024 మంది బిలియనీర్లలో 5 శాతం మంది భారత్‌లో ఉన్నారు. గడిచిన రెండేళ్లలో (2015, 2016) అత్యంత సంపన్నుల సంఖ్య (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) 12 శాతం పెరిగింది. వచ్చే దశాబ్ద కాలంలో ఇది 150 శాతం మేర పెరగనుందని నివేదిక వెల్లడించింది. గడిచిన పదేళ్లలో దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో ఏటా కొత్తగా 500 మంది చేరారని నైట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ శమంతక్ దాస్ తెలిపారు. వచ్చే దశాబ్దంలో ఈ సంఖ్య రెట్టింపై 1,000కి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లోని 125 నగరాల్లో పెరుగుతున్న కుబేరుల సంఖ్యపై అధ్యయనం ఆధారంగా దీన్ని రూపొందించారు. అంతర్జాతీయంగా 900 మంది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకర్లు, వెల్త్ అడ్వైజర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నారు. నివేదిక ప్రకారం గడిచిన దశాబ్ద కాలంలో భారత్‌లో కుబేరుల సంఖ్య ఏకంగా 290% ఎగిసింది. సంఖ్యాపరంగా యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐల వృద్ధి రేటు పరంగా భారత్ గతేడాది ఆరో స్థానంలో నిల్చింది. ఇదే వేగం కొనసాగితే వచ్చే దశాబ్దకాలంలో మూడో స్థానానికి చేరుతుందని సర్వే పేర్కొంది. నికరంగా 30 మిలియన్ డాలర్లు పైగా సంపద ఉన్న వారిని యూహెచ్ఎన్డబ్ల్యూఐలుగా నైట్ ఫ్రాంక్ వర్గీకరించింది. దేశీయంగా టాప్ 4 నగరాలు.. నివేదిక ప్రకారం సంఖ్యాపరంగా అత్యధిక సంపన్నులతో దేశీయంగా ముంబై టాప్‌లో ఉంది. ముంబైలో మొత్తం 1,340 మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు ఉన్నారు. తర్వాత స్థానాల్లో ఢిల్లీ (680), కోల్‌కతా (280), హైదరాబాద్ (260 మంది) ఉన్నాయి. నగర సంపద సూచీలో టొరంటో, వాషింగ్టన్ డీసీ, మాస్కోలను అధిగమించి ముంబై 21వ స్థానం దక్కించుకుంది. బ్యాంకాక్, సియాటిల్, జకార్తాల కన్నా ముందువరుసలో ఢిల్లీ 35వ స్థానంలో ఉంది. ’భవిష్యత్ సంపద’ విభాగంలో అంతర్జాతీయంగా టాప్ 40 నగరాల జాబితాలో ముంబై 11వ స్థానంలో ఉంది. షికాగో, సిడ్నీ, పారిస్, సియోల్, దుబాయ్లను అధిగమించింది. సంపన్న భారతీయులు రియల్టీలో పెట్టుబడులకు సంబంధించి ఆఫీస్ సెగ్మెంట్‌కి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా రెసిడెన్షియల్ మార్కెట్‌పై కొంత ఒత్తిడి నెలకొన్నప్పటికీ.. సంపన్న భారతీయుల్లో 40 శాతం మంది వచ్చే రెండేళ్లలో ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని శమంతక్ దాస్ తెలిపారు.